Saturday, March 26, 2011

కాకర,Bitter gourd

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం..... కాకర (Bitter gourd) ఇండియా అంతా పెంచబడుతున్న ఓ చేదు తీగ జాతి మొక్క. దీని శాస్త్రీయ నామం మొమోర్డికా కరన్షియా (Momordica charantia). ఇది కుకుర్బిటేసి (Cucurbitaceae) కుటుంబానికి చెందినది. ఆరోగ్యాన్ని ఇచ్చే కాకర చేదు అయినప్పటికీ మధుమేహానికి మందు గావాడుతున్నారు . కాయ , కాకర రసము , కాకర ఆకులు మందు గా ఉపయోగ పడతాయి. కాకర రసము లో " హైపోగ్లసమిక్ " పదార్ధము ఇన్‌సులిన్‌ స్థాయిలో తేడారాకుండా నియంత్రణ చేస్తూ రక్తం లొని చెక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది . కాకర గింజలల లో రక్తము లో గ్లూకోజ్ ను తగ్గించే " చారన్‌టిన్‌ " అనే ఇన్సులిన్‌ వంటి పదార్ధము ఉంటుంది . * తమిళము : పావక్కాయ్‌ * కన్నడము : హాగల్‌ కాయి * మళయాలము : కప్పాక్కా * ఓంఢ్రము : కరవిలా * హిందీ : కర్లీ, కరేలా * సంస్కృతము : కారవేల్ల. కాకర రకాలు నల్ల కాకర , తెల్ల కాకర,బారామాసి , పొట్టికాకర ,బోడ కాకర కాయ అని మరొక గుండ్రని కాయ కలదు, ఇది కూడా చేదుగానే ఉండును.
కాకరకాయలు కొంచెము చేదుగా ఉన్ననూ ఉడికించిననూ, పులుసును పెట్టిననూ, బెల్లమును పెట్టి కూరగా చేసినను మంచి రుచికరముగా ఉండును. కొద్దిగా చేదు భరించువారు దీనిని ముక్కలుగా చేసి తినుటనూ కలదు. దీనిలో నీరు తక్కువ పౌష్టిక శక్తి ఎక్కువ. వైద్యమున ఉపయోగాలు : దీనిని తినిన కొద్దిమందికి వేడిచేయును, అటువంటి వారికి దీనిని మజ్జిగలో ఉడికించి ఇవ్వవలెను, తద్వారా చేదు కూడా తగ్గును.
 • కాకరాకు రసమును కుక్క, నక్క మొదలగు వాటి కాటునకు విరుగుడుగా వాడుదురు.
 • కొందరు ఈ ఆకు రసమును గాయాలపై రాస్తారు.
 • మరికొందరు దీనిని చర్మ వ్యాదులకు , క్రిమి రోగములకూ వాడురుదు,
 • కాకరకాయ అనగానే ఒక్క మధుమేహవ్యాధిగ్రస్తులకే మంచిది అనుకోకండి.
 • ఔషధగుణాలున్న కాకరను తరచూ స్వీకరించడం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది.
 • హైపర్‌టెన్షన్‌ని అదుపులో ఉంచుతుంది ఫాస్ఫరస్‌.
 • అధిక మొత్తంలో పీచు లభిస్తుంది.
 • సోరియాసిస్‌ను నివారణలో కాకర కీలకపాత్ర పోషిస్తుంది.
 • శరీరానికి అత్యావశ్యక పోషకాలైన ఫొలేట్‌, మెగ్నీషియం, పొటాషియం, జింక్‌ కూడా సమృద్ధిగా లభిస్తాయి,
 • జీర్ణ శక్తిని వృద్దిచేస్తుంది ,
 • చేదు గా ఉన్నందున పొట్టపురుగు నివారణకు ఉపయోగపడును ,
 • దీనిలో ఉన్న - మోమొకార్డిసిన్‌ యాంటి వైరస్ గా ఉపయోగపడును ,
 • ఇమ్యునో మోడ్యులేటర్ గా పనిచేయడం వల్ల - కాన్సర్ , ఎయిడ్స్ వ్యాదిగ్రస్తులకు మంచిది ,
 • ఇతరత్రా -దీనిని Dysentery , colic, fevers , burns , painful Menstruation ,Scabies, abortifacient మున్నగు వ్యాధులలో వాడవచ్చును .
 • కాకరలో సోడియం, కొలెస్ట్రాల్‌ శాతం తక్కువ.
 • థయామిన్‌, రెబొఫ్లేవిన్‌,
 • విటమిన్‌ బి6,
 • పాంథోనిక్‌ యాసిడ్‌,
 • ఇనుము, ఫాస్పరస్‌లు మాత్రం పుష్కలంగా లభిస్తాయి.
అందుకే కాకరను తరచూ తినండి. కనీసం పదిహేనురోజులకోసారైనా టీ స్పూను కాకర రసం తాగండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. తినే ముందు తీసుకునే జాగ్రత్తలు : విసిన్‌(vicine) అనే పాదార్ధము ఉన్నందున " favism " వచ్చే అవకాశము ఉన్నది , గింజల లో ఉన్న "red arilis " చిన్నపిల్లలో విషపదార్ధం గా చెడు చేయును , గర్భిణీ స్త్రీ లు కాకరను ఏ రూపములో వాడకూడదు . పొట్టి కాకర కాయ :- Green fruit of Momordica muricata.చేదుగ నుండును, త్రిదోషములను హరించును; జ్వరము, దద్దురు, కుష్టు, విషము, కఫము, వాతము, క్రిమిరోగము వీనిని హరించును.
 • ==========================================
Visit my Website - Dr.Seshagirirao

No comments:

Post a Comment