Showing posts with label Women employees-Nutritiona food Awareness. Show all posts
Showing posts with label Women employees-Nutritiona food Awareness. Show all posts

Tuesday, December 20, 2011

ఆఫీసులో ఉద్యోగినులు-పోషకాహారం అవగాహన , Women employees-Nutritiona food Awareness

  • image : courtesy with Eenadu newspaper.
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. ఆఫీసులో ఉద్యోగినులు-పోషకాహారం అవగాహన : ఆఫీసులో పని కాస్త ఎక్కువయితే కాఫీలు, టీలు. కొద్దిపాటి విరామం దొరికితే సమోసాలు, బజ్జీలు. క్షణం తీరిక లేకుండా ఉంటే భోజన విషయం పక్కనపెట్టి పనిలో మునిగిపోవడం. ఉద్యోగినుల్లో ఎక్కువమంది పాటించే ఆహారపు అలవాట్లివి. బరువును పెంచి, ఉత్సాహాన్ని తగ్గించే ఈ అలవాట్లకు బదులుగా ఆఫీసులో ఉద్యోగినులు తీసుకోవాల్సిన పోషకాహారం గురించి నిపుణులు ఇలా వివరిస్తున్నారు. ఆఫీసులో ఉన్నప్పుడు ఒకటికి నాలుగు సార్లు టీ, కాఫీలు సేవించడం.. శీతలపానీయాలు తాగడం అందుబాటులో ఉండే జంక్‌ఫుడ్‌ను లాగించేయడం చాలామందికి అలవాటు. ఇవి శరీరానికి నూతనోత్సాహాన్ని అందించడానికి బదులు శక్తిహీనంగా మార్చేస్తాయి. ఏకాగ్రతని దెబ్బతీస్తాయి. అందుకే ఈ అలవాట్లను నియంత్రించడం లేదా కాఫీ, టీలను ఆరోగ్యకర పానీయాలుగా మలుచుకోవడం చాలా అవసరం. స్పానీటితో... శక్తినిచ్చే టీలు స్పా వాటర్‌.. మినరల్‌ వాటర్‌ మాదిరిగానే ఈ మధ్యకాలంలో మార్కెట్‌లో ఈ నీళ్ల సీసాలు లభ్యమవుతున్నాయి. ఆరోగ్యకరమైన, ప్రత్యేకమైన ఖనిజ లవణాలని అందించే ఈ నీటిని జోడించి ఆఫీసులో సొంతంగా హెర్బల్‌ టీలు చేసుకోవచ్చు. పంచదార వాడకాన్ని తగ్గిస్తే కెలొరీలు తగ్గి అధిక బరువు సమస్య ఉండదు. * దంచిన పుదీనా ఆకులు, అల్లం, నిమ్మ, బత్తాయి రసాలు వీటిలో ఏవి దొరికితే వాటిని గ్లాసుడు చల్లని స్పా నీటిలో కలిపి, చెంచా పంచదార వేసి టీ చేసుకోవచ్చు. దీని నుంచి 15 కెలొరీలు మాత్రమే అందుతాయి. * స్పా నీటితో చేసిన బ్లాక్‌టీ, గ్రీన్‌టీ, డీకేఫ్‌ పానీయాలు(కెఫీన్‌ లేనివి) ఆరోగ్యదాయకం. * దాల్చినచెక్క, వెనిల్లా టీలు పంచదార వేయకపోయినా రుచిగానే ఉంటాయి. మామూలు టీ, కాఫీలకు బదులు ఈ టీలు తాగడం వల్ల ఫ్లవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా అంది శరీరం నూతనోత్సాహం సంతరించుకొంటుంది. పనిపై ఏకాగ్రత పెరుగుతుంది. కెలొరీలు లేని కాఫీలు టీ కంటే కాఫీ తయారీలో పాలు ఎక్కువ పడతాయి. అందుకనుగుణంగా రుచికోసం వాడే క్రీం, పంచదార వినియోగమూ ఎక్కువే. ఫలితంగా కాఫీ అందించే కెలొరీలు ఎక్కువే! ఒక పెద్ద కప్పు కాఫీ నుంచి అందే కెలొరీలు 300 నుంచి 400 వరకు ఉంటాయి. * ఒక చిన్న చెంచా పంచదారతో.. మీగడ లేని కాఫీ తాగడం వల్ల సమస్య ఉండదు. అప్పటికప్పుడు అందుబాటులో పండ్లరసాలు క్యాంటీన్‌కు వెళితే సోడా అధికంగా ఉండే శీతల పానీయాల వైపు మనసు మళ్లడం సాధారణమే! బదులుగా బజారులో దొరికే పండ్ల గుజ్జుని కొనిపెట్టుకొని అవసరం అయినప్పుడు చల్లని మినరల్‌ వాటర్‌ లేదా స్పా నీళ్లతో కలుపుకోవచ్చు. రెండు చెంచాల గుజ్జుకు గ్లాసుడు నీళ్లు కలపొచ్చు. * కప్పు శీతలపానీయాల నుంచి 150 కెలొరీలు అందితే.. ఈ రకం పండ్లరసం నుంచి 18 కెలొరీలు మాత్రమే అందుతాయి. తాజాగా ఫ్రూట్‌ కూలర్లు.. సూపర్‌మార్కెట్లలో తక్షణ శక్తినిచ్చే ఎనర్జీ డ్రింకులు దొరుకుతున్నాయి. కానీ వీటిల్లో ఉండే