పార్కిన్సన్ జబ్బు వణుకుడుకు నికోటిన్ ఉండే కూరగాయలు----
పార్కిన్సన్ జబ్బు బారినపడ్డవారికి తల, చేతులు, కాళ్లు అదేపనిగా వణుకుతుంటాయి. కాళ్లు చేతులు బిగుసుకుపోవటం, శరీర నియంత్రణ కోల్పోవటంతో పాటు కదలికలూ తగ్గిపోతాయి. మెదడులో డోపమైన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసే కణాలు తగ్గిపోవటం ఈ జబ్బుకు దారితీస్తుంది. అయితే సహజసిద్ధంగా నికోటిన్ గల పచ్చిమిర్చి, క్యాప్సికమ్, టమోటా, బంగాళాదుంప వంటివి తరచుగా తినేవారికి ఈ వ్యాధి ముప్పు మూడోవంతు వరకు తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. పొగాకు వినియోగానికీ పార్కిన్సన్ ముప్పు తగ్గటానికీ సంబంధం ఉంటున్నట్టు గతంలో వెల్లడైంది. ఇందుకు పొగాకులోని నికోటిన్ దోహదం చేస్తుండొచ్చని భావిస్తున్నారు. అందుకే సహజసిద్ధంగా నికోటిన్ ఉండే కూరగాయలు పార్కిన్సన్ జబ్బుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అనేదానిపై వాషింగ్టన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఇటీవల ఒక అధ్యయనం చేశారు. వీటిని తరచుగా తినేవారికి ఈ జబ్బు ముప్పు తగ్గుతున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా ఇంతకుముందు పొగాకు అలవాటు లేనివారికి మరింత రక్షణ కల్పిస్తున్నట్టు కనుగొన్నారు.
- =======================
No comments:
Post a Comment