Tuesday, October 11, 2011

దవనం నూనె ,Artimissia.pallense (దవనం)Oil,మాచపత్రి , Artmisia indica

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. Plant name: (Sanskrit) Machi patram (Telugu)(Davanam(Machapatri)–Botanical name:Artmisia indica (మాచ పత్రి ) A.pallense(Family: Asteraceae) (దవనం)A.Small aromatic herb. In some books it is written as A.Pallens.Medicinal Use: Aromatic, tonic, anti malarial & digestive. ఇండియన్ మెడిసిన్ అయిన ఆయుర్వేదంలోను, యునాని వైద్యంలోను దవనానికి ఒక ప్రత్యేక స్ధానముంది. దవనం మొక్క మంచి ఔషధ ప్రయోజనాలను కల్పిస్తుంది. సాధారణంగా దీనిని హిందువులు కొన్ని మతపర వేడుకలలో వాడుకోవటమే చాలామందికి తెలుసు , దవనం నూనె వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో పరిశీలిద్దాం.
  • దవనం నూనెను సువాసన కొరకు వాడతారు. ఈ నూనె వాసన ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది.
  • శరీరంపై వచ్చే దద్దుర్లు, పుండ్లు మొదలైనవాటిని దవనం నూనె తగ్గిస్తుంది. మహిళలు తమ కాన్పు తర్వాత పొట్టపై వచ్చే స్ట్రెచ్ మార్కులను పొగొట్టుకోటానికి దవనం నూనెను పొట్ట భాగంపై రుద్దుతారు. రుతుక్రమం సరిగా రావటానికి, తిన్న పదార్ధాలు జీర్ణం కావటానికి కూడా ఈ రకమైన మర్దన చేస్తారు.
  • దవనం నూనె శరీరంలో బ్లడ్ షుగర్ స్ధాయిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. దీనిని షుగర్ వ్యాధి వున్న వారికిచ్చే మందులలో కలుపుతారు.
  • దవనం నూనెను కండరాల నొప్పులకు సడలింపు కు మంచి ఔషధంగా వాడవచ్చు. నూనెను మర్దన చేస్తే అలసటను దూరం చేస్తుంది.
  • వేడి నీటిలో కొద్దిపాటి నూనె చుక్కలను వేసి ఆవిరి పడితే లంగ్స్ శుభ్రపడి శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గుతాయి
  • దురదతో కూడి పెచ్చులు పెచ్చులుగా ఉండే చుండ్రు నివారణకు జిరానియమ్‌, దవనం, జూనిపర్‌, చందనం నూనెలను, రేగు నూనెతో కలిపి రాసినట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది
  • పొడిజుట్టు కు ఉసిరి శీకాకాయ, బ్రాహ్మీ లేక వెచ్చని నువ్వుల నూనెను ఆవశ్యకమైన దవనం, జిరానియం లేక జునిపర్‌ నూనెలతో కలిపి వాడాలి. జుట్టు బాగుంటుంది .
  • ===========================================
Visit my Website - Dr.Seshagirirao

No comments:

Post a Comment