Sunday, March 6, 2011

పచ్చ కర్పూరం కర్పూరం (Camphor) : ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ వుండో ఒక ఘాటైన వాసన గల పదార్థము. ఇది టర్పీను జాతికి చెందిన సేంద్రియ పదార్థం.ఇది కాంఫర్ లారెల్ అనే చెట్లలో దొరుకుతుంది. ప్రత్యేకంగా ఆసియా ఖండంలోనూ, ప్రధానంగా బోర్నియో మరియు తైవాన్ లలో ఎక్కువగా లభిస్తుంది. దీనిని కృత్రిమంగా టర్పెంటైన్ ఆయిల్ నుండి సింథసైజ్ చేసి తయారు చేస్తారు.కర్పూరాన్ని నీటిలో ముంచి వెలిగిస్తే వెలగదు.వెలుగుతున్న కర్పూరాన్ని నీటిలో ముంచినా ఆరిపోతుంది. నీటి మీద ఉంచి వెలిగిస్తే వెలుగుతుంది. నీటిలో కరగదు. కర్పూరం సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ. పర్యాయపదాలు సితాభ్ర (తెల్లని మేఘంలాగా కనిపించేది.) హిమవాలుక (మంచులాంటి రేణువులు కలిగినది.) ఘనసార (మేఘంలాంటి సారం కలిగినది.) హిమ (మంచులాగా చల్లగా ఉండేది.) కర్పూరం చెట్టు ఎలా కనిపిస్తుంది? కర్పూరం చెట్టు వంద అడుగుల వరకూ పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం. చక్కని సువాసన కలిగిన పట్ట కలిగి ఉంటుంది. ఆకులు పొడవుగా ఉంటాయి. పువ్వులు చిన్నవిగా ఉంటాయి. పండు ముదురు ఆకుపచ్చని రంగులో ఉంటుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆకులు రాలతాయి. పండ్లు అక్టోబర్‌లో పక్వానికి వస్తాయి. మన దేశంలో దీనిని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్‌లోనూ, మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి. చైనా, జపాన్ దేశాల్లో కర్పూరం చెట్లు విస్తారంగా పెరుగుతాయి. సహజంగా, తయారుగా లభించే కర్పూరాన్ని భీమసేనీ కర్పూరం లేదా అపక్వ కర్పూరం అంటారు. దీనిని ఔషధ ఉపయోగాలకోసం వాడుకోవచ్చు. పచ్చకర్పూరం: కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనిని కూడా ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు. హారతి కర్పూరం: టర్‌పెన్‌టైన్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారుచేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడకూడదు. కర్పూరం నీళ్లలో అంతగా కరగదు. అయితే ఈథర్‌లో వేగంగా కరిగిపోతుంది. పిప్పర్‌మింట్ లేదా పుదీనాపువ్వు లేదా మెంథాల్‌లోనూ, యవానీ సత్వం లేదా వాముపువ్వు లేదా థైమాల్‌లోనూ వేగంగా కలిసిపోయి ద్రవ రూపాన్ని పొందుతుంది. ఫినాల్, సాలిసిలిక్ యాసిడ్‌లో కూడా కరుగుతుంది. కర్పూరాన్ని అధిక మోతాదులో తీసుకుంటే ప్రమాదకరం. కడుపునొప్పి, వాంతులు, వికారం, తల తిరగడం, చూపు మసకబారటం, ప్రలాపనలు (డెలీరియం), మూత్రం బంధించబడటం, తెలివి తప్పటం వంటి ఇక్కట్లు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా, తగిన మాత్రలో మాత్రమే వాడుకోవాలి. శాస్త్ర గ్రంథాల్లో చెప్పిన ఆయుర్వేదీయ చికిత్సలు, ఔషధ కల్పనలు
  1. కర్పూరంతోనూ బెల్లంతోనూ శనగ గింజలంత మాత్రలు చేసి తీసుకుంటే ఉబ్బసంనుంచి ఉపశమనం లభిస్తుంది. (సిద్ధ్భేషజమణిమాల)
  2. కర్పూరం పొడిని మూత్ర మార్గం లోపలకు ప్రవేశపెడితే మూత్రం జారీ అవుతుంది.
  3. కర్పూరాన్ని స్టెరిలైజ్ చేసిన మేక మూత్రంతో కలిపి ఉత్తరవస్తి రూపంలో మూత్ర మార్గంలోపలకు ప్రవేశపెడితే, మూత్రం జారీ అవుతుంది. (్భవప్రకాశ) కర్పూరంలో దూదిని తడిపి వత్తిచేసి మూత్రమార్గ ద్వారం లోపలకు ప్రవేశపెడితే మూత్రం జారీ అవుతుంది. (్భవప్రకాశ)
  4. కర్పూరం పొడిని మర్రి పాలతో కలిపి కళ్లకు కాటుక మాదిరిగా (అంజనంగా) పెట్టుకుంటే కంటిపైన ఏర్పడిన అపార దర్శకపు పొర కరిగిపోతుంది. (వృందమాధవ, వంగసేన సంహిత, నేత్రరోగాధికారణం)
