Sunday, April 29, 2012

Love expressing flowers and health,ప్రేమను తెలియచేసే పూలు మన ఆరోగ్యము

  • Image : courtesy with Visalandhra News paper.
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
  • సౌందర్య సాధనంగా ఉపయోగించే పూలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. పూలు ప్రేమను, ఆకర్షణను కలిగించి మనస్సుకి ఆహ్లాదాన్నిస్తాయి. అలసిన శరీరానికి మనసుకు చక్కటి పూలమొక్కలు ఆహ్లాదాన్నిస్తాయి. అందమైన గార్డెన్ మనస్సుకు ఎంతో ఉల్లాసాన్నిస్తుంది. అదే విధంగా, మంచి సువాసననిచ్చే పూలు లేదా మొక్కలు జీవితంలో రొమాన్స్ కలిగిస్తాయి. మీ భావాలు తెలుపాలంటే మంచి అందమైన, వాసనలు కల పూలు మంచి సాధనం. కనుక ఇంటి వద్ద మంచి రొమాంటిక్ మూడ్ తెచ్చుకోవాలంటే మీ గార్డెన్ లో లేదా ఇంటిలోపలి భాగంలో పెంచగల కొన్ని పూల మొక్కలు చూడండి. బిజీ జీవితం నుంచి విశ్రాంతి పొందాలంటే మంచి మార్గం ప్రకృతితో స్నేహం చేయడం. కాసేపు పూలతో, చెట్లతో ముచ్చట్లాడి వాటి బాగోగులు చూసుకుంటే చాలు ఎంతటి ఒత్తిడి అయినా ఇట్టే మటుమాయం అవుతుంది. వాటికి కాస్త సేవ చేస్తే ఇటు వ్యాయామమూ అవుతుంది. ఇలా తోటపని ఇష్టపడేవారు రైతులే కానవసరం లేదని పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు రుజువు చేశారు. తామెంత గొప్పవారమైనా ప్రకృతితో చెలిమి తమకెంతో ఇష్టమంటుంటారు. తాము పెంచుకునే మొక్కల మధ్యలో సమయం గడిపి సేదతీరుతారు. ఇలా పూల మొక్కల మధ్య తిరిగి, వాటి పెంపకం ద్వారా ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు. గార్డెనింగ్‌ వారికి ఓ హాబీగా మారుతుండడం విశేషం. పూలు కళ్లకు అందంగా కనిపిస్తాయి. పూలను చూస్తుంటే ఏదో తెలియని ఆనందం, ప్రశాంతత కలుగుతుంది. ఒక్కొక్క పూవుది ఒక్కో సువాసన. పూల రంగు, సువాసనల ప్రభావం మనిషి మీద ఉంటుంది. ఈ పూల రేకులలో, మొక్కలలోని హార్మోన్లు ఉంటాయి. ఇవి మనిషికి మేలు చేసేవి. అందుకే ఔషధాల తయారీలో పూలను వాడుతారు.
ప్రేమను తెలియచేసే 5 రకాల ఆకర్షణీయ పూలు:
  • 1.ఎర్ర గులాబి - ఎర్రటి గులాబి పువ్వు, చూసే వారికి ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఎవరికైనా వెంటనే ఇవ్వాలనిపిస్తుంది. ప్రేమను తెలుపాలంటే ఎర్ర గులాబి మంచి సాధనం .వీటిలో అనేక రంగులుంటాయి. ఈ మొక్కను కుండీలలో లేదా బయట కూడా పెంచవచ్చు. ముళ్ళను ఎప్పటికపుడు తీసేస్తూ ప్రతిరోజూ ఒకసారి నీరు పెట్టి, కొద్దిపాటి సూర్యరశ్మి తగిలితే చాలు మొక్క బాగా ఎదిగి పూలనిస్తుంది.గులాబీపూలు మనిషి మూడ్‌ను మారుస్తాయి. ఎంతో విచారంలో ఉన్న వారికి గులాబీలు అందించినట్లయితే వారి మనసులో ఆనందం మొదలవుతుంది. గులాబీల నుండి తీసిన రసాయనాలు మానవ కాలేయం, పిత్తాశయాల పనితీరును మెరుగుపరుస్తాయి.
