Monday, August 10, 2009

పెరుగు , Curd,యోగర్ట్

-----
4,500 సంవత్సరాల నుండి ప్రజలు పెరుగును-తయారుచేసి-తింటున్నారు.నేడు ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక సాధారణ ఆహారపదార్ధం.ఇది ప్రత్యేక ఆరోగ్యప్రయోజనాలున్న ఒక పోషకాహారం.ఇది ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లావిన్, విటమిన్ B6 మరియు విటమిన్ B12 వంటి పోషకాలను కలిగి ఉంది. పెరుగును యోగర్ట్ అని అంటారు . కొవ్వు తక్కువగా ఉండే పెరుగు లో లాక్తోబసిల్లై అధికం గా ఉంటాయి ,ఇవి మన పేగుల్లో సహజము గా ఉండే సూక్ష్మ జీవులు. ఇవి ప్రమాదకర బాక్టీరియాను సంహరిస్తాయి . పెరుగు కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది .
  • పాలలో కన్నా పుల్లటి పెరుగు లో కాల్సిం శతం ఎక్కువ . కప్పు(250mg) పెరుగు లో370 mg కాల్సిం ఉంటుంది.
  • విటమిన్ బి , పాస్ఫరస్ , పొటాసియం , మాంసకృత్తులు సంవృద్ధి గా ఉంటాయి .
  • పుల్ల పెరుగు అరటిపండు తో కలిపి తింటే కడుపులో మంట తగ్గుతుంది .
  • పుల్లటి పెరుగు మజ్జికలా చేసి జీలకర్ర , కరివేపాకు , చిటికెడు శొంఠి చేర్చి తీసుకుంటే వాంతి , డయేరియా తగ్గును .
  • పెరుగు రక్తపోటును తగ్గించును అనే వాదన కుడా ఉన్నది .
పొట్టచుట్టూ కొవ్వు.. పెరుగుతో తగ్గు కొంతమందికి కమ్మని పెరుగు లేనిదే భోజనం సంపూర్ణం అయినట్టు అనిపించదు. క్రమం తప్పని ఈ పెరుగు వాడకమే బరువు తగ్గడానికి భేషైన మార్గం. పెరుగుకి శరీర జీవక్రియలని చురుగ్గా ఉంచే శక్తి ఉందని అధ్యయనాల్లో తేలింది. రోజులో మూడు పూట్లా పెరుగు తినేవారు..శరీరంలో పేరుకొన్న కొవ్వు నిల్వలని అరవై శాతానికిపైగా తగ్గించుకోవడానికి అవకాశాలున్నాయి. అంతేకాదు పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని ఎనభై శాతం తగ్గించి నాజూగ్గా ఉండేందుకు సహకరిస్తుంది. అందుకే పెరుగు వాడకాన్ని పెంచండి.
 చర్మ కాంతికి పెరుగు

    ముఖాన్ని కాంతిమంతంగా మార్చుకోవడం కోసం తరచూ బ్యూటీ పార్లర్లకు పరుగెత్తాల్సిన పని లేదు. వంటింట్లో దొరికే వస్తువులతో ప్రయత్నిస్తే చాలు.

క్లెన్సర్‌: పచ్చి పాలలో దూదిని ముంచి ముఖాన్ని తుడుచుకుంటే మురికి వదిలిపోతుంది. తరచూ చేస్తుంటే చర్మం నునుపు దేలుతుంది

మాయిశ్చరైజర్‌: ఒక టీ స్పూను నారింజ రసం, ఒక టీ స్పూను నిమ్మరసం, ఒక కప్పు పెరుగు కలిపి పేస్టులా చేయండి. దీనిని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరవాత తడి టిష్యూతో తుడిచేసుకోండి. పొడి చర్మం తేమగా మారడంతో పాటు, చర్మ కాంతి కూడా పెరుగుతుంది.

ప్రొటీన్‌ మాస్క్‌: టేబుల్‌ స్పూను మినప్పప్పునీ, ఐదారు బాదం పప్పుల్నీ రాత్రి నానబెట్టి ఉదయం వాటిని పేస్టులా చేసి ముఖానికి రాసుకోండి. గంట తరువాత కడిగేసుకుంటే చర్మానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.

