Wednesday, March 2, 2011

మునగ కాయలు ,Moringa Green Sticks

పండ్లు , కాయగూరలు ,గింజలు , పప్పులు , కందమూలాలు , మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం. ప్రకృతి పరంగా లభించే పండ్లు, కూరగాయలను తీసుకోవడంతో మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. శరీరానికి కావలసిన పోషకపదార్థాలు పండ్లు, తృణదాన్యాలు , సుగందద్రవ్యాలు ,కూరగాయల్లో ఉంటాయనడంలో సందేహం లేదు. దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునగ ఒకటి. ఈ చెట్టు ఉపయోగాలు ఎన్నో..ఎన్నెన్నో.. చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే. పోషకాలు కూడా ఎక్కువే. పంటగా కూడా సాగు చేసే మునగలోని మంచి గుణాలు తెలుసుకుందాం. -మునగ శాస్ర్తీయ నామం ‘మొరింగ బలిఫెర’ ఇది మొరింగేసి కుటుంబంలోనిది. సులువుగా పెంచే, తొందరగా పెరిగే మొక్క లలో ఇది ఒకటి. దీన్ని పంటగా కూడా సాగు చేస్తున్నారు. విశేషమైన పోషకాలున్న చెట్టుగా ఇది ప్రసిద్ధి కూడా. 5000 సంవత్సరాల క్రితమే ఇది వాడుకలో వున్నట్లు తెలుస్తోంది. మునగ కాయలే కాకుండా ఆకులు కూడా చాలా బలమైన ఆహారం.బాక్టీరియా, శిలీంధ్ర, కీటక సంహారిగా దీనిని వుపయోగిస్తారు. ఎరువుగా కూడా దీన్ని వుపయోగిస్తారు. వేర్లు, ఆకులు, కాయలు, విత్తనాలు వైద్యంలో వుపయోగిస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రయోగాల, పరిశోధనల ఫలితంగా తక్కువ వ్యయంతో మునగ విత్తనాలతో నీటిలోని బ్యాక్టీరియాను నిర్మూ లించి, నీటిని శుద్ధి చేయొచ్చు. సాగు : -ఉత్తర భారతదేశంలోని దక్షిణ పర్వత ప్రాంతల్లో ఇది పుట్టినట్లు తెలు స్తోంది. అన్ని ప్రాంతాల నేలలు అనుకూలం. 9-10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. సాగు చెట్లలో అధిక దిగుబడి కోసం ఒక మీటరు కంటే ఎక్కువగా పెరగనీయకుండా కత్తిరిస్తారు. కొమ్మలు కొందికి వాలినట్లు వుండి దృఢంగా వున్నా కూడా ఇది చాలా పెళుసు. చిన్న గాలులకు, తాకిడికి సైతం విరిగిపోతుంటాయి. అందుకే మునగ చెట్టు ఎక్కకూడదని అంటారు. ఈ చెట్టు పూలు తెల్లగా, గుత్తులు, గుత్తులుగా పూస్తాయి. కాయలు మూడు పలకలుగా 50 సెంటీ మీటర్ల పొడువు, 1-2 సెంటీ మీటర్ల వెడల్పు వుండి కాడల్లా వుంటాయి. అందుకే ములగకాడ అని కూడా అంటారు. ఎండిన తరువాత కాయలు మూడు భాగాలుగా చీలి, 3 రెక్కలతో కూడిన విత్తనాలు బయటికి వస్తాయి. విత్తనాలు కొమ్మల కత్తిరింపుల ద్వారా ఇవి విస్తరిస్తాయి.
శాస్ర్తీయ పరిశోధనల్లో విత్తనాలతో నీటిని శుద్ధి చేసే ప్రక్రియ కార్పొరేట్‌ సంస్థ అయిన జాన్‌ విల్ల హాసన్స్‌ మునగపై శాస్త్ర పరంగా ప్రయోగాలు చేసి మునగ విత్తనాలతో నీటిని పరి శుద్ధం చేయొచ్చని నిరూపించారు. విత్తనాలను తీసి బాగా మెత్తగా రుబ్బి ఆ పదా ర్థాన్ని శుద్ధి చేయాల్సిన నీటిలో బాగా కలిపి ఒక గంట సేపు వుంచాలి. పిండితో పా టు బాక్టీరియా, మలినాలు అన్నీ నీటి అడుగుకు చేరుతాయి. పైన తేలిన నీటినివినియోగించుకోవచ్చు.
మునగలోని పోషకాలు : -విటమిన్‌ ఎ, సి, సున్నము, పొటాషియం ఇందులో ఎక్కువగా వుంటాయి. ఆకును కూడా వంటల్లో వినియోగిస్తారు. పచ్చటి ఆకులే కాక కొంచెం నీడలో ఎండబెట్టి, పొడిచేసి నిలువ కూడా వుంచుకోవచ్చు.అవసరమైనపుడు సంవత్సరం పొడవునా అందుబాటులో వుంటుంది. సి విటమిన్‌ తప్ప మిగిలిన పోషకాలేవీ నశించవు, తగ్గవు. వంద గ్రాముల ఆకుల్లో కాల్సియం - 440 మిల్లీ గ్రాములు, ఇనుము- 0.85 మి.గ్రా, బీటా కెరోటీన్లు అధికంగా వుంటాయి. వేరు క్రిమిసంహారిగాను, గనేరియా, సిఫిలిస్‌ వ్యాధులకు మంచి చికిత్స. ఆకులు, బెరడు, వాత, కంటి సమస్యలకు మంచి మందు. ఆకులు మంచి ఎరువు. పాడి పశువులకు ఆకులు బలవర్ధకం. పాల ఉత్పత్తి 43-60 వరకు పెరుగుతుంది. మునగ మాను నుండి జిగురు పదార్థం లభిస్తుంది. వస్త్ర, తోలు పరిశ్రమలలోను, సౌం దర్య సాధనలోను దీన్ని విరివిగా వాడుతారు. ఇలా వద్దు చాలా మంది మునగ కాయ గుజ్జును మాత్రమే గోటితో తీసి తింటారు. చెక్క వదిలేస్తారు. ఇలా చేస్తే అందులోని పూర్తి పోష కాలు అందనట్టే. చెక్కను నమిలి సారాన్ని కూడా తీసుకోవాలి. పెరడు వున్న వాళ్లు మునగ కొ మ్మలను నాటితే ఆరు నెలలకే కాయలు వస్తా యి. హైబ్రిడ్‌ రకాలైతే మరీ ఎత్తు పెరగకుండా కాయలు ఎక్కువగా వస్తాయి. మునగ చెట్టు ఎక్కవద్దన్నారు కానీ మునగను తినవద్దనలేదు మన పె ద్దలు. భౌతికంగా ఎంతో బలహీనంగా ఉండే ము నగ మనిషికి అంత శక్తినివ్వడం విచిత్రమే.
  • =================================
Visit my Website - Dr.Seshagirirao

No comments:

Post a Comment