పోషకాలు
వంద గ్రా. మామిడిలో...
శక్తి: 70 క్యాలరీలు
పిండిపదార్థాలు: 17గ్రా.,
బీటా కెరోటిన్: 445 మై.గ్రా.,
విటమిన్-ఎ: 765 మై.గ్రా,
విటమిన్‌ఇ : 1.12 మై.గ్రా.,
విటమిన్ కె: 4.2 మై.గ్రా.,
పొటాషియం: 156 మి.గ్రా.,
ప్రొటీన్లు: 0.5గ్రా.,
సి-విటమిన్: 27.7 మి.గ్రా.,
పీచు: 1.8గ్రా.
దీని శాస్త్రీయ నామము " Mangifera Anacardiaceae " . పండుగా మారకముందు పులుపు గా ఉంటుంది . కుర గా , పచ్చడి గా వాడుదురు . మామిడిలో-----------
- విటమిన A,C,E , phytochemikals ,polyphenols ,17 amino acids, లు పుస్కలము గా ఉంటాయి .
- రక్తపోటు బాధితులకు అవసరమయిన 'పొటాసియం ' ఎక్కువ గా ఉంటుంది .
- పీచు పదార్ధము అధికం గా ఉన్నందున విరోచనం సాఫీగా అవుతుంది .ఎక్కువగా తింటే ఉడుకు విరోచనాలుపట్టుకుంటాయి .
- మామిడి పండు రసం వీర్య వృద్ధి ని కలిగిస్తుంది ,
- పాల తో కలిపి తీసుకుంటే బలాన్నిస్తుంది .
- రక్తం లో కొలెస్టరాల్ ని తగ్గిస్తుంది ,
- చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది ,
* మామిడి పండ్లు తిన్న తర్వాత కొంతమందికి ‘సెగ గడ్డలు’ వస్తుంటాయి. శరీరంలో దాగివున్న ‘వేడి’ని బయటకు తెచ్చే గుణం మామిడికి ఉండటాన ఇలా జరుగుతుంది. వేడి శరీర తత్వం ఉన్నవారు మామిడి పండ్లను పరిమితంగా తినడం మంచిది. సోరియాసిస్ గాని, ఇతర చర్మవ్యాధులు గాని ఉన్నవారు, ప్రేవుల్లో అల్సర్లు ఉన్నవారూ మామిడిని తినడం మంచిది కాదు. అలాగే మధుమేహ వ్యాధి నియంత్రణలో లేనివారు కూడా.
* నేరేడు పండ్లు మామిడి పండ్లకు విరుగుడుగా పనిచేస్తాయి. ఒకవేళ మామిడి పండ్లను ఎక్కువగా తిన్నట్లయితే దానికి విరుగుడుగా నాలుగైదు నేరేడు పండ్లను గాని, చిటికెడు వాము పొడిని గాని, జీలకర్రను గాని డికాక్షన్ కాచి తీసుకుంటే సరిపోతుంది.
* మామిడి సీజనల్‌గా మాత్రమే దొరుకుతుంది. అయితే, సంవత్సరం పొడవునా మామిడిని వాడుకోవాలనుకునేవారు ‘ఆమ్‌చూర్’ రూపంలో వాడుకోవచ్చు. మామిడి దొరికే సీజన్‌లో తాజా కాయలను సేకరించి నిలువునా కోసి ఎండబెట్టాలి. ఈ ముక్కలను తాజా మామిడికి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు.
* పచ్చి మామిడిలో విటమిన్-సి, విటమిన్-బి1, బి2లు సమృద్ధిగా ఉంటాయి.
* మామిడిలో విటమిన్-సి అధికంగా ఉండటంవల్ల పచ్చి మామిడిని రక్తస్రావాలలో రక్తాన్ని నిలువరించడానికి వాడవచ్చు. కొంతమందికి ఆహారం మామూలుగా తీసుకుంటున్నా, ఆహారం ద్వారా ఐరన్ శరీరంలోనికి తగినంతగా విలీనం కాదు. అటువంటివారు పచ్చి మామిడిని వాడటంవల్ల ఫలితం ఉంటుంది. విటమిన్-సి ఇనుము శరీరంలోనికి విలీనమవ్వడానికి సహాయపడుతుంది.
