Tuesday, August 25, 2009

బెల్లము , Jaggery


  •  

బెల్లం (Jaggery) :
  • బంగారు వన్నెతో చూడడానికి అందము గా , తియ్యగా మంచివాసనతో ఉండే బెల్లము ఆరొగ్యానికి చాలా ప్రయోజనకారి .  ఒక తియ్యని ఆహార పదార్ధము. దీనిని సాధారణంగా చెరకు రసం నుండి తయారుచేస్తారు. ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి బెల్లం తయారీకి ప్రసిద్ధి. పామే కుటుంబానికి చెందిన తాటి, జీలుగ చెట్లనుండి కూడా బెల్లం తయారవుతుంది. బెల్లంలో పంచదారకు మల్లే పెద్దగా రసాయనాల వాడకం ఉండదు. పైగా ఖనిజాలు అధికం. అందుకే దీన్ని మెడిసినల్‌ చక్కెర అంటారు. ప్రతి 100 గ్రా బెల్లంలో 2.8గ్రా మినరల్‌ సాల్ట్‌లు ఉంటాయి. అంటే కిలోకి 28 గ్రాములు. అదే పంచదారలో అయితే కిలోకి కనీసం 300 మిల్లీగ్రాములు కూడా ఉండదు. బెల్లంలోని మెగ్నీషియం నాడీవ్యవస్థను బలోపేతం చేస్తుంది. పొటాషియం అయితే కణాలలోని ఆమ్లాలని నియంత్రిస్తుంది. ప్రతి వంద గ్రాముల బెల్లం నుంచి 383 కెలొరీల శక్తిని, 95 గ్రా కార్బోహైడ్రేట్లని, 80 మిల్లీ గ్రా క్యాల్షియం, 40 మిల్లీ. గ్రా. పాస్ఫరస్‌, 2.6మి గ్రా ఇనుమును పొందవచ్చు.  
ఉపయోగాలు
  • పంచదార లేదా చక్కెర కంటే బెల్లం ఆరోగ్యపరంగా శ్రేష్టం ఎందుకంటే బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలు ఉంటాయి.
  • భారతీయ వంటలలో బెల్లం ఒక ముఖ్యమైన భాగం. తియ్యని పిండివంటలు తయారీలో కొంతమంది పంచదార కంటే బెల్లాన్నే ఎక్కువగా ఉపయోగిస్తారు.
  • ఆయుర్వేద వైద్యశాస్త్రంలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందులలో వాడతారు.
  • పొడి దగ్గు ఇబ్బంది పెడుతుంటే .. గ్లాసు బెల్లం పానకం లో కొద్దిగా తులసి ఆకులు వేసి రోజుకు మూడు సార్లు తీసుకుంటే ఉపసయనం కలుగుతుంది .
  • అజీర్తి సమస్యతో విసిగిపోయిన వారు భోజనం చేశాక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది . అజీర్తి సమస్యలుండవు .జీవ క్రియ ను వేగవంతం చేస్తుంది .
  • కాకర ఆకులు , నాలుగు వెల్లుల్లి రెబ్బలు (రెక్కలు) , మూడు మిరియాల గింజలు , చిన్న బెల్లం ముక్క వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని రోజు రెండుపుతల వారం రోజులు తీసుకున్నా , లేదా గ్లాసు పాలలో పంచధరకి బదులు బెల్లం వేసి రోజు త్రాగిన ... నెలసరి సమస్యలు ఉండవు .(బహిష్ట సమస్యలు ఉండవు .).
  • నేయి తో బెల్లం వేడిచేసి నొప్పి ఉన్నా చోట పట్టు వేస్తె భాధ నివారణ అవుతుంది .
  • ముక్కు కారడము తో బాధపడుతున్న వారికి  ... పెరుగు , బెల్లం కలిపి రోజుకు రెండు పూటలు తింటే తగ్గుతుంది .
  • బెల్లం , నెయ్యి .. సమపాళ్ళలో కలిపి తింటే 5 -6 రోజులలో మైగ్రిన్ తల నొప్పి తగ్గుతుంది .
Nutrition value : ఒక చెంచా (100 గ్రాములు) బెల్లం లో :
  • కాలోరీస్ ------------------19 cal/tbsp,
  • విటమిన్ బి కాంప్లెక్ష్  --------1 g/kg ,
  • ఫోలిక్ ఆసిడ్ ------------- 1 mg /kg ,
  • ఐరన్ --------------------2.6 mg /100 Grms,
  • కాల్సిం ------------------8.0 mg /100 Grms,
  • ఫాస్ఫోరస్---------------- 3-4 mg / 100 Grms,
  • మెగ్నీషియం -------------8 mg / 100 Grms,
  • పొటాసియం -------------4.8 mg / 100 Grms ,
తీపి పదార్ధ అంటే బెల్లం తో చేసినవి మాత్రమె అనేవారు మనపెద్దలు . పంచదార వచ్చి బెల్లం తో చేసిన తీపి పదార్ధాలు ఉనికిని వెనక్కి నేట్టేసింది . ఒకప్పుడు బెల్లం బూంది , మరమరాలు బెల్లం కలిపిన వుండలు, నువ్వులు బెల్లం కలిపిన జీడీలు వంటి చిరుతిండ్లు పిల్లలకు ఎక్కువగా పెట్టేవారు . బెల్లము ఆరోగ్యాన్నిస్తుంది. బెల్లం పోషక పదార్ధము కూడా . బెల్లం వల్ల కీళ్ళ ఇబ్బదందులు రావు . రక్తం లో చేరిన విషపూరిత పదార్ధాలను తొలగించే శక్తి బెల్లానికి ఉంది . దీనిలో వుండే గ్లూకోజ్ , సుక్రోజ్ లు పంచదారలో ఉండే వటికన్నా మంచివి . కాబట్టి బెల్లం వాడకం పెంచడం మంచిది . బెల్లం తో చేసిన పరమాన్నం పిల్లలకు పెట్టండి . వంటకాలలో బెల్లం వాడకం పెంచడం మంచిది . ఇప్పటికీ పల్లెటూళ్ళలో బెల్లం తో చేసిన అరిసెలు , బూరెలు , పూర్ణాలకే డిమాండ్ ఉన్న సంగతి తెలిసినదే .
అసిడిటీని తగ్గించే బెల్లం , Jagary reduce Acidity కడుపులో మంటగా ఉన్నప్పుడు బెల్లం చిట్కాను ప్రయోగించవచ్చని పోషణ నిపుణులు సూచిస్తున్నారు. బెల్లంలో పొటాసియం సమృద్ధిగా ఉంటుంది. ఇది కణాల్లో ఆమ్లాలు, అసిటోన్లపై దాడి చేసి ఆమ్ల సమతౌల్యాన్ని కాపాడుతుంది. భోజనం చేసిన తర్వాత ప్రతిసారీ చిన్న బెల్లం ముక్క తినటం ద్వారా అసిడిటీని తగ్గించుకోవచ్చు. ఇలాంటి ప్రయోజనాలు ఉండటం వల్లే బెల్లాన్ని 'మెడిసినల్‌ సుగర్‌'గా వ్యవహరిస్తారు.

