Thursday, March 8, 2012

నిమ్మచెక్కల్ని పడేయకుండా ఎలా పనికొస్తాయి?,How to use used lemon pieces?

  • image : courtesy with Eenadu News paper.
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
  • How to use used lemon pieces?
వంటింట్లో ఎక్కువగా ఉపయోగించేవి నిమ్మకాయలు.. అయితే వాటిని వాడేశాక చెక్కల్ని పడేస్తుంటారు చాలామంది. వీటివల్ల ఉపయోగాలు తెలిస్తే ఎవరూ అలా చేయరు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం.
  • * ఇంట్లో పురుగులు, చీమలు, ఇతర కీటకాలు ఎక్కువగా వస్తుంటే వంటింట్లో గోడలకున్న రంధ్రాల దగ్గర, కిటకీల వద్ద.. నిమ్మచెక్కలను ఉంచితే చాలు.. వాటి బెదడ దూరమవుతుంది.
  • * కిచెన్‌లో పాడైపోయిన కూరగాయలు, వంటల తాలూకు చెడు వాసనలు వస్తుంటే ఇలా చేయండి. గిన్నె నిండా నీళ్లు నింపి అందులో ఈ చెక్కలను వేసి పొయ్యి మీద పెట్టాలి. నీళ్లు మరిగాక వాటి నుంచి సువాసనలు వస్తాయి. ఇల్లంతా పరిమళభరితం అవుతుంది.
  • * ఫ్రిజ్‌, ఓవెన్‌ నుంచి దుర్వాసనలు వస్తుంటే.. చిన్న కప్పులో నీళ్లు పోసి ఒక నిమ్మకాయ ముక్క ఉంచితే అలాంటి సమస్యలు తక్షణమే దూరమైపోతాయి.
  • పొయ్యి, బాణలి, పెనం వంటి వాటి మీద ఉప్పు చల్లి ఈ చెక్కతో రుద్ది కడగాలి. తరవాత పొడి వస్త్రంతో తుడిస్తే నూనె మరకలు వదిలిపోతాయి.
  • ========================
Visit my Website - Dr.Seshagirirao...

No comments:

Post a Comment