చర్మానికి కండిషనర్‌: ఒక టేబుల్‌ స్పూను తేనెకి, రెండు టీ స్పూన్ల మీగడని కలిపి ముఖానికీ, మెడకీ రాసుకుని కొన్ని నిమిషాల తరవాత కడిగేసుకోండి.

సన్‌స్క్రీన్‌ లోషన్‌: కీరదోస రసం, గ్లిజరిన్‌, రోజ్‌ వాటర్‌ కలిపి ఒక డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో దాచుకోండి. ఇంట్లోంచి బయటికి వెళ్లడానికి అరగంట ముందు ఇది ముఖానికి రాసుకుంటే సన్‌స్క్రీన్‌ లోషన్‌లా పనిచేస్తుంది. దీనివల్ల ఎండ ప్రభావం ఎక్కువగా ఇబ్బంది కలిగించదు.

పెరుగు లాభాలెన్నో...

    కూర, పచ్చడి, సాంబారు... ఎన్ని వేసుకుని తిన్నా చివరలో పెరుగన్నం తినకపోతే భోజనం చేసినట్లే అనిపించదు. అంతగా మన దైనందిన ఆహారంలో భాగంగా మారిన పెరుగు గురించిన కొన్ని విశేషాలు...

అన్నంలో కలిపి తింటారా... లేదా విడిగా తింటారా... అది మీ ఇష్టం... కానీ కచ్చితంగా రోజుకి రెండుసార్లయినా పెరుగు తినాల్సిందే అంటున్నారు పోషకాహార నిపుణులు. తెలిసో తెలియకో మనం పెరుగన్నం తింటూనే ఉంటాం. కానీ బరువు తగ్గాలనో నిద్ర వస్తుందనో ఈమధ్య చాలామంది మానేస్తున్నారు. కానీ రోజూ పెరుగు తినేవాళ్లకి బీపీ వచ్చే అవకాశం తక్కువ అన్నది స్పానిష్‌ నిపుణుల పరిశీలన. బల్గేరియన్లూ రష్యాల్లోని స్టెప్పీలూ పెరుగు బాగా తినడంవల్లే ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవిస్తున్నారని పారిస్‌ నిపుణుల ఉవాచ.

పాలూ పెరుగూ 'అసలు పాలకీ పెరుగుకీ తేడా ఏమిటి? పెరుగు తినకపోతేనేం?'... వంటి సందేహాలెన్నో. నిజమే, పాలల్లో పోషకాల సంఖ్య ఎక్కువే. అయితే అందులోని లాక్టోజ్‌ను అంతా అరిగించుకోలేరు. అదే పెరుగయితే ఆ సమస్య ఉండదు. మలబద్ధకం, డయేరియా, పేగు క్యాన్సర్‌, మొలలు... వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే పెరుగు, తేనె మిశ్రమాన్ని దేవతల ఆహారంగా పురాణాలు పేర్కొన్నాయి.

పెరుగులో లాక్టో బాసిల్లస్‌, స్ట్రెప్టోకాకస్‌... అనే భిన్న జాతులకు చెందిన ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటాయి. ఈ బ్యాక్టీరియా లాక్టోజ్‌ చక్కెరను లాక్టిక్‌ ఆమ్లంగా మార్చడం ద్వారా పాలల్లోని ఆమ్లశాతాన్ని తగ్గిస్తాయి. ఫలితంగా పాలల్లోని ప్రొటీన్లు అమైనోఆమ్లాలుగా మారి గడ్డకడతాయి. అదే సమయంలో ఈ బ్యాక్టీరియా కాస్త పులిసేలా చేస్తుంది.

లాభాలెన్నో...
పెరుగులోని ఈ రకం బ్యాక్టీరియా పొట్ట, పేగుల్లోని ఇన్ఫెక్షన్లను కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. లేదంటే అవి అల్సర్లనీ తద్వారా క్యాన్సర్‌నూ కలిగిస్తాయి. అందుకే పెరుగు తయారీకి అవసరమైన ఈ బ్యాక్టీరియాను కృత్రిమంగా రూపొందించి యాక్టివ్‌ కల్చర్స్‌ పేరుతో విక్రయిస్తుంటారు.

