Monday, October 10, 2011

Soup , సూప్‌(చారు)

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. వేడిగా పొగలు కక్కుతూ ఉండే సూప్‌ను చెంచాతో తీసుకుని ఆరగించడమంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే బయట హోటల్లలో దొరికే చాలా సూప్‌లు నాన్‌వెజ్‌వే కావడం తెలిసిందే. రక్తం, రసం, నీళ్లు లేదా ఇతర ద్రవంతో మాంసం మరియు కూరగాయలు వంటి వంట సరంజామాను చేర్చడం ద్వారా తయారు చేసే ఆహారాన్ని చారు (సూప్) అంటారు. రసాలను సేకరించే వరకు ఒక కుండలోని ద్రవాల్లో ఘన ఆహార పదార్థాలను వేడి చేయడం ద్వారా బ్రోత్ (మాంసంవేసి కాచిన చారు) తయారవుతుంది, దాంతో సూప్ మీద ఎంత ఇష్టం ఉన్నా శాఖాహారులు వాటిని తీసుకోవడానికి జంకుతారు. అందుకే ఇలాంటి వారికోసం వెజిటేరియన్ సూప్‌ని పరిచయం చేస్తున్నాం. భోజనానికి ముందు ఏదైనా సూప్ తాగడము వలన ఆహారము తగ్గించి తీసుకోవడానికి తోడ్పడుతుంది . అధ్యయనాలు పేర్కోంటున్నాయి. సూప్ లేకుండా భోజనము చేసినవారికన్నా పూరి భోజనానికి ముందు సూప్ తీసుకున్న వాళ్ళలో కేలరీల మొత్తం ఇంటేక్ 20% తగ్గినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి . ఈ వెజిటేరియన్ సూప్ తయారీకి కావలిసినవి : క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, టమోటాలు, వెల్లుల్లి, ఆలివ్ నూనె, చీజ్ 25 గ్రాములు, ఉప్పు, మిరియాలపొడి. తయారుచేసే విధానం : క్యాబేజీ ఆకు ముకల్ని చిన్న ముక్కలుగా కత్తరించుకోవాలి. దీంతోపాటు అన్నిరకాల కూరగాయలను కూడా చిన్నపాటి ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నెలో ఆలివ్ ఆయిల్ వేసి స్టౌమీద పెట్టాలి. నూనె కాగగానే వెల్లుల్లి వేయాలి. తర్వాత తరిగిపెట్టుకున్న కూరగాయలు వేయాలి. ఈ సమయంలో టమోటాలు మాత్రం వేయకూడదు. కూరగాయలు కొద్దిగా వేగగానే నాలుగు గ్లాసుల నీరు పోసి ఉడికించాలి. కూరగాయలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత టమెటాలను కూడా వేసి బాగా ఉడికించాలి. చివరగా సరిపోయేంత ఉప్పు వేసి మళ్లీ ఉడికించాలి. మొత్తం కూరగాయలు ఉడికి సూప్‌లాగా తయారైన సమయంలో స్టౌనుంచి దించేయాలి. ఇలా తయారు చేసిన సూప్‌ను వేడిగా ఉన్నప్పుడే చప్పరిస్తే ఆ రుచే వేరు. సూప్ పూర్తి వివరాల కోసము --> Soup , సూప్‌(చారు)
  • ============================================
Visit my Website - Dr.Seshagirirao

No comments:

Post a Comment