2.ప్లుమేరియా - గులాబి తర్వాత ప్రేమను తెలుపాలంటే ప్లుమేరియా పువ్వు బాగుంటుంది. మంచి సువాసనలతో రూమంతా ఆహ్లాదాన్నిస్తుంది. ఈ పూలు వివిధ రంగుల్లో వుంటాయి. పెంచటం తేలికే. చలి అధికంగా వుంటే, ఇంటి లోపల కుండీలలో పెంచటం, కొద్దిపాటి నీరు పెడితే చాలు.
3.జాస్మిన్ - మల్లె పూలు
  • ఈపువ్వు ఘాటైన సువాసనలనిచ్చే ప్రేమికుల పువ్వు. ఇవి అలంకరణకే కాదు ప్రేమికులు మంచి మూడ్ రావటానికి కూడా ఉపయోగిస్తారు. ఇవి వికసించాలంటే ఎండ బాగా వుండాలి. నీరు ఎక్కువ పోస్తే మొక్క బాగా ఎదుగుతుంది.
తలలో చుండ్రు సమస్య అధికంగా ఉంటే మెంతులతోపాటు కాసిన్ని ఎండుమల్లె పూలు కలిపి నూరి తయారైన చూర్ణాన్ని తలకు పట్టిస్తే చుండ్రు సమస్య తగ్గడమే కాక జుట్టుకూడా పట్టుకుచ్చులా మెరిసిపోతుంది. కొబ్బరి నూనెలో మల్లెపూలు వేసి ఓ రాత్రంతా బాగా నానబెట్టి ఆ తర్వాత బాగా మరగబెట్టి తలకు పట్టిస్తే కేశాలు ఆరోగ్యవంతమవడమేకాక మాడుకు చల్లదనాన్నిస్తుంది. మల్లెపువ్వులను ఫేస్‌ప్యాక్‌గా కూడా వాడుకోవచ్చు. మల్లెల్ని పేస్టుగా చేసి కొద్దిగా పాలు కలిపి, నెమ్మదిగా మసాజ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ముల్తానామట్టి, గంధం, తేనె అరస్పూన్‌ చొప్పున కలిపి ప్యాక్‌ వేసుకోవాలి.
  • 4.జాంక్విల్స్ - ప్రేమకు, సాను భూతికి ఈ పువ్వు సంకేతం. ఈ మొక్క పెంచటం తేలికే. పూలు వచ్చే సమయంలో మొక్కకు నీరు బాగా పెట్టాలి. ప్రతి రోజూ 2 నుండి 5 గంటలుకొద్దిపాటి సూర్య రశ్మి వుంటే చాలు.
5.తులిప్ - ఈ పూలు వివిధ రంగుల్లో వుంటాయి. ఎరుపు, పసుపు ప్రేమికులకు ఆకర్షణీయంగా వుంటాయి. వీటిని ఇంటిలో ఫ్లవర్ వేజ్ లో పెడితే కనీసం ఒక వారం రోజులు వాడకుండా వుంటాయి. ఈ 5 రకాల పూలు ప్రేమను, ఆకర్షణను కలిగించి మనస్సుకి ఆహ్లాదాన్నిస్తాయి.
  • మందారం పూలు : ఇవి కేవలం చూడటానికి అందంగానే కాకుండా మనిషి ఆరోగ్యానికి కూడా ఉపయోగపుడుతుంది. దీనిని హైబిస్కస్ అని కూడా అంటారు. దీనిని ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటారు. అలాగే మందులుగా కూడా ఉపయోగించొచ్చు, దీంతో మనిషి ఆరోగ్యంగా వుంటాడంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా యూనాని మందులలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీంతో శరీరంలోని కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధి, గొంతుకు సంబంధించిన వ్యాధులు తదితర జబ్బులకు మంచి ఔషధంలా పనిచేస్తుందంటున్నారు వైద్యులు.
