Monday, October 10, 2011

అవిసె గింజలు-నూనె,linseed-Oil,Flax Seeds

  • image : courtesy with Andhraprabha News paper
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

 అవిశ (ఫ్లాక్స్ ) సన్నని కాడలతో 1.2 మీటర్లు, (3ఫీట్ల 11 ఇంచుల)పొడవుగా, నిటారుగా పెరుగుతున్న వార్షిక వృక్షం. మొక్క చివర్లు 20-40 మిటర్లు పొడవు, 3 మీటర్లు వెడల్పు కలిగి ఉంటుంది. పూలు స్వచ్ఛమైన నీలం రంగులో ఉండి, 5 రేకలతో (15-25) మీటర్ల వెల ల్పు ఉంటాయి. దీని పండు గుండ్రంగా, ఒక చిన్న యాపిల్‌ మాదిరిగా ఉంటుంది. దీనిలోని గింజలు గోధుమ విత్తనాలవలే అదే రంగులో ఉంటాయి. దీని ఆకులు ముదరాకుపచ్చ రంగులో ఉండి వాటిలో గ్లూకోజ్‌ పిండిపదార్ధం ఆయుర్వేద పరంగా ఉపయోగపడుతుంది.
  • ఉపయోగాలు:
అవిశ వృక్షాల్ని గింజల కోసం పెంచడం జరుగుతుంది. ఎందుకంటే వాటిలో ఫైబర్‌ అధిక శాతంలో లభ్యమ వుతుంది. అవిశె పలు ప్రాంతాల్లో ఫ్యా బ్రిక, అద్దకం, కాగితం, మందులు, ఫిషింగ్‌ వలలు, జుట్టుకోసం ఉపయోగించే జల్‌లు, రకరకాల సబ్బులు చేయడానికి ఉపయోగి స్తారు. అవిశ విత్తనాలనుండి ఉత్పత్తయ్యే నూనెను మనం వంటకు ఉపయోగిస్తాము. ఈ నూనెలో ఎలర్జీని నివారించే గుణం ఉంది. అంతేకాక ఫర్నిచర్‌ ఉత్పతుల్లో ఒక మూల వస్తువుగా కూడా దీనిని వినియో గిస్తారు. ఆయుర్వేద వైద్య విధానంలో అవిశె చెట్టు వేరు, ఆకులు, విత్తనాలు, బెరడు మొదలైన అన్ని భాగాల్లోను ఔషధగుణాలు ఉండటం చేత దీనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది.
  • గోధుమరంగు ఫ్లాక్స విత్తనాలు:
అవిశ విత్త నాలు రెండు రకాలు 1)గోధుమ రంగు 2) పసుపు పచ్చరంగు. ఈ రెండు రకాలలోను ఒకే విధమైన పోషక విలువలు ఉన్నాయి. దీని నుండి తయారు చేసిన చమురు చాలా విలక్షణంగా ఉంటుంది. అవిశ నారను పశువుల దాణాలో ఒక మూలవస్తువుగా వాడతారు. ఇదే అవిశ నూనెని పూర్వకాలంలో వంట నూనెగా వాడేవారు. దీని చమురు వాణిజ్య పరంగా చాలా వినియోగంలో ఉండేది. నేటికీ దీనిని చాలా మంది వాడుతూనే ఉన్నారు. అందుకే ఇది పురాతన వాణిజ్య నూనెల్లో ఒకటి. ఈ నూనె చాలా మృధువుగా, పొడిగా కూడా ఉండటం వల్ల, ఔష ధగుణాలు కలిగివుండ టం వల్లా వాణిజ్య రంగంలో మంచి డిమాండ్‌ కలిగివుండేది. అవిశె విత్తనాల్ని బీహార్‌ ప్రాంతంలో, ఉత్తర భారతదేశంలో 'టిసి' అని పిలుస్తారు. కాల్చిన ఈ విత్తనాల పొడిని ఉడికించిన అన్నంతో తింటారు. పూర్వం రోజుల్లో గ్రామాల్లో వీటిలో కొద్దిగా ఉప్పు, నీరు వేసుకుని కూడా తినేవారు. ఈ అవిసెగింజలు జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. ఉదర సంబంధ వ్యాధుల్ని నివారిస్తుంది. అవిశ విత్తనాలు చాలా కాలం నిలవ వుండే గుణం కలిగి ఉన్నందున వీటినీ కాలాను గుణంగా కూడా వినియో గించుకోవచ్చును. ఇక ఈ అవిశలో ఉండే

