Showing posts with label నిమ్మ. Show all posts
Showing posts with label నిమ్మ. Show all posts

Monday, August 10, 2009

నిమ్మ , Lemon Fruit

నిమ్మ లో ఆమ్లాలు అధికం గా ఉంటాయి ... జీర్ణ క్రియ సమస్యలు పరిష్కరిస్తుంది . కాలేయానికి టానిక్ గా పని చేస్తుంది . గొంతు నొప్పి , ఆస్తమా ల నుండి ఉపశయనం ఇస్తుంది . ఆహారము ద్వార మనకు లభించే ఇనుము , కాల్సియం ను శరీరము గ్రహించడానికి విటమిన్ సి ఎంతగానో దోహదము చేస్తుంది .
  • నిమ్మజాతి పండ్లు..ఆరోగ్యం
రోజుకో యాపిల్‌ తింటే.. వైద్యుల అవసరమే ఉండదన్నది ఆంగ్ల సామెత. ఇప్పుడు అదే కోవలోకి పుల్లని పళ్లన్నీ వస్తాయని అంటున్నారు కెనడాలోని వెస్టర్న్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఒంటారియా నిపుణులు. పుల్లగా ఉండే బత్తాయి.. నారింజ.. కమలా, నిమ్మ.. సి విటమిన్‌ ఉండే ఇలాంటి ఫలాలని రోజుకొక్కటి తిన్నా అనేక జబ్బులకు దూరంగా ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. సిట్రస్‌ ఫలాలని తినడం వల్ల గుండెజబ్బులు, మధుమేహం, వూబకాయం నుంచి రక్షణ లభిస్తుంది. పుల్లని ఫలాలలోని ప్రత్యేక పిగ్‌మెంట్‌ కారణంగా ఈ భరోసా లభిస్తుందని వారు చెబుతున్నారు. నిమ్మ (Lemon) పండులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇవి పసుపు రంగులో ఉండి రుచికి పుల్లగా ఉంటాయి. నిమ్మరసం కోసము ఎక్కువగా వీటిని పెంచుతారు.
  • చరిత్ర :
నిమ్మ గురించి మొదటిసారిగా 10వ శతాబ్దంలొని అరబ్ సాహిత్యంలో పేర్కొనబడింది. భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో మొదటిసారిగా పండించారు. సుదీర్ఘ సముద్రయానం చేసే వారిలో వచ్చే స్కర్వీ వ్యాధి గ్రస్తులలో నిమ్మరసంతో ప్రయోగాలు జరిపి ఇందులోని విటమిన్ ''సి'' లోపించడం వల్ల ఈవ్యాధి వస్తుందని కనుగొన్నారు. నిమ్మచెట్టు పొట్టిగా దట్టంగా ఉండి 10 అడుగుల ఎత్తు పెరుగుతుంది. కొమ్మలు ముళ్ళతో ఉంటాయి. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకుల క్రింది భాగంలో పత్రపుష్పాలు రాలిన తర్వాత చిన్న బుడిపె మాదిరిగా తయారై అది పండుగా మారుతుంది. నిమ్మపండు గుండ్రంగా ఉండి ఒక చివర సూదిగా ఉంటుంది. పూర్తిగా పండిన నిమ్మపండు చర్మం ముదురు పసుపు రంగులో ఉంటుంది. పండులో తెల్లని చిన్న విత్తనాలుంటాయి.
  • నిమ్మపండ్ల ఉత్పాదన--
నిమ్మ ఉత్పాదనలో మెక్సికో, భారతదేశం ప్రధమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి.

ఉపయోగాలు
  • * నిమ్మరసం వేసవికాలంలో ఉప్పు లేదా పంచదారతో కలిపి పానీయంగా తాగడం చాలా మందికి ఇష్టం. ఒక నిమ్మపండు నుండి ఇంచుమించు 3 చెంచాల రసం వస్తుంది. నిమ్మరసంతో పులిహోర చాలా రుచిగా ఉంటుంది. 
  • * నిమ్మరసంలో చేపలు, మాంసం కొంతసేపు నానబెట్టిన అది మెత్తబడి రుచిగా ఉంటుంది. 
  • * నిమ్మపండులతో ఊరగాయ చేస్తారు. ఇది పత్యం చేసేవారికి చాలా ఇష్టంగా ఉంటుంది. 
  • *ఎండా కాలంలో నిమ్మ రసం కలిపిన షోడ ఉపయోగం తెలియని వారుండరు/. నీమ్మ తో షర్బత్ లు, నిల్వ వుండే పానీయాలు తయారు చేస్తారు. 
  • *ఎండన పడి వచ్చిన వారికి నిమ్మరసం ఇస్తే చాల త్వరగా శక్తి వస్తుంది. అందుకే నిరాహార దీక్ష విరమించె వారు నిమ్మ రసంతో దీక్ష విరమిస్తారు.
పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు
  • శక్తి --------30 kcal.
  • పిండిపదార్థాలు --9 g.
  • చక్కెరలు -----2.5 g.
  • పీచుపదార్థాలు-- 2.8 g.
  • కొవ్వు పదార్థాలు--0.3 g.
  • మాంసకృత్తులు---1.1 g.
  • నీరు--------89 g.
  • విటమిన్ సి-----53 mg 88%
  • Citric acid---5 g
(శాతములు, అమెరికా వయోజనులకుసూచించబడిన వాటికి సాపేక్షంగా)

