- =====================================
Tuesday, August 11, 2009
పిస్తా పప్పు , pista
పండ్లు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం .
బాదం పిస్తా లో పోశాకపదర్దము ఎక్కువ .
పొటాసియం అత్యధికం గా లబిస్తుంది-శరీరము లో ద్రవాల నియంత్రణకు పొటాషియం పనికొస్తుంది . దీనిలో ఉండే బి ౬ ప్రోటీన్ల తయారీ , శోషణము లో ఉపయోగపాడుతుంది .మిగిలిన ఎందు పండ్ల తో పోలిస్తే పిస్తా లో కేలరీలు ఎక్కువ . anti-oxidants ఉన్నందున ఇవి గుండె జబ్బులను తగ్గించే గుణం కలిగి ఉన్నాయి .
కాన్సర్ రాకుండా కాపాడతాయని తేలినది .
పిస్తా లో మోనో శాచ్యురేతేడ్ క్రొవ్వులు అధికం గా ఉన్నందున ఎక్కువగా తినకూడదు ... వారం లో 15 - 20 గ్రాములు మించి తీసుకోకూడదు .
రక్తం లో కొలెస్టిరాల్ ను తగ్గిస్తాయి , అతి తక్కువ తిన్నా కడుపు నిండినట్లు గా ఉంటుంది . అందువల్ల ఆహారము తక్కువగా తీసుకోవడం జరుగుతుంది . పొట్టను పెరగ నీయదు .
ఏం తింటే మన శరీరానికి తక్కువ కేలరీలతో తక్షణశక్తి సమకూరుతుందో దాని పేరే 'పిస్తా'! ఒక ఔన్సు పిస్తా తింటే మన శరీరానికి160 కేలరీల శక్తి సమకూరుతుంది. 30గ్రాముల పిస్తాకు 87 కేలరీల శక్తి మాత్రమే వస్తుంది.
* ఇందులో మిగతా నట్స్‌కన్నా ఎక్కువ ప్రోటీన్‌శాతం ఉంది.
* ఇందుళొ ఫైబర్ ఎక్కువే. మనం తింటే కాదనదు.
* పిస్తాలో విటమిన్ బి6 సమృద్ధిగా ఉందని 'శాస్త్రం' ఘోషిస్తోంది. దాంతోపాటూ చర్మానికి మేలు చేస్తానంటూ విటమిన్ ఇ సైతం ఉంది.
* అసలే కొత్త కొత్తరకాల వ్యాధులు కనపడకుండా వ్యాపిస్తున్న ఈరోజుల్లో ఇవితింటే రోగనిరోధకశక్తి పెరుగుతుందట!
* పిస్తాలో పొటాషియం(శరీర సమతుల్యతను కాపాడేది), ఫాస్ఫరస్(ఎముకలకు, పళ్లకు బలాన్నిచ్చేది), - మెగ్నీషియం(శరీరశక్తిని సమకూర్చేది) దండిగా కలవు
* జీర్ణశక్తిని మెరుగుపరిచే థియామిన్ పిస్తాలోనే కొలువుతీరిందిట!
* ఇవి ఎక్కువగా తిన్నా కొలెస్ట్రాల్ పెరగదట. మామూలుగా నట్స్ తినాలంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందనే కదా దూరంగా ఉంటాం?! మరి ఆ దోషం ఇందులో లేనేలేదట!
* కంటికి అత్యంత అవసరమైన 'ల్యూటిన్' మరియు 'జియాజాంథిన్' ఇందులో ఉందని పరిశోధకులు మొత్తుకుంటున్నారు.
* హానికారక కొవ్వు అంటూ ఆమడదూరానికి పరుగెత్తుతామే, అది ఇందులో దాదాపు శూన్యమట!
* మరి ఆరోగ్యపరమైన కొవ్వు సంగతో! సందేహంలేకుండా సరిపడా కలదు.
అందుకే సాయం సమయాలు పకోడీ, చిప్స్‌ల వెంటపడకుండా కాసిని పిస్తా పప్పులు నోటిలో వేసుకుంటే ఇన్ని లాభాలు పొందొచ్చు!
ఎవరైతే పిస్తా తింటారో వారికి నిండైన ఆరోగ్యం, పొందికైన సౌందర్యం చిక్కుతుంది .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment