- =================================
Showing posts with label మునగ కాయలు. Show all posts
Showing posts with label మునగ కాయలు. Show all posts
Wednesday, March 2, 2011
మునగ కాయలు ,Moringa Green Sticks
పండ్లు , కాయగూరలు ,గింజలు , పప్పులు , కందమూలాలు , మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం. ప్రకృతి పరంగా లభించే పండ్లు, కూరగాయలను తీసుకోవడంతో మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. శరీరానికి కావలసిన పోషకపదార్థాలు పండ్లు, తృణదాన్యాలు , సుగందద్రవ్యాలు ,కూరగాయల్లో ఉంటాయనడంలో సందేహం లేదు.
దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునగ ఒకటి. ఈ చెట్టు ఉపయోగాలు ఎన్నో..ఎన్నెన్నో.. చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే. పోషకాలు కూడా ఎక్కువే. పంటగా కూడా సాగు చేసే మునగలోని మంచి గుణాలు తెలుసుకుందాం.
-మునగ శాస్ర్తీయ నామం ‘మొరింగ బలిఫెర’ ఇది మొరింగేసి కుటుంబంలోనిది. సులువుగా పెంచే, తొందరగా పెరిగే మొక్క లలో ఇది ఒకటి. దీన్ని పంటగా కూడా సాగు చేస్తున్నారు. విశేషమైన పోషకాలున్న చెట్టుగా ఇది ప్రసిద్ధి కూడా. 5000 సంవత్సరాల క్రితమే ఇది వాడుకలో వున్నట్లు తెలుస్తోంది. మునగ కాయలే కాకుండా ఆకులు కూడా చాలా బలమైన ఆహారం.బాక్టీరియా, శిలీంధ్ర, కీటక సంహారిగా దీనిని వుపయోగిస్తారు. ఎరువుగా కూడా దీన్ని వుపయోగిస్తారు. వేర్లు, ఆకులు, కాయలు, విత్తనాలు వైద్యంలో వుపయోగిస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రయోగాల, పరిశోధనల ఫలితంగా తక్కువ వ్యయంతో మునగ విత్తనాలతో నీటిలోని బ్యాక్టీరియాను నిర్మూ లించి, నీటిని శుద్ధి చేయొచ్చు.
సాగు :
-ఉత్తర భారతదేశంలోని దక్షిణ పర్వత ప్రాంతల్లో ఇది పుట్టినట్లు తెలు స్తోంది. అన్ని ప్రాంతాల నేలలు అనుకూలం. 9-10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. సాగు చెట్లలో అధిక దిగుబడి కోసం ఒక మీటరు కంటే ఎక్కువగా పెరగనీయకుండా కత్తిరిస్తారు. కొమ్మలు కొందికి వాలినట్లు వుండి దృఢంగా వున్నా కూడా ఇది చాలా పెళుసు. చిన్న గాలులకు, తాకిడికి సైతం విరిగిపోతుంటాయి. అందుకే మునగ చెట్టు ఎక్కకూడదని అంటారు. ఈ చెట్టు పూలు తెల్లగా, గుత్తులు, గుత్తులుగా పూస్తాయి. కాయలు మూడు పలకలుగా 50 సెంటీ మీటర్ల పొడువు, 1-2 సెంటీ మీటర్ల వెడల్పు వుండి కాడల్లా వుంటాయి. అందుకే ములగకాడ అని కూడా అంటారు. ఎండిన తరువాత కాయలు మూడు భాగాలుగా చీలి, 3 రెక్కలతో కూడిన విత్తనాలు బయటికి వస్తాయి. విత్తనాలు కొమ్మల కత్తిరింపుల ద్వారా ఇవి విస్తరిస్తాయి.
Labels:
Moringa Green Sticks,
మునగ కాయలు
Subscribe to:
Posts (Atom)
-మునగ కాడలు .
-మునగ చెట్టు +పువ్వులు .
-మునగ కూర .