* మామిడిని పచ్చిగా, దోరగా, పండుగా ఎలాగైనా వాడుకోవచ్చు. పచ్చిది తెచ్చి వరిగడ్డిలో మాగేస్తే మాగుతుంది. ఒకవేళ ఫ్రిజ్‌లో ఉంచుకోదలిస్తే ముందుగా మామిడిని కడిగి నిట్టనిలువుగా రెండుగా కోయాలి. ఒకో భాగాన్ని బోర్లించి తొక్క తొలగించి ముక్కలుగా కోయాలి. లేదా, ముందుగానే తొక్కను తొలగించి ఆ తరువాత ముక్కలుగా తరగవచ్చు. ఒకవేళ పండినది వాడాల్సివస్తే ముందుగా బల్లపరపుగా ఉన్న రాయిమీద రసం మెత్తబడేలా అదిమి, రసం పిండాలి.
ఔషధోపయోగాలు
పాదాల పగుళ్ళు: మామిడి జిగురుకు మూడురెట్లు నీళ్ళు కలిపి పేస్టులాగా చేసి ప్రతిరోజూ పాదాలకు లేపనం చేసుకోవాలి. దీనితోపాటు ప్రతిరోజూ బూట్లు, సాక్సులు ధరించటం ముఖ్యం. పంటినొప్పి, చిగుళ్ళ వాపు: రెండు కప్పులు నీళ్ళు తీసుకొని మరిగించాలి. దీనికి రెండు పెద్ద చెంచాలు మామిడి పూతను వేసి మరికొంతసేపు మరగనివ్వాలి. స్టవ్‌మీద నుంచీ దింపి గోరువెచ్చగా ఉన్నప్పుడు పుక్కిట పట్టాలి. అవసరమనుకుంటే ఇలా రోజుకు రెండుమూడుసార్లు చేయవచ్చు.
కడుపులో పురుగులు: మామిడి టెంకలోని జీడిని వేరుపరచి ఆరబెట్టాలి. దీనికి పెద్ద చెంచాడు మెంతులను కలిపి మెత్తగా నూరాలి. దీనిని ఒక సీసాలో భద్రపరచుకొని కొన్నిరోజులపాటు మజ్జిగతో కలిపి తీసుకోవాలి.
ఆర్శమొలలు (రక్తయుక్తం): అర చెంచాడు మామిడి జీడిని పొడి రూపంలో పెరుగుమీది తేటతో కలిపి తీసుకోవాలి.
జ్వరం: మామిడి వేర్లను మెత్తగా రుబ్బి అరికాళ్ళకు, అరి చేతులకు రాసుకుంటే జ్వరంలో కనిపించే వేడి తగ్గుతుంది.
బట్టతల: ఒక జాడీలో కొబ్బరి నూనెను గాని, నువ్వుల నూనెను తీసుకొని మామిడి కాయలను ఊరేయండి. ఇలా సంవత్సరంపాటు మాగేసి తల నూనెగా వాడుకోవాలి.
చెవి నొప్పి: స్వచ్ఛమైన మామిడి ఆకులనుంచి రసం తీసి కొద్దిగా వేడిచేసి, నొప్పిగా ఉన్న చెవిలో డ్రాప్స్‌గా వేసుకోవాలి. ముక్కునుంచి రక్తస్రావం: మామిడి జీడినుంచి రసం తీసి రెండు ముక్కు రంధ్రాల్లోనూ డ్రాప్స్‌గా వేసుకోవాలి.
కంటినొప్పి: పచ్చి మామిడి కాయను కచ్చాపచ్చాగా దంచి నిప్పులపైన సుఖోష్టంగా ఉండేలా వేడిచేసి మూసి వుంచిన కన్నుపైన ‘పట్టు’ వేసుకోవాలి.
దంత సంబంధ సమస్యలు: మామిడి ఆకులను ఎండించి బూడిద అయ్యేంతవరకూ మండించండి. దీనికి ఉప్పుకలిపి టూత్ పౌడర్‌లా వాడుకోవాలి. ఈ పొడికి ఆవ నూనెను కలిపి వాడుకుంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి.
కాలిన గాయాలు: మామిడి ఆకుల బూడిదను ‘డస్టింగ్ పౌడర్’లా వాడితే గాయాలు త్వరగా నయమవుతాయి.
