Showing posts with label సెలరీ. Show all posts
Showing posts with label సెలరీ. Show all posts
Monday, August 10, 2009
సెలెరి , Selery
ఎపియం జాతికి చెందిన ఒకరకమైన ఆకుకూర . apium graveolens దీని శాస్త్రీయనామము . ఇది సుమారు 1 మీటరు ఎత్తువరకూ పెరుగును . ' కార్ల్ వాన్ లిన్నె ' తన రచనలలో దీని గురించి వ్రాసారు . వీటి కాండము , ఆకులు ,వేరు .. ఆహారము గా తింటారు . సెలరీ కి సంబందించన వాస్తవమేమిటంటే అదనమువా కీలరీలు చేర్చకుండా అది పొట్ట నింపుతుంది . శరీరములో ద్రవాల సంతుల్యాన్ని క్రమబద్ధీకరంచాలంటే పొటాషియం , సోడియం సమ్మేళనము అవసరము . దీనిలో పొటాసియం ఉంటుంది . దీనిలోని కరగని పీచుపదార్దము పేగులలో ఆహారపదార్ధము వేగముగా కదలడానికి తోడ్పడుతుంది .
సెలరీ విత్తనాలనుండి ఆవిరి అయ్యేటటువంటి నూనే తీసి మందులలలోను , పెర్ఫూమ్‌స్ లోను వాడుతారు .
సెలరీ సీడ్ లో 3-N-butyl-phthalidi అనే కాంపౌండ్ నొప్పినివారిణివాను , రక్తపోటు తగ్గించేందుకు గాను వాడుదురు. దీనిలోని " యాండ్రోస్టెరాన్ " మూలాన యాఫ్రోడయసిక్ గా వాడుతున్నారు . మగవారిలో సెక్ష్ కోరికలు కలిగించేదిగా పనిచేయును.
కేలరీరు లేక కడునింపేందుకు ఉపయోగపడడము వలన బరువు తగ్గడానికి మెడిషన్ గా వాడుతున్నారు . కాల్సియం ఎక్కువగా ఉండును . వయసుమల్లిన స్త్రీలకు మంచిది. గర్భకోశము ను సంకోషింపజేసే గుణము ఉన్నందున గర్భిణీ స్త్రీలు దీనిని వాడకూడదు .
ఎలర్జీ గుణము వున్నందున ఈ కూర పడని వారు దూరము గా ఉండాలి . ఒక్కొక్కసారి సీరియస్ ఎలర్జీ రియాక్షన్ దీనివలన కలిగే అవకాశాలు ఉన్నాయి.
Subscribe to:
Posts (Atom)