Care of food in school going children - బడి పిల్లల ఆహారం విషయంలో జాగ్రత్తలు
ఆహారంలో విటమిన్లు, ప్రొటీన్లు, కొవ్వు, పిండి పదార్ధాల్లాంటివి అన్నీ ఉన్నాయా? లేదా? చూసుకోవాలి. బడి పిల్లల ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకుంటే...వారి ఆరోగ్యం బాగుంటుంది...చదువూ సాఫీగా సాగుతుంది.
ప్రొటీన్స్, కార్భోహైడ్రెడ్స్...
విద్యార్ధుల్లో శరీర పెరుగుదలకు ప్రొటీన్స్ ఎంతో ముఖ్యమైనవి. రోగ నిరోధక శక్తిని కూడా ప్రొటీన్స్ పెంచుతాయి. గాయాలు తగిలినా ప్రొటీన్స్ ఎక్కువగా ఉండడం వలన త్వరగా తగ్గుతాయి. కోడిగుడ్లు, పప్పు దినుసులు, మొలకెత్తే విత్తనాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇక కార్భోహైడ్రెడ్స్ అంటే పిండి పదార్ధాలు. ఇవి శక్తినిస్తాయి. జీవనశైలికి శక్తి ఎంతో అవసరం. పిండి పదార్ధాలు విద్యార్ధులకు గ్లూకోజ్‌లా పనిచేస్తాయి. చిరు ధాన్యాలు, బియ్యం, గోధుమలు, రాగులు తదితర వాటి వల్ల ఇవి సమృద్దిగా లభిస్తాయి.
కొవ్వు పదార్ధాలు...
కొవ్వు పదార్ధాలతో విద్యార్ధులకు ఎంతో మేలు జరుగుతుంది. శరీరంతో పాటు లోపల ముఖ్య భాగాలైన మూత్రపిండాలు, గుండె లాంటి వాటికి రక్షణ కవచాల్లా ఉంటాయి. కొవ్వు పదార్ధాలు తక్కువగా ఉన్నవారు వాతావరణంలో మార్పులు తట్టుకోలేకపోతారు. మాంసం, వెన్నె, నెయ్యి, పాలు, పల్లి నూనె, గింజలు తీసిన వంట నూనె శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కొవ్వు పెరిగి అది ఎముకలకు రక్షణగా నిలుస్తుంది.
గుడ్డు...
కోడి గుడ్డు పిల్లలకు ఎంతో ఆరోగ్య ప్రదాయిని. రోజుకు ఒక గుడ్డు చొప్పున కోడిగుడ్డు తినిపిస్తే వారి ఆరోగ్యానికి భరోసా లభించినట్లు అవుతుంది. కోడి గుడ్డులోని నీలం తినిపిస్తే పిల్లలకు కొవ్వు లభిస్తుంది. వంద శాతం పౌష్టికాహారం లభించేది గుడ్డులోనే అనే విషయం చాలా మందికి తెలియదు. 11రకాల ఆవ్లూలు గుడ్డులోనే లభిస్తాయి.
మినరల్స్...
మినరల్ తక్కువగా ఉండడంతో విద్యార్ధుల్లో ఎముకలు, దంతాల పెరుగుదల నిలిచిపోతుంది. రక్తస్రావం త్వరగా అదుపులోకి రాదు. నాడీ వ్యవస్థలో చైతన్యం కొల్పోతుంది. కండరాలు పని చేయవు. జీవక్రియ మెతకబడుతుంది. అలాగే ఐరన్‌ను రక్తంలో ఉండే ధాతువులు తక్కువ అయినా ప్రమాదమే. రక్తంను ఆక్సిజన్‌తో వివిధ భాగాలకు చేరవేయడానికి ఐరన్ కీలక భూమిక పోషిస్తుంది. శారీరక, మానసిక స్థిరత్వానికి మాంసం, కోడిగుడ్లు, చేపలు, పాలు, కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, రాగులు, కర్జూరా, బాదం, ఖాజు బాగా తినిపించాలి.
అయోడిన్...
అయోడిన్ లోపిస్తే అనారోగ్యం తప్పదు. థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అయోడిన్ తక్కువ అయితే జ్ఞాపక శక్తి తగ్గుతుంది. దీనితో విద్యార్ధులు చదువుతున్నప్పటికి వాటిని గుర్తుంచుకోలేకపోతారు. జింక్ కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి పిల్లలకు చేపలు, రొయ్యలు, పండ్లు, కూరగాయలతో పాటు బాగా తినిపించాలి. ప్రభుత్వం కూడా అయోడిన్, ఐరన్ కలసిన ఉప్పును మార్కెట్‌లో లభిస్తుంది.
మొలకెత్తిన విత్తనాలు...
మొలకెత్తిన విత్తనాలు తినడం ఎంతో మంచిది. వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పెసర్లు, శెనగలు, రాగులు, బబ్బర్లు, పల్లిdలు, కర్జూరా. వీటిని రాత్రి తడిగుడ్డలో చుట్టి ఉంచాలి. తెల్లవారేసారికి మొలకలు వస్తాయి. వాటిని ప్రతి రోజు పిల్లలకు తినిపించాలి. విటమిన్లు, పోషక పదార్ధాలు లభిస్తాయి. మార్కెట్లోనూ దొరుకుతాయి.
పిల్లలపై ప్రభావం:
- ప్రొటీన్లు, కొవ్వు పదార్ధాలు, పిండి పదార్ధాలు, విటమిన్ల లోపంతో విద్యార్ధులపై అనేక ప్రభావం చూపుతుంది.
- విద్యార్ధుల్లో తొందరగా అలసట రావడం.
- చదువులో వెనకబడడం.
- జ్ఞాపకశక్తి తగ్గడం.
- రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది.
- వ్యాధులు ఎప్పుడు వస్తాయి.
- దృష్టి లోపాలు వస్తాయి.
- దంతాలు, ఎముకల సమస్యలు.
- పుస్తకాల బ్యాగులు మోయలేకపోవడం.
- చురుగ్గా ఉండకపోవడం.
- క్రీడలపై నిరాసక్తి.
- ============================
Visit my Website - Dr.Seshagirirao...
No comments:
Post a Comment