- image : courtesy with Andhraprabha News paper
అవిశ (ఫ్లాక్స్ ) సన్నని కాడలతో 1.2 మీటర్లు, (3ఫీట్ల 11 ఇంచుల)పొడవుగా, నిటారుగా పెరుగుతున్న వార్షిక వృక్షం. మొక్క చివర్లు 20-40 మిటర్లు పొడవు, 3 మీటర్లు వెడల్పు కలిగి ఉంటుంది. పూలు స్వచ్ఛమైన నీలం రంగులో ఉండి, 5 రేకలతో (15-25) మీటర్ల వెల ల్పు ఉంటాయి. దీని పండు గుండ్రంగా, ఒక చిన్న యాపిల్ మాదిరిగా ఉంటుంది. దీనిలోని గింజలు గోధుమ విత్తనాలవలే అదే రంగులో ఉంటాయి. దీని ఆకులు ముదరాకుపచ్చ రంగులో ఉండి వాటిలో గ్లూకోజ్ పిండిపదార్ధం ఆయుర్వేద పరంగా ఉపయోగపడుతుంది.
- ఉపయోగాలు:
- గోధుమరంగు ఫ్లాక్స విత్తనాలు:
పోషక విలువలు ఏ విధంగా ఉన్నాయంటే...
- విత్తనం పోషక విలువ 100 గ్రా (3.5)
- ఉత్పాదకత 2,234కెజె (534కెకాల్)
- కార్బొహైడ్రేట్లు 28.88గ్రా
- చక్కెర 1.55గ్రా
- పీచు పదార్థం 27.3గ్రా
- కొవ్వు 42.16గ్రా
- ప్రొటీన్స్ 18.29గ్రా
- విటమిన్ బి1 1.644ఎంజి (143%)
- విటమిన్ బి2 0.161ఎంజి (13%)
- విటమిన్ బి3 3.08ఎంజి(21%)
- విటమిన్ బి5 0.985ఎంజి (20%)
- విటమిన్ బి6 0.473 ఎంజి (36%)
- విటమిన్ బి9 (0%)
- విటమిన్ సి 0.6ఎంజి (1%)
- కాలిషియం 255ఎంజి (26%)
- ఐరన్ 5.73 ఎంజి (44%)
- మాగ్నీషియం392ఎంజి(110%)
- పాస్పరస్642ఎంజి(92%)
- పొటాషియం 813ఎంజి(17%)
- జింక 4.34ఎంజి(46%)
- ఆరోగ్యాన్నిచ్చే ఆహార పదార్థాలను ఏదైనా ఇష్టంగా తినాలి. కష్టంగా మాత్రం తినొద్దు. రోజువారీ ఆహారంలో అవిసె గింజల్ని భాగం చేసుకుని తినేవారి ఆరోగ్యం ఎక్కువ కాలం సురక్షితంగా ఉంటుంది. ఇందుకు సాక్ష్యం పాతతరం వారు. ఆ రోజుల్లోనే అవిసెగింజలతో చిట్కా వైద్యాలు ఎన్నో చేశారు మన పెద్దవాళ్ళు. ఎముకల అరుగుదల, జాయింట్ పెయిన్స్‌తో బాధపడేవారు అసె గింజలను ఆహార పదార్థాలతో పాటు తీసుకుంటే ఈ రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. వీటిలో ఉండే ఒమేగా యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా కొలెస్టరాల్ స్థాయిలు చాలా వరకూ తగ్గుతాయి.అవిసె నూనె వలన కూడా చాలా లాభాలున్నాయి
అవిసెలో పీచు అధికంగా లభిస్తుంది. కనుక మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది. .
సూర్య కిరణాల వేడికి చర్మం దెబ్బతినకుండా ఈ గింజల నుండి తీసే నూనె రాసుకోవడం వలన చర్మరక్షణ లభిస్తుంది.
ఆస్తమా, ఎలర్జీల నుండి ఉపశమనం అవిసె నూనె వలన లభిస్తుంది.