ఎగ్జిమా: మామిడి చెట్టు బెరడును, నల్ల తుమ్మ బెరడును తెచ్చి కచ్చాపచ్చాగా దంచి ఉంచుకోండి. రోజూ పిడికెడంత మిశ్రమాన్ని తీసుకొని అర లీటరు నీళ్ళలో వేసి ఆవిరి వచ్చేవరకూ మరిగించి, ఆవిరిని ఎగ్జిమా సోకిన ప్రదేశానికి తగిలేలా చేయాలి. తడి ఆరిన తర్వాత నెయ్యి రాసుకొని మర్ధనా చేసుకోవాలి.
పుండ్లు: మామిడి బెరడును చిన్న చిన్న పీలికలు అయ్యేంతవరకూ దంచి, నీళ్ళలో వేసి మరిగించండి. ఈ డికాక్షన్‌తో పుండ్లను, వ్రణాలను కడిగితే త్వరగా మానతాయి.
నీరసం: మామిడి ముక్కలకు చెంచాడు తేనెను, పిసరంత కుంకుమ పువ్వును, ఏలకులు, రోజ్‌వాటర్లను చిలకరించి ఆస్వాదించండి.
వడదెబ్బ: పచ్చి మామిడికాయను నిప్పుల మీద వేడిచేసి పిండితే సులభంగా గుజ్జు వస్తుంది. దీనికి కొద్దిగా చన్నీళ్ళను, పంచదారను చేర్చి తాగాలి. దీనివల్ల దప్పిక తీరడమే కాకుండా ఎండల తీక్షణతవల్ల కోల్పోయిన శక్తి తిరిగి వస్తుంది.
చెమట కాయలు: రెండు పచ్చి మామిడి కాయలను గినె్నలో నీళ్ళుపోసి ఉడికించాలి. చల్లారిన తర్వాత గుజ్జును పిండి పంచదార, ఉప్పు కలిపి సేవించండి. దీనివల్ల శరీరంలో వేడి తగ్గి, ఒళ్లు పేలకుండా ఉంటుంది.
మధుమేహం: లేత మామిడి ఆకులను, వేప చిగుళ్ళను సమానభాగాలు తీసుకొని మెత్తగా నూరి ముద్దగా చేయాలి. దీనిని నమిలి మింగేయాలి. ఇలా కొంతకాలం చేస్తే మధుమేహంలో హితకరంగా ఉంటుంది. ఇదే విధమైన యోగం మరోటి వుంది. మామిడి పూతను, మామిడి పిందెలను, ఎండిన నేరేడు గింజలను తీసుకొని మెత్తగా చూర్ణం చేసి భద్రపరచుకోవాలి. దీనిని ప్రతిరోజు చిన్న చెంచాడు మోతాదుగా తీసుకోవాలి. ఇది మధుమేహ రోగులకు ఉపయోగకారి.
స్టీృన్ (ప్లీహం) పెరుగుదల, కాలేయపు సమస్యలు: గుప్పెడు మామిడి గుజ్జుకు చిన్న చెంచాడు తేనెను కలుపుకొని మూడుపూటలా తాగండి. కాలేయపు సమస్యల్లో మామిడి గుజ్జును పాలతో కలిపి తీసుకోవాలి.
విరేచనాలు: మామిడి టెంకను పగులకొట్టి దీనిలోని జీడిని వేరుపరిచి నీడలో ఆరబెట్టాలి. తర్వాత దీని బరువుకు సమానంగా సోపు (శతపుష్ప) గింజలను తీసుకోవాలి. ఈ రెండింటిని విడివిడిగా చూర్ణం చేసుకోవాలి. తర్వాత రెండు చూర్ణాలను బాగా కలిపి పలుచని గుడ్డతో జల్లించాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చెంచాడు చొప్పున వేడి నీళ్ళతో తీసుకోవాలి. దీనితోపాటు మామిడి బెరడు లోపలి పొరను పేస్టులాగా చేసి బొడ్డు చుట్టూ రాస్తే ఇంకా మంచిది. మామిడి జీడే కాకుండా మామిడి పూత కూడా విరేచనాలను ఆపడానికి ఉపయోగపడుతుంది. ఎండిన మామిడి పూతను తేనెతో కలిపి తీసుకుంటే సరిపోతుంది. ఇంతే కాకుండా మామిడి పూతను, దానిమ్మ పువ్వులను కలిపి ఎండించి, పొడిచేసి మజ్జిగతో కలిపి కూడా తీసుకోవచ్చు.
