- కమలాలకు రెట్టింపు 'విటమిన్ సి', ఆపిల్‌లోకన్నా అయిదు రెట్లు ఎక్కువ పోషకాలూ దీని సొంతం. పీచు పదార్థం, విటమిన్ ఇ, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మరెన్నో పోషకాల నిలయం 'కివీ' పండు. న్యూజిలాండ్‌లో మాత్రమే పండే కివీలు ఇప్పుడు మన మార్కెట్‌లోనూ విరివిగా దొరుకుతున్నాయి. కొవ్వులూ, సోడియం తక్కువగా ఉండటంవల్ల హృద్రోగులూ, మధుమేహ వ్యాధిగ్రస్తులూ కూడా దీన్ని తినొచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. బరువు తగ్గించుకోవాలనుకునేవారికీ ఇది మంచి నేస్తమే. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలవల్ల బీపీ, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి. పోషకాలే కాదు, నోరూరించే రుచి కూడా కివీ సొంతం.
కివి పండుకు పేర్లు చాలా వున్నాయి. చాలామంది దీనిని వండర్ ఫ్రూట్ అని పిలవటం కూడా వింటూంటాం. ఇంతటి ఆశ్చర్య ఫలితాలనిచ్చే ఈపండు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. పండ్లు అన్నిటిలోకి అధిక పోషకాలు కలిగిన ఈ కివి పండు పై రట్జర్స్ యూనివర్శిటీ కి చెందిన డా. పౌల్ లారెన్స్ కొన్ని పరిశోధనలు చేశారు. సాధారణంగా మనం తినే 27 రకాల పండ్లలో కివి పండులోఅధిక పోషకాలుంటాయని స్టడీ తెలిపింది. కివి పండులో పోషకాలు చూడండి.
ఆరోగ్య ప్రయోజనాలు :
- కివి పండులో దండిగా విటమిన్లు , ప్లావనాయిడ్స్ , ఖనిజలవనాలు ఉన్నాయి. రోజుకు 2-3 పండ్లు తింటే కంటిసంబంధిత , వయసు పెరుగుదలతో వచ్చే మాక్యులార్ క్షీణత 36% వరకూ తగ్గుతుందని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
- కాన్సర్ కు దారితీసే జన్యుమార్పులను నిరోధించే పదార్ధము ఈ పండులో ఉన్నట్లు గుర్తించారు . ఇందులో ఉండే గ్లుటథియోన్ క్యాన్సర్ కు దారితీసే క్రమాన్ని నిరోధిస్తుందని అంటారు ఆహారనిపుణులు . శరీరము లో ఏర్పడే నైట్రేట్ ఫ్రీరాడికిల్ ప్రభావాన్ని నిరోదిస్తుంది .
- మరో అధ్యయనములో కివి పండు నుంచి తీసిన రసము చర్మ క్యాన్సర్ ను నిరోధిస్తుందని తేలింది .
- కివిపండులోగల అమినోయాసిడ్ ' ఆర్జినిన్" శుద్ద రక్తనాళాల్లో గట్టి పదార్ధం ఏర్పడకుండా నితోధిస్తుంది .
- కివిపండు మంచి ఫైబర్ గల ఆహారముగా నిపుణులు జరిపిన అధ్యయనములో తేలింది .
- జీర్ణక్రియను వేగవంతం చేసి క్యాన్సర్ నిరోధక పదార్ధములు ఉన్నాయి .
- విరోచన కారిగా ఉపయోగ పడును .
- అత్యధికము గా బీటా కెరోటిన్ ఉన్నందున మంచి యాంటీ ఆక్షిడెంట్ గా ఉపయోగపడును .
- కివి పండులోని ఫైటోకెమికల్ " లుటెయిన్ " ప్రోస్టేట్ గ్రంధి , కాలేయ క్యాన్సర్ లను నిరోధించును .
- కివి పండు లో ఉండే " ఇనోసిటాల్ " అనే పదార్ధము మనోవ్యాకులత చికిత్సకు ఉపయోగపడుతుంది .
- కివిపండు లోని ఫైటోకెమికల్స్ , గ్జాంతోఫిల్స్ కంటిలో శాశ్వత అంధత్వానికి దోహదము చేసే " మాక్యులార్ డిజనరేషన్" ను నివారించును .
- కివిపండులోని యాంటీఆక్షిడెంట్స్ మంచి కొలెస్టిరాల్ ను భస్మము చేయకుండా నిరోధించును .
- ఈ పండులోని " ఆర్జినిన్ , గ్లుటామిన్ " అనే రెండు అమినోయాసిడ్స్ ఎక్కువగా ఉండడమువలన గుండెకు రక్తము బాగా సరఫరా కావడానికి సహకరిస్తాయి.
- కివిపండు తొక్క లో ఉండే ఫ్లావనాయిడ్ యాంటీఆక్షిడెంట్ శరీరములోని ఫ్రీరాడికిల్స్ ను తొలగించి ఆరోగ్యాన్ని కాపాడును .
- కివి విత్తనాలనుండి తీసిన ఆయిల్ లో 62% ఆల్ఫాలినోలిక్ , ఒమేగా-3 ఫాటీయాసిడ్స్ ఉన్నందున ఆరోగ్యానిని మంచిది .
- దీనిలో ఉండే ప్రోటీన్ వలన కొంతమందికి ' ఎలర్జీ' వచ్చే అవకాశము ఉన్నది .
- నగరంలో దొరికే కివీ పండల్తో ప్రయో జనాలోన్నో. దీని తొక్కను తీసి పారేస్తుం టాం. కానీ అందులో చాలా విషయం ఉంది. తొక్కు వెనుక యాంటీ ఆక్సిడెం ట్లు పూర్తి పీచు పదార్ధంతో నిండిన గుజ్జు ఉంటుంది. మొక్కజొన్నను మినహా యిస్తే.. కంటి చూపును కాపాడే లుటియి న్ పదార్థ్ధం ఏ ఇతర పండు, కూరగాయాల్లో కూడా ఇందులో ఉన్నంత ఉండదు. రోజుకు రెండు నుంచి మూడు కివీలు తిన్నవారిలో శరీరం లోప ల రక్తం గడ్డకట్టే ప్రమాదం తగ్గినట్లు నార్వేలో గుర్తించారు.
- శక్తి : 60 కేలరీలు
- కార్బోహైడ్రేట్స్ : 14.66 గ్రా.
- చెక్కెర : 8.99 గ్రా .
- ఫైబర్ : 3.00 గ్రా
- ఫ్యాట్ : 0.52 గ్రా .
- ప్రోటీన్ 1.14 గ్రా ,
- థయామిన్(B1) : 0.027 గ్రా .
- రైబోఫ్లావిన్ : 0.025 మి. గ్రా .
- నియాసిన్ : 0.341 మి. గ్రా .
- విటమిన్ బి6 : 0.63 మి. గ్రా .
- ఫోలేట్ (బి9) : 25 మి.గ్రా.
- విటమిన్ సి . : 92.7 మి.గ్రా .
- విటమిన్ ఇ . : 1.5 మి.గ్రా.
- విటమిన్ కె : 40.3 మి.గ్రా.
- కాల్సియం : 34 మి.గ్ర్రా.
- ఇరన్ : 0.31 మి.గ్రా.
- మెగ్నీషియం : 17 మి.గ్రా .
- ఫాస్పరస్ : 34 మి.గ్రా .
- జింక్ : 0.14 మి.గ్రా .
- పొటాషియం : 312 మి.గ్రా .
- మాంగనీష్ : 0.098 మి.గ్రా.
- ===========================
No comments:
Post a Comment