Tuesday, August 11, 2009

కోడిమాంసము ,chicken

శరీర నిర్మాణానికి మాంసకృత్తులు చాలా అవసరం. శారీరక పెరుగుదల, కండరాల పెరుగుదల, మెదడు, శరీర అవయవాలు ఆరోగ్యంగాను, సమర్ధవం తంగాను పనిచేయడానికి మాంసకృత్తులు చాలా అవసరం. పిండిపదార్థాల వల్ల శారీరకంగా కొంత మేరకు శక్తి కలుగుతున్నప్పటికీ శారీరక ఎదుగుదలకు కావలసిన మాంసకృత్తులు మాత్రం పిండిపదార్థాలలో కొంతవరకే ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ, సరి పడినంత మోతాదులో మాంసకృ త్తులు కలిగిన పదార్థాలను విధిగా తీసుకోవాలి . కోడి పక్షిజాతికి చెందిన జంతువు . పౌల్ట్రీ ఉత్పత్తులలో ప్రపంచమంతా వాడేది కోడిమాంసమే. సుమారు 600 బి.సి నుండి బాబిలోనియన్‌ ప్రజలు చికెన్‌ ను వాడినట్లు ఆనవాలు ఉన్నాయి. దీని మాంసములో కొవ్వుపదార్ధము తక్కువగా ఉండి పోషకాలు , మాంసకృత్తులు దండిగా లభిస్తాయి. తేలికగా జీర్ణము అవుతుంది . కోడిమాంసము వేడి చేస్తుందని అనుకోవడం సరైనది కాదు ... ఇది మంచి పౌష్టికాహారము . వృక్ష సంబంధమైన మాంసకృత్తులు, జంతు సంబంధమైన మాంసకృత్తులకు ఏమీ తీసిపోవు. అయితే రెండూ ఉన్న ఆహారం మరింత పుష్టికరం. కోళ్ళ లో రకాలు :
  • నాటుకోళ్ళు : మన ఇళ్ళలో పెంచేవి . ఇవి ఎక్కువగా పల్లె ప్రాంతాలలో చూడవచ్చును.
  • బాయిలర్ కోళ్ళు : వ్యాపార రీత్యా హైబ్రిడ్ కోళ్ళను కోళ్ళ ఫారం లలో పెంచుతారు . ఇవి నాటుకోళ్ళంత రుచిగా ఉండవు .
  • గిన్నీ కోళ్ళు : ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి. అడవులలో ఎక్కువగా కనిపిస్తాయి.
  • దొంక కోళ్ళు : ఇవి పళ్లె టూళ్ళలో పొలాలలో ఎక్కువగా కనిపిస్తాయి. చిన్నవి గా ఉండి తక్కువ కండ కలిగి తక్కువ మాంసము ను ఇస్తాయి.
  • నిప్పుకోళ్ళు : ఇవి చాలా పెద్దవి గా ఉంటాయి. నిప్పుకోళ్ళను ఎక్కువగా గుడ్ల కోసము పెంచుతారు .
తినకూడని పరిస్థితులు :
  • భగందర వ్రణము తో బాదపడుతున్నవారు ,
  • మూలవ్యాధితో బాదపడుతున్నవారు ,
  • కడుపులో ఉదరకోశ పుండ్లు (అల్సర్స్ ) తో బాదపడుతున్నవారు ,
  • మద్యము ఎక్కువగా తాగేవారు ,
  • మూత్రకోశ రాళ్ళు తో బాదపడుతున్నవారు ,

4 comments: