నారింజలో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, రాగి గంధకం, క్లోరిన్‌లు కూడా ఉన్నాయి. జ్వరాల బారిన పడి జీర్ణశక్తి తగ్గినప్పుడు… నారింజను వాడితే అజీర్ణ సమస్యల నుండి బయటపడవచ్చు. అలాగే, ఆహారనాళాలలో విషక్రిములు చేరకుండా నిరోధించే శక్తి కూడా నారింజకు కలదు. నారింజలో బెటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలోని కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంట్లో ఉండే కాల్షియం.. ఎముకలు, దంతాల దృఢత్వానికి ఎంతగానో సహకరిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయటంలోనూ, రక్త ప్రసరణ సక్రమంగా జరగడంలోనూ దోహదపడుతుంది. ఫలితంగా గుండె పనితీరు మెరుగుపడుతుంది. విటమిన్ సి శాతం ఎక్కువగా ఉన్న నారింజను రోజుకు ఒకటి తీసుకున్నట్లయితే.. చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. జలుబు, దగ్గు లాంటి ఆరోగ్య సమస్యలు కూడా దరి చేరవు. రోజూ పరగడుపున ఒక గ్లాస్ నారింజ జ్యూస్ తాగితే, మార్నింగ్ సిక్‌నెస్‌నుండి సులభంగా బయటపడవచ్చు. గర్భవతులు రోజూ ఒక గ్లాస్ నారింజ జ్యూస్ తాగినట్లయితే.. ఫోలిక్‌యాసిడ్ సంప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
నారింజ తొక్కను పడేయకుండా… ఎండబెట్టి, పొడి చేసి, సున్నిపిండిలో కలుపుకుంటే మంచిది. ఈ పిండిని స్నానానికి ముందు ఒంటికి రాసుకుని రబ్ చేస్తే… చర్మంపై ఉండే మృతకణాలన్నీ సులభంగా తొలగిపోతాయి. చర్మం మృదువుగా అవటమే కాకుండా, కొత్త మెరుపును సంతరించుకుంటుంది. అన్ని కాలాల్లోనూ ఇప్పుడు హైబ్రీడ్ కమలాలు దొరుకుతున్నా.. ఎక్కువగా చలికాలం నుండి వేసవి కాలందాకా ఎక్కువగా కమలాపండ్లు దొరుకుతాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచగలిగే ఫలాలలో కమలాఫలం కూడా ఒకటి. ఆస్తమా, ట్యూబర్‌క్యూలోసిస్‌తో ఇబ్బంది పడేవారికి కమలాపండు అతిముఖ్యమైన ఆహారం. ఈ పండు రసం ఎక్కువగా తీసుకోవడం వలన కిడ్నీలలో రాళ్ళు ఏర్పడకుండా నిరోధించవచ్చు. కమలాపండులో అధికంగా ఉండే పోలిక్ యాసిడ్ మెదడును బ్యాలెన్స్‌గా ఉంచగలగడమే కాకుండా ఉత్సాహంగా.. ఉల్లాసంగానూ ఉంచగలుగుతుంది. మజిల్స్, అజీర్ణం, జ్వరం వంటి జబ్బులను నయం చేయడంలో కమలా రసం పాత్ర చెప్పుకోతగ్గది. యుక్తవయస్సులో ఆడపిల్లల ముఖంపై ఏర్పడే మొటిమలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేయడంలో కమలా రసం బాగా ఉపయోగకారి. తరచూ జలుబు చేసేవారిలో రోగనిరోధక శక్తి పెంచగలదు.
Updates : ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు మరణాల్లో 50శాతానికి పైగా... అధిక రక్తపోటు కారణంగానే సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. మరి ఆ ముప్పును తప్పించుకోవాలంటే? రోజుకు రెండుగ్లాసుల కమలా రసం తీసుకుంటే సరిపోతుందంటున్నారు ఫ్రెంచ్ వైద్యనిపుణులు. కమలాల్లో ఉండే హెస్పెరిడిన్ అనే మిశ్రమం రక్తపోటును క్రమంగా తగ్గిస్తుందని చెబుతున్నారు వారు. అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజూ ఆరెంజ్‌ా జ్యూస్ తాగితే నెలరోజుల్లోపే వారి సిస్టోలిక్ రక్తపోటులో ఏడుశాతం, డయాస్టోలిక్ రక్తపోటులో 4.5 శాతం తరుగుదల కనిపిస్తుందని వారి పరిశోధనల్లో తేలింది. రక్తపోటుతో పాటు మధుమేహం కూడా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించకుండా కమలారసం తాగొద్దని హెచ్చరిస్తున్నారు.
రంగూరుచీవాసనా ఉన్న అందమైన ఫలమే ఆరెంజ్. సి-విటమిన్‌తోపాటు ఇతర ఖనిజాలూ పుష్కలంగా ఉంటాయి. ఈ పండులోని చక్కెరలు ప్రత్యేకమైనవి. ఇందులోని క్షారగుణం ఎసిడిటీని తగ్గిస్తుంది. ఇది సంతానసాఫల్యతనీ పెంచుతుంది. హృద్రోగులకి నారింజరసం ఎంతో మేలు. క్యాన్సర్‌ను నిరోధించే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో సమృద్ధిగా ఉంటాయి.
పోషకాలు--వంద గ్రా. ఆరెంజ్‌లో
శక్తి: 48 క్యాలరీలు
పిండి పదార్థాలు: 12 గ్రా.
ప్రొటీను్ల: 0.9గ్రా.
పీచు: 2.4గ్రా.
సి-విటమిన్:53.2మి.గ్రా.
కాల్షియం: 40 మి.గ్రా.
ఇనుము: 0.12 మి.గ్రా.
సోడియం: 4.5 మి.గ్రా.
పొటాషియం: 181 మి.గ్రా.
మెగ్నీషియం: 10మి.గ్రా.
============================
Visit my website : dr.seshagirirao.com
No comments:
Post a Comment