* పెరుగులో విటమిన్‌ -ఎ, ఇ, సి, బి2, బి6, బి12 విటమిన్లూ; కాల్షియం, సోడియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, ఐరన్‌, జింక్‌, అయొడిన్‌... వంటి ఖనిజాలూ; లాక్టోజ్‌ చక్కెరలూ కొవ్వు ఆమ్లాలూ ఇలా ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పాలతో పోలిస్తే పెరుగులోని కాల్షియం ఒంటికి పట్టి డి-విటమిన్‌ తయారీకి తోడ్పడుతుంది. అందుకే ఆస్టియోపొరోసిస్‌తో బాధపడేవాళ్లకి పెరుగు ఎంతో మేలు. ఎసిడిటీతో బాధపడేవాళ్లకి పాలకన్నా పెరుగే మంచిది. బి12 ఎర్ర రక్తకణాల ఉత్పత్తినీ నాడీ వ్యవస్థ పనితీరునీ ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా పిల్లలకూ వృద్ధులకూ ఇది ఎంతో మంచిది.

* తరచూ ఈస్ట్‌ సంబంధిత ఇన్ఫెక్షన్లతో బాధపడేవాళ్లకి పెరుగు తినడంవల్ల ఫలితం ఉంటుంది.

* వ్యాయామం తరవాత బాటిల్‌ నీళ్లతోపాటు కప్పు పెరుగు తీసుకోవడంవల్ల వెంటనే శక్తిని పుంజుకుంటారు.

* రోజూ కనీసం 50 గ్రా. ఫ్రూట్‌ ఫ్లేవర్లతో కూడిన పెరుగు తినేవాళ్లలో దంతాలు పుచ్చిపోవడం జరగదు.

పెరుగులో పండు!
పాల ఉత్పత్తులను అమ్మే కంపెనీలు ఇటీవల పెరుగును రకరకాల ప్యాక్‌ల్లో భిన్న కాంబినేషన్లలో విక్రయిస్తున్నారు. స్ట్రాబెర్రీ, ద్రాక్ష... వంటి అనేక పండ్ల ఫ్లేవర్లలోనూ పెరుగు వస్తోంది. అయితే ప్యాక్డ్‌ పెరుగుల్ని కొనేముందు 'లైవ్‌ అండ్‌ యాక్టివ్‌ కల్చర్స్‌' అన్న లేబుల్‌ ఉందో లేదో చూడాలి. ఎందుకంటే బ్యాక్టీరియా లేకుండా రెనిట్‌, ఇతర ఆమ్లపదార్థాలతో కూడా పెరుగుని తయారుచేస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యానికి పెద్దగా ఉపయోగమేమీ ఉండదు. అంతేకాదు, రకరకాల పండ్లూ నట్స్‌ టాపింగ్స్‌తో ఐస్‌క్రీమ్‌ మాదిరిగా అందించే ఫ్రోజెన్‌ యోగర్ట్‌ పార్లర్లూ వచ్చాయి.

భిన్న రుచుల్లో...
పెరుగుని ఇంట్లోనే భిన్నరుచుల్లో తయారుచేసుకోవచ్చు. కీరా, క్యారెట్‌, ఉల్లిముక్కలు, కొత్తిమీర, మిర్చి... కలిపి చేసే రైతాల మాదిరిగానే; వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌; స్ట్రాబెర్రీ, మామిడి, దానిమ్మ, కమలా, ద్రాక్ష, పైనాపిల్‌ పండ్లముక్కలు; ఇలా రకరకాల రుచుల్ని పెరుగులో జోడించవచ్చు. ప్రొటీన్‌ శాతం అధికంగా ఉండే పెరుగుకి పీచు ఎక్కువగా ఉండే ఓట్స్‌, రాగులు వంటి తృణధాన్యాలను జోడిస్తే మంచి సమతులాహారం. వడగట్టిన పెరుగులో యాలకులపొడి, కుంకుమపువ్వు, పంచదార కలిపి చేసే శ్రీకండ్‌ రుచి తెలిసిందే. దీనికే మామిడిపండు రసం కలిపితే అదే ఆమ్రఖండ్‌... రుచికరమైన వేసవి డిజర్ట్‌.

ఇటీవల ఆవు, గేదె పాలతోనే కాదు, బియ్యం, సోయాపాలతో చేసిన వెజిటబుల్‌ పెరుగులూ వస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యాన్ని పెంచే పెరుగుని చల్లచల్లగా ఆస్వాదించండి. వేసవి నుంచి ఉపశమనం పొందండి. 

  • =========================
visit my website : dr.seshagirirao.com

No comments:

Post a Comment