“పచ్చి మామిడి” వేసవితాపం భరించలేక వడదెబ్బకు గురయ్యేవారు పచ్చి మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక గ్లాసు నీటిలో వేసి.. దాంట్లోనే కాస్త చక్కెర వేసి బాగా కలపాలి. కాసేపటి తరువాత ఈ ద్రవాన్ని తాగినట్లయితే వడదెబ్బ బారినుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే పచ్చి మామిడి ముక్కలపై కాస్త ఉప్పు వేసి తినటంవల్ల అధిక దాహాన్ని అరికట్టడమేగాకుండా.. చెమట ద్వారా శరీరంలోని లవణాలు, రక్తంలోని ఐరన్ తదితరాలు బయటకు పోకుండా ఆపుతుంది.
వేసవిలో సంభవించే డయేరియా, రక్త విరేచనాలు, పైల్స్, వికారం, అజీర్తి, మలబద్ధకం లాంటి సమస్యలకు టెంక పూర్తిగా ఏర్పడని పచ్చి మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటికి ఉప్పు, తేనెను కలిపి తింటే అద్భుతమైన ఔషధంలాగా పనిచేస్తుంది. ఇంకా.. పచ్చి మామిడికి మిరియాలు, తేనె కలిపి తిన్నట్లయితే.. జాండీస్ (పచ్చ కామెర్లు) వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. అంతేగాకుండా మామిడి గుండెకు మంచి టానిక్‌లాగా పనిచేస్తుంది. పచ్చి మామిడికాయలో విటమిన్ సీ పుష్కళంగా లభిస్తుంది. గుండె కండరాలను బిగుతుగా చేసే శక్తి మామిడికి ఉంది. అలాగే చర్మాన్ని మిలమిలా మెరిసేలా చేసే శక్తి కూడా దీనికి అధికంగా ఉంది. అయితే అతి అనేది అన్ని వేళలా సరికాదు కాబట్టి.. ఎక్కువ మోతాదులో పచ్చిమామిడిని తినకూడదు. అలా తిన్నట్లయితే ఆర్ధరైటిస్, కీళ్లవాతం, సైనసైటిస్, గొంతునొప్పి, అసిడిటీ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మామిడిని పరిమితంగా తినటం మంచి పద్ధతి.
Glucose control with mango-మామిడితో గ్లూకోజు అదుపు!
చూడగానే నోరూరించే మామిడిపండ్ల మాధుర్యమే వేరు. ఇవి వూబకాయుల్లో చక్కెర స్థాయులు మెరుగుపడటానికి దోహదం చేస్తున్నట్టు తాజా అధ్యయనం పేర్కొంటోంది. రొమ్ముకణాల్లో వాపును అదుపుచేయటానికీ తోడ్పడుతున్నట్టూ బయటపడింది.
రోజూ మామిడిని తినటం వల్ల వూబకాయులపై పడే ప్రభావాలపై ఓక్లహామా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల అధ్యయనం చేశారు. ఒకొకరికి 10 గ్రాముల మామిడి తాండ్రను (ఇది 100 గ్రాముల తాజా మామిడిపండ్లతో సమానం) తినిపించారు. పన్నెండు వారాల తర్వాత పరిశీలించగా.. వీరి రక్తంలోని గ్లూకోజు మోతాదులు గణనీయంగా తగ్గినట్టు తేలింది. ''అధిక కొవ్వుతో కూడిన ఆహారాన్ని తిన్న ఎలుకల్లో మామిడిపండ్లు గ్లూకోజు మోతాదులను మెరుగుపరుస్తున్నట్టు గత పరిశోధనలో తేలిన అంశాన్ని తాజా అధ్యయన ఫలితాలు బలపరుస్తున్నాయి'' అని అధ్యయన నేత డాక్టర్ లూకాస్ చెబుతున్నారు. అయితే మామిడిలోని ఏయే పాలీఫెనోలిక్ రసాయనాలు ఇందుకు దోహదం చేస్తున్నాయో తెలుసుకోవటానికి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందంటున్నారు.
మరోవైపు- మామిడిలోని పాలీఫెనాల్స్ రొమ్ముల్లోని క్యాన్సర్, క్యాన్సర్ రహిత కణాల్లో వాపు ప్రతిస్పందనను అదుపుచేస్తున్నట్టు ఇంకో అధ్యయనంలో బయట పడింది. --courtesy with Eenadu sukhibhava 4th june 2013.
- =======================
No comments:
Post a Comment