Tuesday, August 11, 2009

క్యాలీ ప్లవర్ ,Cauliflower

పండ్లు , కాయగూరలు ,గింజలు పప్పులు , కందమూలాలు , మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం .
  •  


  •  
 cauliflower-కాలిఫ్లవర్

కాలిఫ్లవర్ అంటే చాలామందికి ఇష్టముండదు వండేటప్పుడు దాని వాసన అంతగా బాగుండదు. కాని కాస్త మసాలాలు దట్టించి , నిదానంగా వండితే

అద్భుతమైన రుచిగా కాలిఫ్లవర్ కూరలు, వేపుళ్లు చేసుకోవచ్చు.


కాలిఫ్లవర్ లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్:
  • పిండిపదార్థాలు 5 g
  • - చక్కెరలు 2.4 g
  • - పీచుపదార్థాలు 2.5 g
  • కొవ్వు పదార్థాలు 0 g
  • మాంసకృత్తులు 2 g
  • థయామిన్ (విట. బి1) 0.057 mg 4%
  • రైబోఫ్లేవిన్ (విట. బి2) 0.063 mg 4%
  • నియాసిన్ (విట. బి3) 0.53 mg 4%
  • పాంటోథీనిక్ ఆమ్లం (B5) 0.65 mg 13%
  • విటమిన్ బి6 0.22 mg 17%
  • ఫోలేట్ (Vit. B9) 57 μg 14%
  • విటమిన్ సి 46 mg 77%
  • కాల్షియమ్ 22 mg 2%
  • ఇనుము 0.44 mg 4%
  • మెగ్నీషియమ్ 15 mg 4%
  • భాస్వరం 44 mg 6%
  • పొటాషియం 300 mg 6%
  • జింకు 0.28 mg 3%


for  health :
 తాజా పువ్వు రసాన్ని ప్రతిరోజూ ఒక కప్పు చొప్పున రెండుమూడు మాసాలపాటు సేవిస్తుంటే పొట్టలో కురుపులు, దంతాల చిగుళ్లనుండి రక్తస్రావం లాంటివి తగ్గిపోతాయి.

కాలిఫ్లవర్‌ ఆకుల రసం రోజూ ఒక కప్పు స్వీకరిస్తుంటే రేచీకటి, చర్మం పొడిపొడిగా ఉండటం, జుట్టు త్వరగా తెల్లబడటం, జలుబు నివారించబడతాయి.

గర్భిణి స్త్రీలు ప్రతిరోజూ కాలిఫ్లవర్‌ పువ్వు ఆకుల రసం సేవిస్తుంటే పిండం ఆరోగ్యంగా ఉండి, వెంటవెంటనే గర్భధారణ కాకుండా ఉంటుంది.

కాలిఫ్లవర్ క్యాన్సర్‌నని దూరంగా ఉంచును . కాలిఫ్లవర్‌లో ఉండే రసాయనాలు క్యాన్సర్‌ బారినుండి దూరంగా ఉంచడమే కాకుండా మన కాలేయం పనితీరును కూడా క్రమబద్ధం చేస్తుంది .

కాలిఫ్లవర్‌ని తీసుకోవడం వల్ల లంగ్‌, బ్రెస్ట్‌, ఒవేరియన్‌, ఇంకా బ్లాడర్‌ క్యాన్సర్‌ వంటి పలు క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

కాలిఫ్లవర్‌లో ఉండే గ్లూకోసినోలేట్స్‌, ధయోసయనేట్స్‌ లివర్‌ పనితీరును మెరుగుపరచడమే కాకుండా క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి .

ఇందులో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రుమటాయిడ్‌ ఆర్ధరైటిస్‌ నుండి రక్షణనిస్తుందని పరిశోధనలు తేల్చాయి.

స్త్రీలకు అతి ముఖ్యమైన విటమిన్ B కాలిఫ్లవర్ ద్వారా పుష్కలంగా లభిస్తుంది. గర్బిణీ స్త్రీలయితే ఖచ్చితంగా కాలిఫ్లవర్ తీస్కోగలిగితే వాళ్లకు డెలివరీ టైమ్ లో కావలసిన శక్తి లభిస్తుంది.

కాలిఫ్లవర్ లో విటమిన్ C - కాల్షియమ్ కూడా లభిస్తాయి.

ఇందులో ఫ్యాట్ కంటెంట్ 0. కాలిఫ్లవర్ ను ప్రతి రోజూ స్త్రీలు కనీసం 400 మైక్రోగ్రామ్స్ అయినా తీస్కోవాలని Experts సూచిస్తున్నారు.

  • ==================
visit my website : Dr.Seshagirirao.com

No comments:

Post a Comment