Showing posts with label అందానికి సమతుల్య మరియు పౌష్టికాహారం. Show all posts
Showing posts with label అందానికి సమతుల్య మరియు పౌష్టికాహారం. Show all posts

Thursday, November 22, 2012

Balanced and Nutritive food for beauty- అందానికి సమతుల్య మరియు పౌష్టికాహారం

  •  




పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.



ముప్ఫౖ ఏళ్లు దాటుతున్నా, ఇరవై ఏళ్ల వారిలా కనిపించాలని అనుకుంటారు చాలామంది. అలా కనిపించడం సులువే అంటున్నారు సౌందర్య నిపుణులు. చేయాల్సిందల్లా తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టడమే. పోషకాహారం, కంటినిండా నిద్ర, ప్రశాంతమైన మనసు... ఈ మూడూ చర్మం మెరిసిపోవడానికి ముఖ్యంగా పాటించాల్సినవి. ఇందులో ఆహారానిదే ప్రధానపాత్ర. ఓ తాజా అధ్యయనం ప్రకారం, ఆహారంలో చక్కెర ఎక్కువగా తీసుకునే వాళ్లు వారి అసలు వయసు కన్నా పెద్దవారిలా కనిపిస్తున్నట్లు తేలింది. అందుకే చక్కెర ఎక్కువగా ఉండే శీతల పానీయాలూ, క్యాండీలూ, కేకులూ, కుకీలకు దూరంగా ఉండాలి. సహజ చక్కెరలు కలిగే ఉండే తాజా పండ్లను ఎక్కువగా తినాలి. ఉప్పు ఎక్కువగా తినడం తగ్గించాలి. ఒకరోజులో తినే ఆహార పదార్థాలన్నింటిలో ఒక టీ స్పూను కన్నా ఎక్కువ ఉప్పు వేయకుండా ఉంటే మంచిది.మగవారు కాస్త మోటుగా వున్నా పర్వాలేదు. ఆడవారు అందంగా నాజూగ్గా వుండాలి. ఆడవాళ్లు అందంగా కనిపించాలంటే బాహ్యాలంకరణ మాత్రమే వుంటే చాలదు. స్వతస్సిద్ధంగా కూడా అందంగా వుండాలి. వయసుకు తగ్గ అందం వుండాలి. అందంగా వుండాలనుకుంటే శరీరం తప్పకుండా ఆరోగ్యవంతంగా వుండాలి. ఆరోగ్యానికి ఆయువుపట్టు మీరు తీసుకునే ఆహారం నియమబద్దంగా వుండాలి. పౌష్టికాహారాన్ని నియమబద్ధంగా తీసుకుంటూ తగు మోతాదులో శరీర వ్యాయామం చేసుకుంటూ అందంగా, ఆరోగ్యంగా వుండాలి. ఇది ఆడవారికి అత్యంత ముఖ్యం.  చేయగలిగినంత ఇంటిపని చేయాలి. మన శరీరంలోని కణాలు నిర్వీర్యం కాకుండా పొషించేవి విటమిన్లు, న్యూట్రిషియన్‌ ఫుడ్‌ను తీసుకోవాలి. అంటే పరిపూర్ణ ఆహారం తీసుకోవాలి. పాలు, పండ్లు వంటివి బ్యాలెన్స్‌డు డైటు తీసుకోవాలి.


మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు విటమిన్లు మినరల్స్‌ కొవ్వు పదార్థాలు వుండాలి.మనం తీసుకునే ఆహారంలో హెచ్చుభాగం పండ్లు, కూర గాయలు వుండాలి. రిఫైండ్‌ షుగర్స్‌ వాడ రాదు. పంచదారకన్నా తేనెను వాడవచ్చు. అలాగే తాజా ఆకుకూరలు, టమాటోలు, దోసకాయ మొదలైనవాటిలో కాల్షియం ఎక్కువగా వుంటుంది. కెరోటిన్‌, రిబోప్లోవిన్‌, విటమిన్‌ సి, పోలిక్‌ ఏసిడ్‌ వుంటాయి. కాబట్టి ఇవే తీసుకో వాలి.ఆరంజ్‌, యాపిల్‌, బొప్పాయి తింటే ఆరోగ్య మైన చర్మం ఏర్పడుతుంది. లెమన్‌ జ్యూస్‌ మంచిది. ఇందులో సి విటమిన్ వుండి చర్మాన్ని ఇన్‌ఫెక్షన్‌ నుంచి కాపాడుతుంది. ఎక్కువగా టీ, కాఫీ త్రాగ కూడదు. అతి చల్లని పానీ యాలు ఆరోగ్యానికి హాని కరం. నీరు పుష్కలంగా తాగాలి. శరీరంలోని మలినాలని ప్రక్షాళన చేస్తుంది. ఇంకా మజ్జిగ, వెన్నతీసిన పాలు ఒంటికి మంచిది. టిన్‌లలో పాక్‌ చేసిన పండ్లు, కూరలు వాడ కూడదు. జీర్ణకోశం శుభ్రంగా వుండాలంటే పీచు ఎక్కువగా వున్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. గ్యాస్‌ ప్రాబ్లమ్‌వుంటే నూనె వస్తువులు, శనగపిండితో చేసే వాటిని తగ్గించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, వాకింగ్‌ శరీరాన్ని అనవసరంగా పెరగనివ్వకుండా చేస్తుంది. తిండి తినకుండా మాడితే మనుషులు బరువు తగ్గుతారనేది సరైనది కాదు. బ్యాలెన్స్‌డ్‌ ఫుడ్‌ తీసుకోవాలి. స్వీట్లు మితంగా తినాలి. ఇక తిండి తినేటప్పుడు పుస్త కాలు చదవడం, టీవి చూడటం చేయకూడదు.   ఫైబర్‌ ఫుడ్స్‌ వల్ల పైల్స్‌, కిడ్నీలో రాళ్లు, అల్సర్‌ లాంటివి రావు.  ఆహారం అసలు తినకుండాను(ఉపవాసము ), ఆహారం అమితంగా(exess)ను తీసుకోకూడదు. మీ కోపతాపాలు, మీ శరీరం సౌందర్యం ... మీరు తినే ఆహారం మీదే ఆధారపడివుంటాయి

మూడేళ్ల క్రితం చేసిన ఓ పరిశోధనలో పసుపూ, ఆకుపచ్చ రంగులో ఉన్న కూరగాయలూ, పండ్లూ తినడం వల్ల ముఖంపై ముడతలు రావడం తగ్గుతుందని తెలిసింది. అలాగే వివిధ రంగుల్లో ఉండి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పళ్లను తింటే వయసు అయిదేళ్లు తగ్గినట్టు కనిపిస్తారు. ఇక, చర్మం తాజాగా మారిపోవాలి అనుకునే వారు చేపల్ని తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఒమెగా త్రీ, సిక్స్‌ ఫ్యాటీ ఆమ్లాలూ, ప్రొటీన్లూ ఉన్న చేపలు తింటే అందం, ఆరోగ్యం సొంతం అవుతాయి.

  • =====================
Visit my Website - Dr.Seshagirirao...