కెలొరీలు ఎక్కువే. బదులుగా కప్పు ఐసు, కప్పు మినరల్‌ వాటర్‌, కొద్దిగా స్టాబెర్రీలు వేసి మిక్సీలో ఒకసారి తిప్పాలి. గ్లాసులోకి తీసుకొని పుదీనాతో అలంకరించుకొని తాగేయండి. రుచితో పాటు శక్తి కూడా! ఆరోగ్యకరంగా.. డెస్క్‌టాప్‌ పానీయాలు కొన్ని రకాల విధి నిర్వహణల్లో భాగంగా రాత్రి షిఫ్టుల్లోనూ పనిచేయాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో టీ, కాఫీలు, కోలాలకు బదులుగా పంచదార కలపని ఈ పానీయాలని ప్రయత్నించవచ్చు. * కొవ్వు లేని పాలు * కొవ్వులేని పాలతో చేసిన హాట్‌ చాక్లెట్‌ పానీయం. * కొద్దిగా స్పావాటర్‌ వాడిన పండ్ల రసం. * నెక్టర్‌ వాడి చేసిన పండ్లరసం. నెక్టర్‌ అంటే సహజసిద్ధంగా పూలు, పండ్లను నుంచి సేకరించిన చక్కెర పదార్థం. ఆఫీసు బ్యాగులో పోషకాహారం * సాయంకాలం ఉపాహారం తినే సమయంలో చాలా మంది ప్రాధాన్యం ఇచ్చేది సమోసా, పిజా, బర్గర్‌, చిప్స్‌ వంటి వాటికే! బదులుగా ఉప్పు తక్కువగా ఉండే సూప్‌లు లేదా గుప్పెడు వాల్‌నట్లు, బాదం వంటివి తీసుకోవచ్చు. వీటి వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. * మనకోసం మనం చేసుకొనే పదార్థాల్లో వేటి మోతాదు ఎంత మేరకు ఉంటే.. ఆరోగ్యదాయకమో మనకు బాగా తెలుస్తుంది. ఉద్యోగ పనుల్లో ఆరోగ్యం గురించి ఆలోచించడానికి క్షణం తీరిక లేదు అనుకొనేవారు ఒక రోజు ముందుగానే పండ్లని ముక్కలుగా తరిగి జిప్‌లాక్‌ బ్యాగులో వేసుకోవాలి. ఆఫీసుకెళ్లేటప్పుడు బాక్సులో తీసుకెళ్లిపోవచ్చు. * ఆకలి వేసినప్పుడు ఏదో ఒకటి తినేద్దాంలే అనుకోకుండా ఉండాలంటే .. బేబీ క్యారట్‌, తృణధాన్యాలతో చేసిన బార్లు, మొలకలు వంటి వాటిని బ్యాగులో వేసుకొని వెళితే మేలు. కొంతవరకైనా జంక్‌ ఫుడ్‌కి దూరంగా ఉండగలుగుతారు. * వంట చేయడాన్ని ఆస్వాదించేవారు తక్కువ సమయంలో అయిపోయే కార్న్‌చాట్‌, చపాతీ రోల్స్‌ వంటి వాటిని ఎంచుకోవచ్చు. వెంట తీసుకెళ్లవచ్చు. బజ్జీలు, సమోసాలకు బదులు పాప్‌కార్న్‌, బేల్‌పూరీలు మంచి ప్రత్యామ్నాయాలు. * నలుగురితో కలిసి తినే బిస్కెట్లను తక్కువ అంచనావేయొద్దు. రెండు మూడు బిస్కెట్లలో కూడా బోలెడు కెలొరీలు, కొవ్వు, పంచదార ఉంటాయి. * ఆఫీసులో పార్టీ అనగానే క్యాంటీన్‌లో కనిపించే చాక్లెట్లని తినేస్తుంటారు చాలామంది. సాధారణ చాక్లెట్‌కన్నా హాట్‌ చాక్లెట్‌ డ్రింక్‌ మంచి ప్రత్యామ్నాయం. ఎందుకంటే దీనిలో మూడు గ్రాముల కొవ్వు, 140 కెలొరీలు శక్తి మాత్రమే ఉంటే, చాక్లెట్‌ని నేరుగా తినడం వల్ల 230 కెలొరీల శక్తి, 13 గ్రాముల కొవ్వు చేరుతుంది. ఎండుఫలాలు.. వేయించిన సెనగలు ఇంటి నుంచి వస్తూ వస్తూ తాజా పోషకాహారాన్ని తెచ్చుకోవడానికి వీలుపడట్లేదు అనుకొనేవారు.. ఆఫీసులో భద్రపరుచుకొనే ఆహారాలివి. ఒక డబ్బా నిండా ఎండు ఫలాలు, పీచు అధికంగా ఉండే పోషకాహార బిస్కెట్లు, ఇన్‌స్టంట్‌ భేల్‌పురీ, వేయించిన సెనగలు, బఠాణీలు, మరమరాలు ఉంచుకోవచ్చు. పనివేళల్లో ఆహారం.. అప్రమత్తం * 'పని ఎక్కువగా ఉంది' అని వేగంగా తినడం మంచి పద్ధతి కాదు. ఇలా అయితే అనుకొన్న దాని కంటే ఎక్కువగా తినేస్తారు. అలాగే చేయబోయే పని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఆహారంపై దృష్టిపెట్టకపోయినా పెద్దగా ఫలితం ఉండదు. ఎంత పనిలో ఉన్నా సరే భోజనం తినేటప్పుడు కొంత విరామాన్ని తప్పక తీసుకోవాలి.
  • ====================================
Visit my Website - Dr.Seshagirirao...