Monday, August 15, 2011

ఉత్సాహానికి ఈ 7 తినాలి , Eat these 7 for active Strength

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. మంచి ఆహార అలవాట్లలో ఒకటేమిటంటే " నాకు అది ఇష్టము , ఇది ఇష్టము " అని బెట్టు చేయకుండా ... ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏదీ కాదనకుండా తినడం . అయితే మెరుపులీనే చర్మము , మంచి ఆరోగ్యము కోసము కోసమే అని గుర్తుంచుకుని మరీ తినాల్సినవి ఏడు ఉన్నాయి . రోజంతా ఉత్సాహముగా ఉండాలంటే బాగా పోషక విలువలున్నవి తినాలి . ఇవి అలాంటివే ": 1. టొమాటో : దీనిలోని లైకోపిన్‌ కాన్సర్ నిరోధకం గా పనిచేస్తుంది . గుండె , రక్తనళాలకి సంబంధించిన అనారోగ్యాన్ని కూడా నిరోధిస్తుంది . మన చర్మానికి ఎండ తాలూకు ప్రభావాలనుండి రక్షించడములో మిగతా పోషకాలతో పాటు టమాటోల పాత్ర చెప్పుకోదగినదే . 2.నట్స్ : ముఖ్యముగా వాల్ నట్స్ లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ , ప్లాంట్ స్టెరోల్స్ సమృద్ధిగా ఉంటాయి . కొలెస్టరాల్ లెవల్ తగ్గించడం లో వీటి పాత్ర అమోఘము . వాల్నట్స్ పీచుపదార్షము , ప్రోటీన్‌ ఇతోదికముగాను , మెగ్నీషియం ,కాఫర్ , ఫోలేట్ , విటమిన్‌-ఇ , ఉండి శక్తివంతమైన యాంటి ఆక్షిడెంట్స్ ని శరీరానికి అందిస్తాయి. నిజానికి ఓ సూపర్ డ్రింక్ ఇది . బ్లడ్ ప్రషర్ తగ్గిస్తుంది . ఆస్టియోపొరోసిస్ రాకుండ ఆపుతుంది . గుండె ఆరోగ్యాన్ని , చర్మానికి ఎండనుండి కలిగే హానినుండి కాపాడుతుంది . 3.టీ : నిజానికి టీ ఓ సూపర్ డ్రింక్ .బ్లడ్ ప్రెషర్ని కొంత తగ్గిస్తుంది . ఆస్టియోపొరోసిస్ రాకుండా ఆపుతుంది , గుండే ఆరోగ్యానికి పకకరిస్తుంది . చర్మానికి ఎండచేసే హానిని నిరోధిస్తుంది . చర్మాన్ని అంత త్వరగా ముడతలు పడనివ్వదు . కళ్ళకు మెరుపు అందిస్తుంది . కేటరాక్ట్ ముదరటాన్నీ నెమ్మదింపచేస్తుంది . 4.యోగర్డ్ లేదా పెరుగు : ప్రోటీన్‌ , కాల్షియం , విటమిన్‌-బి లను అందిస్తుంది . ఇవన్నీ కలిసి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి . ఇంపెక్షన్‌ కలగకుండా పోరాడతాయి . యోగర్డ్ మన శరీర ఆరోగ్యానికి , డైజెస్టివ్ ట్రాక్ (digestive Track) నెర్వస్ సిస్టం (nervous system ) మేలుచేస్తుంది . పైగా క్యాన్సర్ , ఎలర్జీలు , అధిక రక్తపోటు , హై-కొలెస్టిరాల్ బారిన పడకుండా కాపాడుతుంది . 5.బీన్స్ : ప్రోటీన్స్ , పీచుపదార్ధము , విటమిన్లు , మినరల్స్ , ఫైటో న్యూట్రియెంట్స్ ... ఇవన్నీ బీన్స్ లో సమృద్ధిగా ఉంటాయి . అలాగే కొవ్వుకు సంబంధించిన చెడు లక్షణాలు ఉండవు . బీన్స్ క్యాన్సర్ రాకుండా తోడ్పడుతాయి . డయాబెటీస్ తో పొరాడుతాయి . . సుగర్ లెవల్స్ సమతుల్యముగా ఉండేటట్లు చూస్తూనే సురక్షితమైన , నిలకడ అయిన నెమ్మదిగా ఖర్చయ్యే శక్తిని అందిస్తుంది . అదేసమయములో కొలెస్టరాల్ లెవెల్స్ నీ కొంతమేరకు తగ్గిస్తాయి . బీన్స్ తో చేసిన కూరలు తిన్నప్పుడు కడుపు నిండి నట్లు ఉంటోంది గాని అధిక క్యాలరీలు లేకపోవడం వలన బరువు పెరిగే సమస్యే ఉందదు . 6.బెర్రిస్ ... ముఖ్యము గా నేరేడుపండ్లు : వృద్దాప్యము త్వరగా రాకుండా చేస్తాయి . వృద్ధులవుతున్న కొద్దీ మెదడు నెమ్మదించేఅవకాశమున్నది . అలాంటి అనారోగ్యలనుండి కాపాడుతాయి. వీటిలో యాంటీ ఆక్షిడెంట్స్ , క్యాన్సర్ నిరోధకాలు ఉంటాయి. 7. ఆకుకూరలు : బ్రొకోలిలాంటి ఆకుకూరలు చాలా రకాల క్యాన్సర్ ల నుండి కాపాడుతాయి . వీటిలో విటమిన్‌ బి, సి ,ఇ , ఫొలేట్ , పొటాషియం , సమృద్ధిగా ఉంటాయి . ఎముకల ఆరోగ్యానికి అమోఘమైనవి . కాల్సియం ని శరీరం ఇముడ్సుకోవటానికి తోడ్పతాయి . వృద్ధాప్యములో వచ్చే కేటరాక్ట్ లను నిరోదించడములో స్పినాచ్ తోడ్పడుతుంది . పీచుపదార్ధము ఉండడం మరో మేలైన అంశము .
  • ==================================
Visit my Website - Dr.Seshagirirao

No comments:

Post a Comment