Wednesday, April 18, 2012

సుగంధ దినుసులు ఔషధ గుణాలు , Species and medicinal properties of use

  •  
  •  

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

వంటగదిలో సుగంధ దినుసులను పదార్ధముల రుచి , వాసన పెరగడానికి ఉపయోగిస్తారు . కాని వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.  మానవుల చేత ఆహరమునకు అధిక హంగులు చేర్చడము కొరకు వాడబడే అనేక మూలికలు మరియు సుగంధ ద్రవ్యములు వంటివి కూడా చాలా ఔషధ విలువలు కలిగి ఉంటాయి. అలాగే డాక్టర్ చేత సూచించబడిన మందుల కంటే, పెద్ద సంఖ్యలో మూలికలు అవాంఛనీయ  ఫలితములను కలిగిస్తాయి అనేది తప్పుడు అభిప్రాయము .  మొక్కలు లేదా మొక్కల నుంచి సేకరించిన పదార్ధములను వాడి చేసే ఒక సంప్రదాయ వైద్య విధానము లేదా గ్రామీణ వైద్య విధానము...నే హెర్బలిజం , బొటానికల్ ఔషదము , మెడికల్ హెర్బలిజం , మూలికా వైద్యము , హెర్బాలజీ మరియు ఫైటోథెరపీ అని కూడా అంటారు. మూలికా వైద్యములో ఒక్కోసారి శిలీంద్ర సంబంధ పదార్దములు మరియు తేనే టీగల ఉత్పత్తులు ఇంకా ఖనిజ లవణములు, గుల్లలు మరియు కొన్ని జంతువుల ప్రత్యేక భాగములు వంటివి కూడా వాడబడతాయి. ఔషధ వృక్ష శాస్త్రం అనేది  సహజవనరుల నుంచి తయారు చేయబడిన ఔషధాల గురించి చేసే ఒక అధ్యయనము.

పసుపు ,మిరియాలు, జీలకర్ర, యాలుకలు, లవంగాలు, పిప్పళ్ళు , దాల్చిన చెక్క ,జీలకర్ర  మొదలగునవి మనము రోజూ వాడే సుగంధ ద్రవ్యాలు . ఉదాహరనకు పసుపును తీసుకుంటే పపంచము అంతాసుగుణాలను గుర్తిస్తున్నది .పసుపు లో యాంటిసెప్టిక్ , యాంటి ఇంఫ్లమేటరీ లక్షణాలున్నాయి. ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి. గాయాలు మానడానికి పసుపు వాడుతారు. పాలలో కొద్దిగ పసుపు కలుపుకొని తాగుతుంటే జలుబు , దగ్గు తగ్గుముఖము పడతాయి. పసుపులో ఉండే " కర్ కర్మిన్‌" అనే పదార్ధము క్యాన్‌సర్ నుండి కాపాడుతుంది అని తాజా పరిశోధనలలో గుర్తించారు .

సుగంధ ద్రవ్యాలలో రారాణి అయిన యాలకుల్ని తినడము వల్ల నోటిదుర్వాసన తగ్గిపోతుంది . కాలేయ , జీర్ణసంబంధిత రుగ్మతలకు మంచి చికిత్స . దృఢమైన డిటాక్షిఫికేషన్‌ కారకము గా గుర్తింపు పొందినది .

లవంగాలు చప్పరించడము వల్ల గొంతు మంట తగ్గుగుంది . దీనిలో Antispasmodic గుణాలు ఉన్నాయి. కండరాలు పట్టేసినప్పుడు లవంగ తైలము రాస్తే ఉపశమనము గా ఉంటుంది . రక్తప్రసరణ మెరుగుపడుతుంది .

మిరియాలు సుగంధ ద్రవ్యాలలో రారాజు . శ్వాస సంబంధిత ఇంఫెక్షన్‌ లకు మంచి మందు . పదార్ధాలపై కొంచం మిరియాలపొడి వేసి తింటుంటే జ్ఞాపక శక్తి మెరుగు పడుతుంది . 
  • ==========================
Visit my Website - Dr.Seshagirirao...

No comments:

Post a Comment