- ఎముక పుష్టి కి- క్యాల్షియం -ఆహార మార్గం---
*అంజీర: ఎండిన అంజీర పండ్లను అరకప్పు తీసుకుంటే 121 మి.గ్రా. క్యాల్షియం లభించినట్టే. ఇందులో పొటాషియం, పీచు కూడా దండిగా ఉంటాయి. కండరాల పనితీరును, గుండెలయను నియంత్రించటం వంటి పలురకాల పనుల్లో పాలు పంచుకునే మెగ్నీషియమూ వీటితో లభిస్తుండటం విశేషం.
*నారింజ: ఒక పెద్ద నారింజ పండులో 74 మి.గ్రా. క్యాల్షియం ఉంటుంది. ఇందులో రోగనిరోధకశక్తిని పెంచే విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండటంతో పాటు కేలరీలూ తక్కువే.
*సార్‌డైన్ చేపలు: వీటిని 120 గ్రాములు తీసుకుంటే 351 మి.గ్రా. క్యాల్షియం లభిస్తుంది. మెదడు, నాడీ వ్యవస్థల ఆరోగ్యానికి కీలకమైన విటమిన్ బీ12 కూడా అందుతుంది. క్యాల్షియం ఎముకల్లోకి ప్రవేశించటానికి తోడ్పడే విటమిన్ డి సైతం వీటిల్లో ఉంటుంది.
*బెండకాయ: మలబద్ధకాన్ని నివారించే పీచుతో నిండిన బెండకాయలను ఒక కప్పు తింటే 82 మి.గ్రా. క్యాల్షియం అందుతుంది. అలాగే వీటిల్లో విటమిన్ బీ6, ఫోలేట్ వంటివీ ఉంటాయి.
*టోఫు: ప్రోటీన్‌తో పాటు క్యాల్షియంతో కూడిన ఇది శాకాహారులకు ఎంతగానో మేలు చేస్తుంది. సగం కప్పు టోఫులో 434 మి.గ్రా. క్యాల్షియం ఉంటుంది.
*బాదంపప్పు: ఆరోగ్యానికి మేలు చేసే పప్పుగింజల్లో (నట్స్) భాగమైన బాదం మంచి క్యాల్షియం వనరు. 30 గ్రాముల బాదంపప్పుతో 75 మి.గ్రా. క్యాల్షియం లభిస్తుంది. అయితే వీటిని పొట్టు తీయకుండా తినటం మంచిది. బాదంపప్పులో విటమిన్ ఈ, పొటాషియం కూడా ఉంటాయి. మితంగా తింటే చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గటానికీ తోడ్పడతాయి.
- ============================