ఆరోగ్య ప్రయోజనాలు :
  • * నిమ్మరసంలోని విటమిన్ సి గల ఏంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు చేసినవారికి ఇది చాలా మంచిది. 
  • * ఆయుర్వేదంలో నిమ్మ జీర్ణక్రియలోను చర్మసౌందర్యానికి చాలా మంచిదని వివరించబడింది. నిమ్మరసం వేడినీటిలో కలిపి సేవిస్తే కాలేయం శుభ్రపరుస్తుందని భావిస్తారు. 
  • * దీనిలోని కొన్ని పదార్ధాలు కేన్సర్ రాకుండా నిరోధిస్తాయి. 
  • * జపాన్ లోని కొందరు నిమ్మ వాసన ఎలుకలలో ఉద్రేకాన్ని తగ్గిస్తాయని నిరూపించారు. చర్మ సౌందర్యానికి నిమ్మకు మించినది లేదు. అందుకే చాల సౌందర్య సబ్బులలో నిమ్మను వాడతారు. *అలాగె నిమ్మను చాల సౌందర్య సాదనాలలో ఉపయోగిస్తారు. ముఖంమీద ముడతలను, మృతకణాలను ఇది తొలగిస్తుంది. జిడ్డు చర్మాన్ని మాపడానికి దీనికి మించిన మందు లేదు. *ఊబకాయానికి కూడ ఇది చాల మంచి మందు. రోజు ఉదయం నీళ్లలో నిమ్మరసం తేనె కలిపి సేవించడం వల్ల చాల ఉపయోగముంటుంది. 
  • *చేతులు, పాదాలు మృధువుగా వుండడానికి నిమ్మ రసం వాడతారు. 
  • *శిరోజ సంరక్షణకు కూడ నిమ్మ ఎంతో మేలు చేస్తుంది. ఇలా నిమ్మ ఉపయోగాలు అనంతం.
నిమ్మ రకాలు :

మనకు తెలిసిన నిమ్మ పరిమాణంలొ తేడాలు తప్ప అన్ని ఒకే మాదిరిగా కనిపిస్తాయి. కాని నిమ్మ లో చాల రకాలున్నాయి. ప్రపంచంలో నిమ్మ ఉత్పత్తిలొ మనదె అగ్ర స్థానం. పింగ్ర్, కాఫిర్, కీ మస్క్ వైల్డ్ స్వీట్ లైమ్, ఇలా చాల రకాలున్నాయి. సామాన్యంగా నిమ్మ చెట్టు చిన్న గుబురు మొక్క. కొన్ని నిమ్మ తీగలు కూడా వుంటాయి. దాన్నే తీగ నిమ్మ అంటారు. పెద్ద పరిమాణంలో వుండే నిమ్మకాయలను గజ నిమ్మ అంటారు. మనకు సాధారణంగ తెలిసిన రంగులు పశుపు వచ్చ లేదా ఆకు పచ్చ. కాని వీటిలో ఎర్రని, తెల్లని, గులాబి రంగువి కూడ వుంటాయి. దొండ కాయల్లాగ పొడవుగా ఉండే నిమ్మకాయలు కూడ వున్నాయి.

కాలేయ క్యాన్సర్‌పై 'నిమ్మ' పోరాటం!

నారింజ, నిమ్మలోని విత్తనాలు చాలా చేదుగా ఉంటాయి గానీ వీటికి కాలేయ క్యాన్సర్‌ను తగ్గించే శక్తి ఉందని పరిశోధకులు గుర్తించారు. వీటిల్లోని లిమోలిన్‌ అనే పదార్థం ఇందుకు తోడ్పడుతున్నట్టు తమిళనాడులోని విశ్వవిద్యాలయాల పరిశోధకుల బృందం కనుగొంది. దీన్ని కాలేయ క్యాన్సర్‌ బారినపడేలా సృష్టించిన ఎలుకలకు ఇచ్చినపుడు అవి జబ్బు నుంచి కోలుకున్నట్టు తేలింది. నిజానికి లిమోలిన్‌ నేరుగా కణితులపై పనిచేయటం లేదు. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి క్యాన్సర్‌పై పోరాడేలా తీర్చి దిద్దుతోంది. ఇది యాంటీఆక్సిడెంట్ల మోతాదునూ పెంచి, విశృంఖల కణాలను తగ్గిస్తున్నట్టూ బయట పడింది.

Source : "http://wikipedia.org/ 

  • =============================
Dr.Seshagirirao -MBBS