Monday, April 30, 2012

వృద్ధాప్యం లో ఆహారం , Food habits in Old age.

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. మనందరం ఎంత వైవిధ్యభరితమైన పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. ఇది వృద్ధులకు మరింత అత్యావశ్యకం . ఎందుకంటే వృద్ధుల్లో విటమిన్‌ డి, క్యాల్షియం, విటమిన్‌ బీ12, పీచు, పొటాషియం వంటి ప్రత్యేకమైన పోషకాల అవసరం చాలా ఎక్కువ. * వృద్ధులు నిత్యం తక్కువ కొవ్వు పాల పదార్థాలు, ఆకు కూరలు, చేపలు తగినంతగా తీసుకోవటం ద్వారా విటమిన్‌ డి, క్యాల్షియం లభిస్తుంది. ఇవి ఎముక పుష్టికి దోహదం చేస్తాయి. * చేపలు, సముద్ర ఆహారం, తేలికైన మాసం నుంచి విటమిన్‌ బీ 12 అందుతుంది. * సాధారణంగా వృద్ధాప్యంలో తప్పనిసరిగా వేధించే సమస్య మలబద్ధకం. రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, ముడి బియ్యం లేదా దంపుడు బియ్యం వంటి పొట్టు తీయని ధాన్యం దండిగా తీసుకుంటే ఈ బాధ నుంచి తేలికగా బయటపడొచ్చు. వీటన్నింటిలో పీచు సమృద్ధిగా ఉంటుంది. * పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు పాల పదార్థాల్లో వృద్ధులకు అవసరమైన పొటాషియం కూడా ఉంటుంది. * అందరిలాగే వృద్ధులు కూడా నూనె పదార్ధాలు, వేపుళ్లు తగ్గించటం శ్రేయస్కరం. ముఖ్యంగా నెయ్యి, డాల్డా వంటి సంతృప్త కొవ్వులు తగ్గించి పొద్దుతిరుగుడు నూనె వంటివి, అదీ మితంగా తీసుకుంటే మంచిది.
  • =========================
Visit my Website - Dr.Seshagirirao...

No comments:

Post a Comment