చుండ్రు సమస్యను సమర్థవంతంగా నివారించి, పేలు నశించేట్లు చేయడంలో అవిసె నూనెను మించింది లేదు. వెంట్రుకలు కూడా మళ్ళీ పెరిగి జుత్తు చిక్కగా తయారవుతుంది.
ప్రస్తుతం పని ఒత్తిడి కారణంగా చాలామంది తలనొప్పితో బాధపడుతున్నట్లు సర్వేలు చెపుతున్నాయి. అధిక తలనొప్పితో బాధపడుతుంటే అవిసె నూనెను ఉపయోగించిన వంటలు లేదా అవిసె ఆకును ఆహారంగా తీసుకుంటుంటే తలనొప్పి మటుమాయం.
అలాగే నడివయసులో వచ్చే కీళ్ళ సమస్యలు, నడుము నొప్పితో బాధపడేవారు కూడా అవిసె నూనెతో చేసిన వంటకాలు వాడుతుంటే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
అవిసె గింజల నుంచి తయారు చేసిన నూనెలో ఒమెగా-3, ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండటంతో శరీరంలోని రక్త సరఫరాకు అంతరాయం లేకుండా చేస్తాయి. దీంతో గుండెనొప్పి, మధుమేహం, క్యాన్సర్‌లాంటి దీర్ఘకాలిక వ్యాధులు దరి చేరవంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అవిసె నూనెలో విటమిన్ 'ఈ' పుష్కలంగా ఉంది. కుష్టువ్యాధితో బాధపడేవారికి ఈ నూనెను వంటలలో ఉపయోగించి ఆహారంగా సేవిస్తుంటే లాభదాయకంగా ఉంటుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
కాలిన గాయాలపై అవిసె నూనె నురుగును పూస్తే మంట, నొప్పినుంచి ఉపశమనం కలగుతుంది. అవిసె ఆకును వేంచుకుని మేక పాలలో ఉడకబెట్టుకుని ఆలేపనాన్ని పుండ్లపై పూస్తే పుండ్లు, కురుపులుంటే మటుమాయమవుతాయంటున్నారు ఆయుర్వేదవైద్యులు.
తైలవర్ణ చిత్రలేఖనం అనేది ఆరిపోయే తైల మాధ్యమానికి నిబద్ధమై ఉండే వర్ణద్రవ్యాలను ఉపయోగించే ఒక చిత్రలేఖన ప్రక్రియ - ప్రారంభ ఆధునిక ఐరోపాలో ఈ చిత్రలేఖన పద్ధతిలో సీమ అవిసె నూనె (లిన్సీడ్గ ఆయిల్)ను ఎక్కువగా ఉపయోగించేవారు. తరచుగా సీమ అవిసె నూనె వంటి చమురును దేవదారు సర్జరసం (రెసిన్) లేదా ఫ్రాంకిన్‌సెన్స్ (వివిధ అరేబియా లేదా తూర్పు ఆఫ్రికా ప్రాంత చెట్ల నుంచి తయారు చేసే ఒక సుగంధ భరితమైన జిగురు రెసిన్‌తో వేడిచేస్తారు. వీటిని ''వార్నిషూలు'' అని పిలుస్తారు.
- ================================
Dear sir Dr.Seshagirirao-MBBS.I want u prudat at QATAR my cell NO:+974 33605336
ReplyDeleteSir i want to know how to make avise oil.i am suffering face pigmentaion from last five years and i heard avise oil works on pigmentaion.plz tell me about that. iam also belong to srikakulam.
ReplyDeleteఈ సమాచారం చాలా ఉపయోగకరం. వెరీ ఇంట్రెస్టింగ్ - రమ, గుడివాడ
ReplyDeleteచాలా ఉపయోగకరమైన సమాచారం. ధన్యవాదాలు.
ReplyDeletevery interesting. thank u vrymch 4 d infrmtn.
ReplyDeletevery interesting. thank u vrymch 4 d infrmtn.
ReplyDelete