పోషక విలువలు ఏ విధంగా ఉన్నాయంటే...
  • విత్తనం పోషక విలువ 100 గ్రా (3.5)
  • ఉత్పాదకత 2,234కెజె (534కెకాల్‌)
  • కార్బొహైడ్రేట్లు 28.88గ్రా
  • చక్కెర 1.55గ్రా
  • పీచు పదార్థం 27.3గ్రా
  • కొవ్వు 42.16గ్రా
  • ప్రొటీన్స్‌ 18.29గ్రా
  • విటమిన్‌ బి1 1.644ఎంజి (143%)
  • విటమిన్‌ బి2 0.161ఎంజి (13%)
  • విటమిన్‌ బి3 3.08ఎంజి(21%)
  • విటమిన్‌ బి5 0.985ఎంజి (20%)
  • విటమిన్‌ బి6 0.473 ఎంజి (36%)
  • విటమిన్‌ బి9 (0%)
  • విటమిన్‌ సి 0.6ఎంజి (1%)
  • కాలిషియం 255ఎంజి (26%)
  • ఐరన్‌ 5.73 ఎంజి (44%)
  • మాగ్నీషియం392ఎంజి(110%)
  • పాస్పరస్‌642ఎంజి(92%)
  • పొటాషియం 813ఎంజి(17%)
  • జింక 4.34ఎంజి(46%)
సాధారణంగా అక్కడక్కడా రహదారి వెంట కనిపించే ఈ వృక్షాల్ని సామాన్య ప్రజానీకం అంతగా పట్టించుకోరు. అందుకు కారణం వృక్షశాస్త్ర పరిజ్ఞానం ప్రాధమిక స్థాయి నుం చీ లేకపోవడమే. అసలు చిన్న తరగతుల నుంచీ మొక్కలు, వాటి ఉపయోగాలు ఒక ప్రత్యేక పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టి, అంద రికీ అవగాహన కలిగించివుంటే నేడు ప్రతి చెట్టుకీ ఒక ప్రత్యేక స్థానం ఏర్పడేది.
  • ఆరోగ్యాన్నిచ్చే ఆహార పదార్థాలను ఏదైనా ఇష్టంగా తినాలి. కష్టంగా మాత్రం తినొద్దు. రోజువారీ ఆహారంలో అవిసె గింజల్ని భాగం చేసుకుని తినేవారి ఆరోగ్యం ఎక్కువ కాలం సురక్షితంగా ఉంటుంది. ఇందుకు సాక్ష్యం పాతతరం వారు. ఆ రోజుల్లోనే అవిసెగింజలతో చిట్కా వైద్యాలు ఎన్నో చేశారు మన పెద్దవాళ్ళు. ఎముకల అరుగుదల, జాయింట్ పెయిన్స్‌తో బాధపడేవారు అసె గింజలను ఆహార పదార్థాలతో పాటు తీసుకుంటే ఈ రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. వీటిలో ఉండే ఒమేగా యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా కొలెస్టరాల్ స్థాయిలు చాలా వరకూ తగ్గుతాయి.అవిసె నూనె వలన కూడా చాలా లాభాలున్నాయి
అవిసె గింజలు మెదడుకు శక్తిని పెంచే ఆహారం. వీటిలో ఉండే ప్యాటీయాసిడ్లు ఎమర్జెన్సీగా పనిచేసి డిప్రెషన్‌ను కూడా సమర్థవంతంగా నివారించ గలుగుతాయి.

అవిసెలో పీచు అధికంగా లభిస్తుంది. కనుక మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది. .

సూర్య కిరణాల వేడికి చర్మం దెబ్బతినకుండా ఈ గింజల నుండి తీసే నూనె రాసుకోవడం వలన చర్మరక్షణ లభిస్తుంది.

ఆస్తమా, ఎలర్జీల నుండి ఉపశమనం అవిసె నూనె వలన లభిస్తుంది.

