Tuesday, March 20, 2012

Malnutrition is bad for lifespan, ఆహారలోపము ఆయుస్సుకు శాపము

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
  • ప్రపంచములో సుమారు 212 మిలియన్ల జనము ఆహారలోప జన్యువ్యాధులు వల్ల బాధపడుతున్నారు . ప్రపంచములో పోషకారలోపము వున్న ముఖ్య దేశాలలో భారతదేసము ఒకటి . ఈ పోషకాహారలోపము దారిద్ర్యమువల్ల కొంతైతే , పోషకాహార విలువలు తెలియకపోవడము మరో కారణము . ఖరీదైన వాటిల్లోనే పోషక విలువలు ఉంటాయని అనుకొని మంకి దొరికే సామాన్యమైన వాటిల్లో ఉండే పోషక విలువలను గుర్తించకపోవడము మరో కారణము .సృష్టిలోని ప్రతీ ద్రవ్యము లో , ఆకులో , కాయలో , గింజలో పోషక విలువలు ఉంటాయి.
  • తీరికలేని యాంత్రిక జీవనములో ఎదుగుతున్న పిల్లలు అప్పటికప్పుడు దొరికే ఆహారము కోసము పరుగెడుతూ ఇంట్లో అమ్మ చేసిన కమ్మని ఆహారాన్ని వదిలేస్తున్నారు . బయట తినే టిఫిన్‌ కన్నా రాత్రి పాలలో తోడు పెట్టిన అన్నము తింటే ఉత్సాహము, శక్తి కలుగుతాయి
  • పోషకాహార లోపము అంటే : మనలోని జీవకణాలకు శక్తికి కావలసిన ఆహార సారము అందకపోవడము లేదా జీవకణాల శక్తికి అందబడుతున్న ఆహారసారము (Nutrients) మధ్య ఉన్న వ్యత్యాసము పోషకాహారలోపము గా గుర్తించబడుతుంది . ఈ వ్యత్యాసము ఎదుగుతున్న పిల్లలలోనూ , మధ్య వయస్సు వారిలోనూ , ముఖ్యము గా పిల్లలను కనే వయసు లో ఎక్కౌవ ప్రభావము చూపిస్తుంది . ప్రపంచ వ్యాప్తము గా 54% శిశు మరణాలు ఈ ఆహారలోపము వల్ల వచ్చే వ్యాధుల వలననే పరిశోదనలలో తేలినది . ముఖ్యము గా ప్రోటీన్ల లోపము వల్ల పిల్లలలో వచ్చే ప్రోటీ ఎనర్జీ & మాల్ నూట్రిషన్‌ (P & M ) ప్రమాధకరమైనది . ఇది దారిద్ర్యపురేఖ అడుగున ఉన్న వాళ్ళలోనే కాదు అన్ని వున్న అవగాహన లేనివాళ్ళల్లోకూడా ఉన్నది . బయట బండ్ల పై దొరికే పదార్ధల్లలో చుట్టూ ఉన్న అనారోగ్య పరిసరాలు , దుమ్మి , ధూళి లలో ఉన్న సూక్ష్మ జీవులు వలన ఆహారము కలుషితమై కొత్త జీర్ణ సమస్యలను , పోషకాహారలోపము ను కలుగజేయును .
  • అధిక జనాభా ఉన్న దేశాలలో ఆహారాన్ని ఒక పద్దతి ప్రకారము తీసుకోక పోవడము వలం క్వాషియార్కార్ (kwasiyarkar) లేదా మెరాస్మాస్ (Marasmos) వంటి వ్యాధులు తరచుగా కనిపిస్తాయి. మన శరీరములో తనకి శక్తి కావాలనే కోరికను వ్యక్తము చేసే సూచన ''ఆకలి '' అలా ఆకలి పగలు ఆరు గంటలకొకసారి వేయాలి. అప్పుదు ప్రోటీన్లు , పిందిపదార్ధములు , మినరల్స్ ఉన్న పప్పు , ఆకు కూరలు , విటమిన్లు ఉన్న కాయకూరలు , జీర్ణానికి ఉపయుక్తమైన చారు, పులుసు , జీర్ణాశయాన్ని సమతుల్యము చేసే కమ్మ్ని మజ్జిక , పోషకత్వం నిచ్చే ఋతువులను అనుసరించి పంటే పండ్లు తీసుకుంటే ఆకలి తృప్తిపడుతుంది ... పోషకాలు అందుతాయి ... శరీరములో సమస్త జీవకణాలు శక్తిని పుంజుకుటాయి.
  • ఈ పోషకాహార లోపం వల్ల వచ్చే స్థితిని " శోష " అంటారు . శరీరములో మాంసము ఎండిపోయి సన్నము గా అయి పనిచేసే సామర్ద్యము కోల్పోవడము , చిరాకు , కోపము వస్తాయి. మీకు శక్తి స్థాయిలు తగ్గుతున్నా , తొందరగా అలసి పోతున్నా , చర్మము పొడిబారుతున్నా , పళ్ళు చిగుళ్ళు వాసి రక్తము వస్తున్నా , బరువు తగ్గుతున్నట్లు అనిపించినా , కడుపు ఉబ్బరిస్తున్నా , మాటిమాటికి జలుబో , జ్వరమో , విరోచనాలో వస్తున్నా పోషక విలువలు లోపము ఉన్నట్లు భావించి మంచి డాక్టర్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి .
  • ==========================
Visit my Website - Dr.Seshagirirao...

No comments:

Post a Comment