బెల్లములో రకాలు : 

 సాదారణముగా చెరకు రసము నుంచి మొలాసిస్ ను వెలికితీసి బెల్లము తయారు చేస్తారు . ఇది సాదారణము గా ప్రతిఒక్కరు ఉపయోగించే రకము . తాటికల్లు , ఈతకల్లు , ఖర్జూరము  నుంచి బెల్లము తయారుచేస్తారు .

చెరకు బెల్లం  : బంగారు బ్రౌన్‌కలర్ నుంచి దార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది . చెరకు రసాన్ని కాయడం ద్వారా తయారుచేస్తారు . భారతీయ ఇళ్ళలో వాడేరకము ఇది .

ఖర్జూర బెల్లం : ఈ బెల్లము గోల్డెన్‌ బ్రౌన్‌ నుండి డార్క్ బ్రౌన్‌ కలర్ లో ఉంటుంది . ఖర్జూర రసాన్ని మరిగించి తయారుచేస్తారు . డార్క్ చాకొలైట్ రుచి ఉంటుంది .

తాటి బెల్లము : ఆఫ్ వైట్ నుండి పేల్ ఎల్లో కలర్ లో ఉంటుంది . తాటి రసాన్ని మరిగించడము ద్వారా తయారు చేస్తారు . తెల్లని చాక్లెట్ రుచిలో ఉంటుంది .

ఈతబెల్లం : ఈతకల్లు మరిగించడము ద్వారా తయారుచేస్తారు . ఈ రకము గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్ లో ఉంటుంది . మయన్మార్ లో దీని వాడకము ఎక్కువ .

కొబ్బరి బెల్లము : దీనిని కొబ్బరి నీరు కొన్ని రసాయనాలు మరిగించడము ద్వారా తయారు చేస్తారు . దీని రంగు గోల్డెన్‌ బ్రౌన్‌ నుండి  డార్క్ బ్రౌన్‌ లో ఉంటుంది . దీని ఖరీదు ఎక్కువ అయినందున తయారీ చేయడం మానుకున్నారు . ‌
  • ===========================================
Visit my web site --> Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment