Showing posts with label Cucumber. Show all posts
Showing posts with label Cucumber. Show all posts

Monday, August 10, 2009

దోస , Green Cucumber

పండ్లు , కాయగూరలు ,గింజలు పప్పులు , కందమూలాలు , మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.
చల్లగా చూడగానే తినాలపించే కీరదోస వేసవిలో సాంత్వన నివ్వడమే కాదు దానిలోని పుష్కలమైన పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రీహైడ్రేటింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండటంతో రక్తపోటుతో బాధపడేవారికి ఇది చక్కని ఆహారం. స్వేదం ద్వారా కోల్పోయిన నీటిని, లవణాలను శరీరానికి తిరిగి అందించడంలో కీరదోస చక్కని పాత్ర పోషిస్తుంది. రోజూ కప్పు కీరదోస రసం తాగితే మేని నిగారింపు సంతరించుకుంటుంది. దీని నుంచి ఆవస్యక ఫొలేట్‌తో పాటు విటమిన్‌- ఎ, సిలు పుష్కలంగా లభిస్తాయి.
  • శక్తి: 13కి.కెలొరీలు;
  • మాంసకృత్తులు: 0.4గ్రా;
  • కార్బోహైడ్రేట్లు: 2.5గ్రా;
  • కొవ్వు: 0.1 గ్రా;
  • పీచు: 2.6;
  • సోడియం: 10.2మి.గ్రా;
  • పొటాషియం: 50మి.గ్రా
ఉపయోగాలు :
  • రక్తపోటు లో తేడా ఏర్పదినవారికి దోసకాయలో ఉన్న "పొటాసియం " రక్తపోటు లో ని హెచ్చు తగ్గులను సవరిస్తుంది.
  • దోస లోని లవణాలు గోళ్ళను అందం గా , చిట్ల కుండా ఉంచుతాయి .
  • కళ్ళ కింద నల్లటి చారలను కీరదోసకాయ ముక్కలు తొలగించును , కళ్లు ఉబ్బినట్లు ఉంటే వాటిమీద తాజా కీరదోసకాయ ముక్కలను కాటన్ వేసి పెట్టుకుంటే చక్కటి ఫలితమిస్తాయి .
  • శిరోజాల ఎదుగుదలకు దోసలోని సల్ఫర్ , సిలికాన్ , దోహదపడి జుట్టు ను ఆరోగ్యం గా ఉంచుతుంది .
  • దోస కడుపులోని మంటను తగ్గిస్తుంది , జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది .
  • దోస తొక్క లో " విటమిన్ 'కే' " సమృద్ధి గా ఉన్నందున చేర్మానికి మేలుచేకురుతుంది .
దోసకాయ ను తోక్కతోతే తినాలి , దోసకాయను ఉరగాయ గా చేసి తినకూడదు . ఆరోగ్య ప్రయోజనాలు : ఎసిడిటీ : కీరదోసకాయ జ్యూస్ తాగడం ద్వారా అందులో ఉండే ఖనిజాలలోని ఆల్కలైన్‌ స్వభావమువల్ల రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది .. దీంతో ఎసిడిటీ సమస్య తగ్గుతుంది . అలాగే కీరదోసకాయ జ్యూస్ గ్యాస్ట్రిక్ , డియోడినం అల్సర్లకు చికిత్సగా ఉపయోగపడి ఉపశయనం కలిగిస్తుంది . రక్తపోటు : ఎటువంటి రంగులు లేని కీరదోసకాయ జ్యూస్ వలన రక్తప్రసరణ క్రమ బద్ధంగా ఉంటుంది . ఇందులోని ఖనిజాలు సోడియం ను నియంత్రణ కు దోహదపడుతుంది . చలువ : వాతావరణం పొడిగా , వేడిగా ఉన్న రోజుల్లో కీరదోషకాయ జ్యాస్ ఏవైనా ఆకుకూరల రసం తో కలిపి తీసుముంటే చలువ చేస్తుంది . శరీర ఉష్ణోగ్రతను సమతుల్యము గా ఉండేలా చేస్తుంది . మూత్ర విసర్జన : మూత్రపిండాలలో రాళ్ళు కరిగిపోవడానికి , మూత్ర విసర్జన చక్కగా జరగడానికి దోహదపడుతుంది . నొఫ్ఫితో కూడిన వావు : కీళ్ళలో ఉండే యూరిక్ యాసిడ్ ను తొలగించడం వల్ల వాపు , నొప్పి తగ్గిపోతాయి . ఆర్త్రైటిస్ , గౌట్ వ్యాధులలో ఇది మంచి చేస్తుది . జట్తు పెరుగుదల : కీరదోసకాయలో గల సిలికాన్‌ , సల్ఫర్ ఖనిజలవణాలు జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది చర్మం మెరుగుదల : ఇందులోగల అధిక ' సి ' విటమిన్‌ వల్ల చర్మ పరిస్థితి ని మెరుగుపరుస్తుంది . సౌందర్య పోషకాలలో కీరదోషకాయ తప్పక ఉంటుంది . ఎగ్జిమ , తామర , సోరియాసిస్ వంటి చర్మ వ్యాదులకు చికిత్సకోసం కీరదోషకాయ వాడవచ్చును . ఎండలో చర్మము కమిలిపోవడం : తీవ్రమైన ఎండవలన చర్మమము కమిలి పోతుంది . అప్పుడు కీరదోషకాయ రసం తీసి కమిలిన చోట రాస్తే చల్లగా ఉండి శరీరానికి ఉపశయనం కలుగుతుంది . శరీరం లో నీటినిల్వ : కీరదోషకాయ రసం లో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి అందువలన శరీరం లో తగిన మోతాదులో నీటి నిల్వకు దోహదం చేస్తాయి . కళ్ళు చలువ : కీరదోషకాయ గుండ్రని ముక్కలుగా తరిగి కళ్ళపై ఉంచితే మంటలు తగ్గి ఉపశయనం తో పాటు కళ్ళు చల్లగా ఉంటాయి. వేడి తగ్గుతుంది . కళ్ళ వాపు తగ్గుతుంది . ========================================================== Visit my website -> dr.seshagirirao