పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. సీజన్ వస్తోందంటే చాలు... కొన్ని పండ్ల రుచి పదే పదే గుర్తొచ్చేస్తుంటుంది. మార్కెట్లో అవి ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అన్నట్లు ఎదురుచూసేలా చేస్తుంది. ఆ కోవకే చెందుతాయి సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలాలు. ఈపేర్లు చూస్తే మన పురాణ పురుషులకు ఇష్టమైన పండ్లేవో అనిపించకమానదు. అంతేకాదు, ఇవి అచ్చంగా మనకి మాత్రమే ప్రత్యేకమైన పండ్లేనేవో అనిపిస్తుంది. కానీ వీటి స్వస్థలం మనదేశం కాదు. దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికన్ దేశాల్లో పెరిగే ఈ వెుక్కల్ని మనదేశానికి తొలిసారిగా పోర్చుగీసువాళ్లు పదహారో శతాబ్దంలో తీసుకొచ్చారట. ఆ తరవాత వీటికా పేర్లు ఎవరు పెట్టారో తెలియదుకానీ మనందరికీ ఇష్టమైన రాముడు, సీత, లక్ష్మణ పేర్లు పెట్టేసి తమ భక్తిని చాటుకున్నారు. మనరాష్ట్రంలో ఎక్కువగా పండే సీతాఫలాలతోనే మనకి అనుబంధం ఎక్కువ. కానీ ఉత్తరాంధ్ర, కొన్ని తెలంగాణా జిల్లాల్లోనూ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ రామాఫలాలు, లక్ష్మణఫలాలు ఎక్కువగా పండుతాయి. సూపర్‌మార్కెట్ల పుణ్యమా అని ఇప్పుడిప్పుడు ఇవి అన్ని మార్కెట్లిలోనూ కనిపిస్తున్నాయి.
లక్ష్మణఫలం : దీన్నే కొన్ని ప్రాంతాల్లో హనుమాన్ ఫలం అనీ పిలుస్తారు. పనసకాయలకు ఉన్నట్లుగా ముళ్లు ఉండటంతో ముళ్ల సీతాఫలం అనీ అంటారు. పండిన తరవాత కాస్త పుల్లని రుచి కలిగి ఉండటంతో పుల్లపండు అనీ అంటారు. అయితే పూర్తిగా పండిన తరవాత పైనాపిల్, స్ట్రాబెర్రీ రుచులతో కూడిన అరటిపండు రుచిని తలపిస్తుంది. గింజలు తక్కువ, గుజ్జు ఎక్కువ ఉండే ఈ పండ్లని జ్యూసులు, చాక్లెట్లు, ఐస్‌క్రీముల తయారీలో ఎక్కువగా వాడతారు. రామాఫలం మాదిరిగానే ఇవి కూడా కరీబియన్, మధ్య అమెరికా దేశాల్లోనే ఎక్కువగా పండుతాయి. మనదేశంలో ఆంధ్రప్రదేశ్, కేరళ, అసోంలలో ఇవి ఎక్కువ. స్థానికులు వీటి ఆకుల్నీ, గింజల్నీ కూడా అనేక రోగాల చికిత్సలో వాడుతుంటారు. ఈ చెట్టు ఆకుల నుంచి తయారుచేసిన ట్రియామెజాన్ అనే మందును అనేక మార్కెట్లలో లైసెన్స్ లేకుండానే విక్రయిస్తున్నారు. ఇది కాన్యర్‌కు బాగా పనిచేస్తుందని అనేకమంది నిపుణులు పరిశోధన పత్రాల్నీ రూపొందించారు. అందుకే అమెజాన్ అడవుల్లో నివసించేవాళ్లు దీన్ని మిరకిల్ ట్రీ అని పిలుస్తారు. ముఖ్యంగా పొట్టలోని నులిపురుగుల నివారణకు ఈ పండు అద్భుతంగా పనిచేస్తుందట. బెరడు, వేళ్లతోచేసే ఈ టీ తాగితే డిప్రెషన్ తగ్గుతుందనీ చెబుతారు.
- పోషకాలు: 100 గ్రా. గుజ్జునుంచి
- 140 క్యాలరీల శక్తి,
- 39 గ్రా. పిండిపదార్థాలు,
- 7.5 గ్రా. పీచు,
- 2.5గ్రా. ప్రొటీన్లూ లభిస్తాయి. విటమిన్-సి, విటమిన్ బి1, బి2, పొటాషియం కూడా ఎక్కువగా ఉంటాయి.
ఏడాదిపొడవునా దొరికితే బాగుండు అనిపించే మధురమైన రుచి... ఆపై అద్భుత పోషకాలు... అందుకే ఈ ఫలాలు అమృతఫలాలు!
- ===========================
Visit my Website -
Dr.Seshagirirao
Use full information Thank you sir
ReplyDeleteThanks for your compliment.
ReplyDeletesir what is avocado its avialble here
ReplyDelete