రుద్రాక్ష అనేది రెందు పదాల కలయిక .రుద్ర అంటే శివుడు . అక్ష అంటే కళ్ళు . ఈ రుద్రాక్షను పరమశ్వుడికి సంబంధించన పవిత్రమైన గింజలుగా పరిగణిస్తారు . అనుకూలత , మంచి ఆరొగ్యాలతో అనుసంధానమైన రుద్రక్షలవల్ల అనేక ప్రయోజనాలు సమకూరుతాయని శాస్త్రీయము గా నిరూపైంచబడింది.
రుద్రుని(శివుడు) అక్షుల నుండి జాలువారిన నీటి బిందువులు భువికి జారి మొక్కలుగా మొలచి వృక్షాలుగా మారినవని అంటారు. అలాంటి వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. ఇవి పురాణ కాలం నుండి ఉపయోగించబడుతున్నవి. ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు అందరూ వీటిని ధరించువారేనని పురాణాల ద్వారా తెలియుచున్నది. ఇప్పటికీ బ్రాహ్మణులు, పూజారులు, వేదాంతులు, గురువులు లాంటివారు వీటిని ధరిస్తారు. ధరించుట వీలుకాని వారు పూజా గృహముల యందు ఉంచి పూజించుట కద్దు.
- రుద్రాక్షలు-రకాలు
ప్రశస్తమయినదిగా చెపుతారు. దీనిని ధరించిన వారికి సర్వవిధాలా విజయం చేకూరునని నమ్ముతారు. అలాంటి రుద్రాక్షల వివరాలు.
- ఏకముఖి. (ఒక ముఖము కలిగినది)--అత్యంత శ్రేష్టమయినది. శివుని త్రినేత్రంగా, ఓం కార రూపంగా నమ్ముతారు.
- ద్విముఖి (రెండు ముఖములు కలిగినది)--దీనిని శివపార్వతి రూపంగా నమ్ముతారు.
- త్రిముఖి (మూడు ముఖములు కలిగినది)--దీనిని త్రిమూర్తి స్వరూపంగా నమ్ముతారు.
- చతుర్ముఖి (నాలుగు ముఖాలు కలిగినవది)--నాలుగు వేదాల స్వరూపం
- పంచముఖి (అయిదు ముఖాలు కలిగినది)--పంచభూత స్వరూపం
- షట్ముఖి (ఆరు ముఖములు కలది)--కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా పోతాయి.
- సప్తముఖి (ఏడు ముఖాలు కలిగినది)--కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించదని ప్రజల విశ్వాసం
- అష్టముఖి (ఎనిమిది ముఖాలు కలిగినది)--విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది.
- నవముఖి (తొమ్మిది ముఖాలు కలది)--నవగ్రహ స్వరూపం. భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి.
- దశముఖి (పది ముఖాలు కలిగినది)--దశావతార స్వరూపం. జనార్ధనుడికి ప్రతీక. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు.
- పూజలలో రుద్రాక్షలు
- వైద్యంలో రుద్రాక్షలు
రుద్రాక్షను జీవితాన్ని పరిరక్షించే ఔషధం లేదాగింజగా భావిండము పరిపాటి .రుద్రాక్షలను ధరిందడము లేదా నీటిలోవేసి ఉంచడము ద్వారా వివిధ రూపాల్లో వాడి ప్రయోజనాలు పొందవచ్చును. నీళ్ళలో రుద్రక్షను వేసి ఆ నీరు తాగడము వల్ల శారీరక ఉష్ణోగ్రను సరిచేయవచ్చును. శరీరము నుండి విషతుల్యాల్ని వెలికి నెట్టవచ్చును. ఇది చర్మాన్ని కాంతివంతముగా ఉంచుతుంది. గుండె సంబంధిత రుగ్మతలను , రక్తపోటును , ఉదరసమస్యలు , తలనొప్పి , డయాబిటీస్ , రక్తహీనత , స్థూలకాయము , మబద్దకము మొదలైనవాటిని అరికట్టడములో రుద్రాక్షలు సహకరిస్తాయి.
- =========================