మోదుగు పూలు : FIRE OF FOREST గా పేరుగాంచిన మోదుగు పూలు పేరుకు తగ్గట్టుగానే అడవి లో ఎక్కడున్నా ఎర్రని పూలతో అట్టే తెలిసిపోతాయి. గుత్తులు గుత్తులు గా ఎంతో బాగా ఆకట్టుకుంటాయి. వీటిని సేకరించి ఎందబెట్టుకుని తరువాత పొడిగా మార్చుకుని చాలా మంది టీ పొడిగా వాడతారు. ఆరోగ్యానికి మంచిది.
  • మేరీగోల్డ్ పూలు : బంతి పూలు -- ఇవి యాంటీసెప్టిక్‌గా పనిచేస్తాయి. గాయాలకు రాసే ఆయింట్‌మెంట్లలో ఈ పూలు ఉపయోగిస్తారు.
చమేలీ పుష్పాలు : ఇవి పేగు పనితీరును ఎంతగానో మెరుగుపరుస్తాయి. రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. కడుపునొప్పి, నోటిలో నంజు పొక్కు నుండి ఉపశమనం కలిగిస్తుంది.
  • డాంజిలియన్ పూలు : ఇవి రక్తలేమి, కామెర్ల చికిత్సలో వాడుతున్నారు.
పింక్ కలర్ పూలు :
  • ప్రకృతి మనకు ఎన్నో అందమైన, సువాసనలతో కూడిన పుష్పాలను ఇచ్చింది. ఈ పువ్వుల్లో ఒక్కో పువ్వుకు ఒక్కో ప్రత్యేక గుణం ఉంటుంది. మానవుని జీవితంలో సగం దాంపత్యానికే కేటాయించబడుతుంది. ఈ దాంపత్య జీవితం సుఖమయంగా, సాఫీగా సాగేందుకు కొన్ని రకాల, రంగుల పుష్పాలు ఎంతగానో దోహదపడతాయి. పింక్ పూలతో శృంగార శక్తి డబుల్. పింక్ కలర్ పూలకు పడకగదిలో చోటిస్తే దంపతుల్లో శృంగారం రెట్టింపవుతుందట. ఊదా రంగు పూలకు హృదయాలను స్పందింపజేసే శక్తి, రొమాంటిక్ ఆలోచనలు రేపే లక్షణం ఉంది. కనుక బెడ్రూంలో ఈ పూలకు స్థానం కల్పిస్తే సుఖసాంసారం సొంతం.
నైట్‌ క్వీన్‌ పూలు :
  • తెలుపురంగు గల ఈరకం పువ్వులన్నీ సువాసనలతో రాత్రి పూట వికసించి సువాసనలు వెదజల్లుతూ మనకి కూడా మత్తు కలిగేటట్లు చేయగలవు. ఇవి పగటిఉష్ణోగ్రతను తట్టుకోలేవు. పగటి వెలుతురుని భరించలేవు .
మూన్ ఫ్లవర్ పూలు :
  • మూన్ ఫ్లవర్ - రాత్రి వికసించే ఈ పూవును మూన్ ఫ్లవర్ అని పిలుస్తారు. మూన్ వలే గుండ్రంగా వుండటం వలన దీనిని మూన్ ఫ్లవర్ అంటారు. ఈ పూవు కూడా తెల్లగా వుంటుంది. ఇది పాకే మొక్క, బలంగా వుంటుంది.ఈ పూలు రాత్రి పూట వికసించి సువాసనలు వెదజల్లుతూ మనకి కూడా మత్తు కలిగేటట్లు చేయగలవు. ఉదాహరణ--కొలంబైన్, ఈవెనింగ్ ప్రిమ్ రోజ్.
  • ============================
Visit my Website - Dr.Seshagirirao...

No comments:

Post a Comment