చుండ్రు సమస్యను సమర్థవంతంగా నివారించి, పేలు నశించేట్లు చేయడంలో అవిసె నూనెను మించింది లేదు. వెంట్రుకలు కూడా మళ్ళీ పెరిగి జుత్తు చిక్కగా తయారవుతుంది.

 ప్రస్తుతం పని ఒత్తిడి కారణంగా చాలామంది తలనొప్పితో బాధపడుతున్నట్లు సర్వేలు చెపుతున్నాయి. అధిక తలనొప్పితో బాధపడుతుంటే అవిసె నూనెను ఉపయోగించిన వంటలు లేదా అవిసె ఆకును ఆహారంగా తీసుకుంటుంటే తలనొప్పి మటుమాయం.


అలాగే నడివయసులో వచ్చే కీళ్ళ సమస్యలు, నడుము నొప్పితో బాధపడేవారు కూడా అవిసె నూనెతో చేసిన వంటకాలు వాడుతుంటే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

 అవిసె గింజల నుంచి తయారు చేసిన నూనెలో ఒమెగా-3, ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండటంతో శరీరంలోని రక్త సరఫరాకు అంతరాయం లేకుండా చేస్తాయి. దీంతో గుండెనొప్పి, మధుమేహం, క్యాన్సర్‌లాంటి దీర్ఘకాలిక వ్యాధులు దరి చేరవంటున్నారు ఆరోగ్య నిపుణులు.

అవిసె నూనెలో విటమిన్ 'ఈ' పుష్కలంగా ఉంది. కుష్టువ్యాధితో బాధపడేవారికి ఈ నూనెను వంటలలో ఉపయోగించి ఆహారంగా సేవిస్తుంటే లాభదాయకంగా ఉంటుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

 కాలిన గాయాలపై అవిసె నూనె నురుగును పూస్తే మంట, నొప్పినుంచి ఉపశమనం కలగుతుంది. అవిసె ఆకును వేంచుకుని మేక పాలలో ఉడకబెట్టుకుని ఆలేపనాన్ని పుండ్లపై పూస్తే పుండ్లు, కురుపులుంటే మటుమాయమవుతాయంటున్నారు ఆయుర్వేదవైద్యులు.

తైలవర్ణ చిత్రలేఖనం అనేది ఆరిపోయే తైల మాధ్యమానికి నిబద్ధమై ఉండే వర్ణద్రవ్యాలను ఉపయోగించే ఒక చిత్రలేఖన ప్రక్రియ - ప్రారంభ ఆధునిక ఐరోపాలో ఈ చిత్రలేఖన పద్ధతిలో సీమ అవిసె నూనె (లిన్సీడ్గ ఆయిల్‌)ను ఎక్కువగా ఉపయోగించేవారు. తరచుగా సీమ అవిసె నూనె వంటి చమురును దేవదారు సర్జరసం (రెసిన్‌) లేదా ఫ్రాంకిన్‌సెన్స్‌ (వివిధ అరేబియా లేదా తూర్పు ఆఫ్రికా ప్రాంత చెట్ల నుంచి తయారు చేసే ఒక సుగంధ భరితమైన జిగురు రెసిన్‌తో వేడిచేస్తారు. వీటిని ''వార్నిషూలు'' అని పిలుస్తారు.
  • ================================
Visit my Website - Dr.Seshagirirao

6 comments:

  1. Dear sir Dr.Seshagirirao-MBBS.I want u prudat at QATAR my cell NO:+974 33605336

    ReplyDelete
  2. Sir i want to know how to make avise oil.i am suffering face pigmentaion from last five years and i heard avise oil works on pigmentaion.plz tell me about that. iam also belong to srikakulam.

    ReplyDelete
  3. ఈ సమాచారం చాలా ఉపయోగకరం. వెరీ ఇంట్రెస్టింగ్ - రమ, గుడివాడ

    ReplyDelete
  4. చాలా ఉపయోగకరమైన సమాచారం. ధన్యవాదాలు.

    ReplyDelete
  5. very interesting. thank u vrymch 4 d infrmtn.

    ReplyDelete
  6. very interesting. thank u vrymch 4 d infrmtn.

    ReplyDelete