- ============================================
Sunday, October 16, 2011
రామాఫలం, Rama phal Fruit
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
సీజన్ వస్తోందంటే చాలు... కొన్ని పండ్ల రుచి పదే పదే గుర్తొచ్చేస్తుంటుంది. మార్కెట్లో అవి ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అన్నట్లు ఎదురుచూసేలా చేస్తుంది. ఆ కోవకే చెందుతాయి సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలాలు.
ఈపేర్లు చూస్తే మన పురాణ పురుషులకు ఇష్టమైన పండ్లేవో అనిపించకమానదు. అంతేకాదు, ఇవి అచ్చంగా మనకి మాత్రమే ప్రత్యేకమైన పండ్లేనేవో అనిపిస్తుంది. కానీ వీటి స్వస్థలం మనదేశం కాదు. దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికన్ దేశాల్లో పెరిగే ఈ వెుక్కల్ని మనదేశానికి తొలిసారిగా పోర్చుగీసువాళ్లు పదహారో శతాబ్దంలో తీసుకొచ్చారట.
ఆ తరవాత వీటికా పేర్లు ఎవరు పెట్టారో తెలియదుకానీ మనందరికీ ఇష్టమైన రాముడు, సీత, లక్ష్మణ పేర్లు పెట్టేసి తమ భక్తిని చాటుకున్నారు.
మనరాష్ట్రంలో ఎక్కువగా పండే సీతాఫలాలతోనే మనకి అనుబంధం ఎక్కువ. కానీ ఉత్తరాంధ్ర, కొన్ని తెలంగాణా జిల్లాల్లోనూ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ రామాఫలాలు, లక్ష్మణఫలాలు ఎక్కువగా పండుతాయి. సూపర్‌మార్కెట్ల పుణ్యమా అని ఇప్పుడిప్పుడు ఇవి అన్ని మార్కెట్లిలోనూ కనిపిస్తున్నాయి.
రామాఫలం :
గుండ్రంగా హృదయాకారంలో ఎరుపురంగులో ఉండే ఈ పండ్ల తొక్క సీతాఫలంకన్నా నునుపుగా ఉంటుంది. దీన్ని నెట్టెడ్ కస్టర్డ్ యాపిల్, బుల్లక్ హార్ట్, బుల్ హార్ట్ అని కూడా పిలుస్తారు. తియ్యని వాసనతో మధురమైన రుచిని కలిగి ఉండే ఈ పండు మధ్య అమెరికా, ఐరోపా దేశాల్లో ఎక్కువగా పండుతుంది. సీతాఫలంతో పోలిస్తే ఇందులో గింజలు తక్కువ. అలసిన శరీరాన్ని ఉత్తేజితం చేస్తుంది ఈ జ్యూస్. మిగిలినవాటితో పోలిస్తే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. మలేరియా, క్యాన్సర్ వ్యాధులకు కారణమైన కణాలను నివారించే గుణం కూడా ఈ పండుకి ఎక్కువే.
పోషకాలు: వంద గ్రా. రామాఫలం నుంచి 75 క్యాలరీల శక్తి, 17.7గ్రా. కార్బొహైడ్రేట్లు, 1.5గ్రా. ప్రొటీన్లు, 3గ్రా. పీచూ లభ్యమవుతాయి. మిగిలినవాటితో పోలిస్తే ఇందులో విటమిన్ల శాతం ఎక్కువ. సి- విటమిన్‌తో పాటు బి-కాంప్లెక్స్‌లోని పైరిడాక్సిన్ ఇందులో సమృద్ధిగా ఉంటుంది. ఈ పైరిడాక్సిన్ మెదడు కణాలకు అవసరమైన రసాయనాల్ని స్థిరంగా ఉంచేందుకు దోహదపడుతుంది. నరాల వ్యాధులు, తలనొప్పి వంటివి రాకుండా కాపాడేందుకు తోడ్పడుతుంది.
Labels:
bull heat fruit,
Rama phal Fruit,
రామాఫలం
Subscribe to:
Post Comments (Atom)
sir how to reduce homocystine level?
ReplyDelete