Showing posts with label Jasmin medical uses. Show all posts
Showing posts with label Jasmin medical uses. Show all posts

Sunday, May 1, 2011

Jasmin medical uses,ఆరోగ్యానికి మల్లెల మహిమ

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం..... మల్లెపూల వాడకం మనకు కొత్తదేమీ కాదు. మల్లెల వాసన మరోలోకుులో విహరింపజేస్తుంది . మల్లెపూలు ఎన్నో మేలైన గుణాలున్నాయి . మల్లెపూల వాసన నాడీవ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది . మానషిక అందోళనలు తగ్గించి ప్రశాంతత ఇస్తుంది .శృంగార పరమైన కోర్కెలను పెంచుతుంది . అయినప్పటికీ పూలను టీలో వాడడం మన దేశంలో అరుదు. మల్లెపూల టీ చైనాలో, జపాన్లో చాలా పాపులర్. ఈ టీ యొక్క ఉపయోగాల మీద చాలా రిసర్చ్ చేసి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని తేల్చారు పరిశోధకులు. ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా ఈ టీ ప్రాచుర్యం పొందుతోంది. కనుక మనం కూడా ఇప్పడు దాని గురించి వివరంగా తెలుసుకుందాం. మల్లెపూలతో టీ ఎలా చేయాలి: ఈ టీని తయారుచేసే పద్ధతులు చాలా ఉన్నాయి. కాని అన్నిటికంటే సులభమైన మార్గం మనమిప్పుడు చెప్పుకుందాం. మల్లెపూల టీ కోసం మీరు తాజా మొగ్గలు తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో పెట్టండి. దాంట్లో ఒక చెంచా మామూలు టీపొడి వేయండి. టీపొడి కన్నా మల్లెమొగ్గలు ఎక్కువగా ఉండాలి. ఒక చెంచా టీపొడికి ఏడు చెంచాల మల్లెమొగ్గలు తీసుకోవాలి. ఈ నిష్పత్తి కొంచెం అటూ, ఇటూ అయినా ఫర్వాలేదు. కాని టీపొడి, మల్లెమొగ్గల నిష్పత్తి 1 :7 ఉంటే ఆ మల్లెలలోని సుగుణాలు అన్నీ పొందవచ్చు. ఇప్పుడు వేరొక గిన్నెలో ఒక పెద్ద గ్లాసు నీళ్ళను మరగనివ్వండి. అవి బాగా మరిగినాక వాటిని గిన్నెలో పెట్టుకున్న మల్లెలు, టీ పొడి పెట్టిన గిన్నెలో పోసి కొంచెంసేపు మూత పెట్టండి. ఐదు నిముషాలు ఆగి దానిని వడకట్టి, దానిలో పటికబెల్లం పొడి కాని, తేనె కాని కలిపి త్రాగండి.
ఈ టీ వల్ల ఉపయోగాలు: * రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది. కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. * రక్తంలో ఎల్.డి.ఎల్. కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. అందుచేత హృదయసంబంధ వ్యాధులను, పక్షవాతాన్ని రానీయదు. * వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. * లావు తగ్గాలనుకునే వారికి ఈ టీ ఎంతో మంచిది. తొందరగా బరువు తగ్గటానికి సహాయపడుతుంది. * దీనితో పుక్కిలిస్తే చిగుళ్ళ వ్యాధులు, దంతక్షయం రాకుండా కాపాడుతుంది. * అల్సర్, కాన్సర్ వంటివి రాకుండా సహాయపడుతుంది. * జలుబు, దగ్గు, అలర్జీల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. * వృద్ధాప్యాన్ని దరిచేరనీయదు. * కండరాల నొప్పులను, కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. * రొమాంటిక్ భావాలు పెంచుతుంది. కనుక జడత్వం ఉన్నవాళ్ళకు చాలా మంచిది. మల్లె పూలు నీటిలో వేసుకొని గంట తర్వాత స్నానము చేస్తే హాయినా ఉంటుంది . శరీరము మల్లెవాసనతో గుబాలిస్తుంది . నీటిలో మల్లెలు చేసి తాగడం వేసవిలో దాహార్తిని తగ్గిస్తుంది . మల్లెలనుండి నూనె తీస్తారు . నూనె కు సెక్సు సమస్యలును తొలగించే గుణము ఉన్నది . మల్లెల నూనెను కీళ్ళ , కండరాల నిప్పులకు రాస్తే ఉపశయనం కలుగుతుంది , బాధ , నొప్పి తగ్గుతాయి. మొటిమలవల్ల వచ్చే మచ్చలకు మల్లెల నూనే రాస్తే మచ్చలు చర్మం రంగులో కలిసిపోతాయి . మల్లెల సువాసన నిద్ర కలిగిస్తుంది . . . నిద్రలేమిగలవారు ప్రకృతి వైద్యం గా వాడవచ్చును .
  • ======================================
Visit my Website - Dr.Seshagirirao