Showing posts with label ఆస్త్మాకు ఐదు ఆహారాలు. Show all posts
Showing posts with label ఆస్త్మాకు ఐదు ఆహారాలు. Show all posts

Sunday, August 4, 2013

Five foods for Asthma , ఆస్త్మాకు ఐదు ఆహారాలు

  •  

  •  
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

ఆస్త్మా గల వారు వింటర్ సీజన్‌ లో ఎక్కువ ఇబ్బంది పశుతుంటారు . అటువంటివారు ఆహారము విషయములో తగినంత శ్రద్ద తీసుకుటే సమస్య తీవ్రతను కొంత తగ్గించుకోవచ్చును . అటు వంటి ఐదు పదర్ధాలపై అవగాహన . ఆయుర్వేద మరియు ప్రకృతి చికిత్సా నిపుణులు చెప్పిన ప్రకారము ఈ క్రింది కొన్ని పదార్ధములు ఉపయోగము ...->


1.పాలకూర : మెగ్నీషయం కు పాలకూర మంచి అధారము . ఆస్త్మా లక్షణాలను తగ్గించడము లో బాగా సహకరిస్తుంది. ఆస్తమా గలవారికి రక్తము లోనూ , టిష్యూలలోను మెగ్నీషియము స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీర్ఘకాలము మెగ్నీషియం స్థాయిలు పెంచుకోవడము వలన ఆస్త్మా ఎటాక్స్ తగ్గుతాయి.

2.రెడ్ క్యాప్సికం : దీనిలో " సి " విటమిన్‌ ఎక్కువ . ఇన్‌ప్లమేషన్‌ తగ్గించడములో బాగా దోహదపడుతుంది. అయితే మిగతా విటమిటన్‌ సి ఉన్న ఆహారపదార్ధాలు అస్త్మాకి మంచి చేయవు . రెడ్ మిరిపకాయలోని ఎస్కార్బిక్ యాసిడ్ " ఫాస్ఫోడిల్ స్టెరేజ్ " అనే ఎంజైమ్‌ ఉతపత్తిని అడ్డుకుంటుంది. చాలా ఆస్త్మా మందులలో ఇదే జరుగుతుంది .

3.ఉల్లి : వీటిలో కూడా యాంటీ - ఇన్‌ప్లమేటరీ , యాంటీ అస్త్మాటిక్ ప్రభావాలున్నాయి. ఉల్లి తినడము వల్ల ' హిస్తమిన్‌ ' విడుదలను అడ్డుకుంటుంది. దీనివల బ్రోంకియల్ అబ్ స్ట్ర్క్షక్షన్‌ తగ్గుతుంది.

4.ఆరెంజ్ : కమలా , నారింజ , నిమ్మలలో ఉండే విటమిన్‌ ' సి ' ఉబ్బస లక్షణాలు తగ్గిస్తుందని అనేక పరిశోదనలు ఉన్నాయి. ముఖ్యము గా చిన్నపిల్లలో ఈ లక్షణాలు బాగా తగ్గినట్లు ఆదారాలు ఉన్నాయి.

5.యాపిల్ : వీటిలో ఉండే ' ఫైటోకెమికల్స్ ' అస్త్మాతో ఇబ్బంది పడే వారి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. యాపిల్ పై తొక్క ముదుర రంగులో ' లైకోఫిన్‌' ఎక్కువగా ఉన్నందున యాంటి-ఆక్షిడెంట్ గా  ఆస్త్మారోగులము మేలుచేస్తుంది.

  • =======================
Visit my Website - Dr.Seshagirirao...