  5. కర్పూరాన్ని ఆవునెయ్యితో కలిపి గాయమైనచోట, వ్రణం మీద ప్రయోగించి కట్టు కట్టుకుంటే చీము, వాపు, ఇతర ఇనె్ఫక్షన్ లక్షణాలు ఉపశమించి, గాయం త్వరితగతిన మానుతుంది.
  6. చెవి తమ్మెకి సంబంధించిన వ్యాధులు, సమస్యలుంటే ముందుగా ఆవు పిడకలను నిప్పుల మీద వేసి, ధూపం జనింపచేసి చెవి తమ్మెకి తగలనివ్వాలి. తరువాత, కర్పూరాన్ని మేక మూత్రంతో కలిపి బాహ్యంగా చెవి తమ్మెమీద ప్రయోగించాలి.(యోగరత్నాకరం)
  7. కర్పూరాన్ని పొడిచేసి, నోటిలో ఉంచుకొని లాలాజలాన్ని మింగుతుంటే అతి దప్పిక తగ్గుతుంది. (కాశ్యప సంహిత, విశేషకల్పం)
  8. కర్పూరం నూనెలో దూదిని తడిపి లెప్రసీ వ్యాధివల్ల ఏర్పడిన గాయంమీద ప్రయోగిస్తే త్వరితగిన మానుతుంది. (వైద్యమనోరమ)
  9. ఒక పెద్ద చెంచాడు ఆవ నూనెను వేడిచేయాలి. చిన్న ముక్క కర్పూరాన్ని, పావు చెంచాడు చందనం పొడినీ కలిపి పొత్తికడుపుమీద మర్ధనా చేసుకుంటే పొత్తికడుపులో వచ్చే నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది.
  10. పెద్ద చెంచాడు కర్పూరం పొడిని అరకప్పు కొబ్బరినూనెలో కలిపి ఛాతిమీద రాసుకొని మర్ధనా చేసుకుంటే ఉబ్బసం, ఆయాసం తగ్గుతుంది.
  11. పెద్ద చెంచాడు కర్పూరాన్ని అర కప్పు ఆలివ్ నూనెలో కలిపి వేడిచేసి, అవసరమైన భాగంలో ప్రయోగిస్తుండాలి. శయ్యావ్రణాలు తయారుకాకుండా దీనిని నివారణగా కూడా వాడవచ్చు.
  12. బ్రాంకైటిస్, జలుబు, జ్వరం, తలనొప్పి వస్తే నీళ్లను బాగా పొగలుకక్కేలా మరిగించి పెద్ద వెడల్పాటి పాత్రలోగాని లేదా పాన్‌లో గాని పోసి, కర్పూరం కలిపితే ఆవిరి విడుదలవుతుంది. తల మీద టవల్ కప్పుకొని ఈ ఆవిరిని గాఢంగా పీల్చాలి. దీంతో బ్రాంకైటిస్ లక్షణాల తీవ్రత తగ్గుతుంది. ఆవిరిని పీల్చుతున్నప్పుడు ఒకవేళ కళ్లు బైర్లుకమ్మితే ఆవిరి పీల్చడం ఆపేయాలి.
  13. చిగుళ్లవాపు, నోటి దుర్వాసన, చిగుళ్లనుంచి చీముకారటం తదితర సమస్యలుంటే
  14. వేప చెట్టు పట్ట, లవంగాలు, కరక్కాయ పెచ్చుల చూర్ణం, మర్రిచెట్టు లేత ఊడలు, కర్పూరం వీటిని 1:1:3:6 నిష్పత్తిలో తీసుకొని బాగా నూరి పొడిచేసి గాలి చొరబడని సీసాలో నిల్వచేసుకొని దంత ధావన చూర్ణంగా వాడుకోవాలి.
  15. ముక్కునుంచి రక్తం కారటం తగ్గాలంటే చిటికెడు కర్పూరం పొడిని చెంచాడు కొత్తిమీర రసానికి కలపాలి. చిన్న దూది ఉండను దీనిలో ముంచి రెండు ముక్కు రంధ్రాల్లోనూ బిందువులుగా వేసుకోవాలి.
  16. ఆమవాతంలో వచ్చే కీళ్లనొప్పి (రుమాటిక్ పెయిన్)కు రెండు పెద్ద చెంచాల కర్పూరం పొడిని అర కప్పు కొబ్బరి నూనెలో కరిగించి నిల్వచేసుకోవాలి. దీనిని వాపు, నొప్పి కలిగిన కీళ్లమీద ప్రయోగించి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
  17. చిన్నపిల్లల తలమీద తయారైన ఫంగల్ ఇనె్ఫక్షన్లు, జుట్టు రాలే సమస్యకు చిన్న చెంచాడు కర్పూరం పొడిని 2 పెద్ద చెంచాలు కొబ్బరినూనెలో కలిపి వ్యాధిగ్రస్థమైనచోట కొన్ని రోజులపాటు ప్రయోగిస్తే ఫంగస్ తగ్గి జుట్టు ఊడటం ఆగిపోతుంది.
  18. దంతాల నొప్పి, చిగుళ్లవాపుకు చిన్న కర్పూరం ముద్దను, 3-4 లవంగ మొగ్గలను, 2-3 మిరియం గింజలను కలిపి మెత్తగా నూరి చిగుళ్లమీద ప్రయోగిస్తే నొప్పి, వాపు వంటి లక్షణాలనుంచి ఉపశమనం లభిస్తుంది.
  19. మహిళల్లో మర్మావయవాల దురద (వెజైనల్ ఇచ్చింగ్)తగ్గాలంటే చెంచాడు కర్పూరాన్ని గులాబీ నీళ్లతో (రోజ్‌వాటర్‌తో) కలిపి మెత్తగా నూరాలి. దీనిలో ఒక స్వచ్ఛమైన గుడ్డను ముంచి, టెంపూన్ మాదిరిగా మర్మావయవంలోనికి చొప్పించి పావుగంటపాటు ఉంచాలి. అవసరాన్నిబట్టీ దీనిని రోజుకు 2-3సార్లు ప్రయోగించాలి.
------- - డా. చిరుమామిళ్ల మురళీమనోహర్
  • ========================================
Visit my Website - Dr.Seshagirirao

No comments:

Post a Comment