Saturday, September 21, 2013

albakara fruit,Plums-albakara,ఆల్‌బుకారాపండ్లు


  •  

  •  
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

ఆల్‌బుకారాపండ్లు  

గంగరేగు పండుకన్నా కాస్త పెద్దగా.. యాపిల్‌లా ఎర్రగా నిగనిగలాడుతుండే ఆల్‌బుకారా పండ్లను చూడగానే నోరూరుతుంది. చాలామంది వీటిని అంతగా పట్టించుకోరు గానీ ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిల్లో కేలరీలు చాలా తక్కువ. సాధారణంగా పండ్లు తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజు స్థాయిలు పెరుగుతుంటాయి. కానీ వీటితో అలాంటి ప్రమాదమేమీ ఉండదు. ఎందుకంటే వీటి 'గ్త్లసిమిక్‌ ఇండెక్స్‌' చాలా తక్కువ. ఆల్‌బుకారా పండ్లలో విటమిన్‌ సి దండిగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. ఇక వీటిల్లోని ప్రోసైయానిడిన్‌, నియోక్లోరోజెనిక్‌యాసిడ్‌, క్యూర్‌సెటిన్‌ వంటి ఫెనోలిక్‌ రసాయనాలు శరీరంలో వాపు తగ్గేందుకు తోడ్పడతాయి. కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. ముదురు ఎరుపురంగులో ఉండే ఆల్‌బుకారా పండ్లలో ఈ ఫెనోలిక్‌ రసాయనాలు మరింత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.ఆల్‌బుకారా... రోగాలన్నింటినీ తగ్గిస్తుందని నమ్మకాన్నిచ్చే పండు. దీన్ని ఇష్టంగా తినడానికి చెప్పుకునే కారణాలు చాలా కనిపిస్తున్నాయి. నేడు బజార్లో కూడా అంతే కన్నులకింపుగా కనిపిస్తున్నారు.  ప్రూన్స్‌, డ్రూప్స్‌, ప్లమ్‌... ఎలా పిలుచుకున్నా అభ్యంతరం చెప్పని ఈ పళ్లు బ్లూ- బ్లాక్‌, పసుపు, పర్పుల్‌, ఎరుపు రంగులలో దొరుకుతాయి.

* జ్యూసీగా ఉండే ఈ పండులో కేలరీలు తక్కువ.
* జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్‌ ఇందులో చాలా వుంది.
* విటమిన్‌ సికి ఈ పండు చిరునామాగా చెప్పుకోవచ్చు. ఇది మంచి యాంటీ ఆక్సిడెంటని వేరుగా చెప్పనవసరం లేదుగా!
* రోగనిరోధకశక్తిని పెంచడంలో ఇది మనకెంతగానో తోడ్పడుతుంది.
* విటమిన్‌ ఎ, బీటా కెరోటిన్‌లూ ఇందులో ఉన్నాయి.
* ఇందులో ఉన్న పొటాషియం గుండెజబ్బులు, రక్తపోటు రాకుండా కాపాడుతుంది.
* శరీర ఉష్ణోగ్రత సమతుల్యతను కాపాడుతుంది.
* ఇందులోని విటమిన్‌ కె ఎముకల పటిష్టతను కాపాడటానికి, ఆల్జీమర్స్‌ను నయంచేయడానికి సాయపడుతుంది.
* కంటిచూపును మెరుగుపరుస్తుంది.
  • జ్వరా నికి, మలబద్ధకానికి మంచి విరుగుడుగా పేరెన్నికగన్నది  ఆల్‌బుకారా పండ్లు.
  • ఎండు ఆల్‌బుకారాలను రోజుకు 10 చొప్పున తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారై ఎముక విరుపు సమస్యలుండవు . దీంతోపాటు మోనోపాజ్ దశ దాటిన మహిళల్లో సాధారణంగా కనిపించే బోలు ఎముకల వ్యాధి( ఆస్ట్రియోపోరోసిస్)ని కూడా ఇవి నివారిస్తాయని నిర్ధరించారు. అత్తిపండు(ఫిగ్), ఎండు ఖర్జూరాలు, ఎండు స్ట్రాబెపూరీలు, ఎండు ఆపిల్స్, ఎండు ద్రాక్షల కంటే ఈ ఎండు ఆల్‌బుకారాలు ఎముకల సామర్థ్యాన్ని పెంచడంలో మెరుగైనవని వెల్లడించారు.

50గ్రాముల ఆల్‌బుకారాలో...పోషక పదార్ధాలు :

  • కేలరీలు 35,
  • ప్రోటీన్లు 0.50 గ్రా.,
  • కార్బొహైడ్రేట్స్‌ 8 గ్రా.,
  • నీరు థ40 గ్రా.,
  • కొవ్వు 0.41 గ్రా.,
  • విటమిన్‌ ఎ 210 ఐయు,
  • విటమిన్‌ సి 6 మిగ్రా.,
  • విటమిన్‌ బి6 0.05 మిగ్రా.,
  • కాల్షియమ్‌ 2.60 మిగ్రా.,
  • మెగ్నీషియం 4.50 మిగ్రా.,
  • ఫాస్ఫరస్‌ 6 మిగ్రా. ,
  • ========================
 Visit my Website - Dr.Seshagirirao...

3 comments:

  1. Alubakara is good medicine for constipation.

    ReplyDelete
  2. This fruit has good number of benefits but does not taste sweet.

    ReplyDelete
  3. This fruits has ample number if benefits but does not taste sweet.

    ReplyDelete