Monday, August 10, 2009

బటాణి గింజలు , Peas

  •  
కాలం కదిలే కడలితరంగము . కాలము ఒక నిరంతర ప్రవాహము ... నిరంతర ప్రస్తానము . పరుగులు తీసే కాలం తో మారే ఋతువులు మనోహరము . కాలానికి అనుగుణం గా ప్రక్రుతి లో అనేక రకాల పండ్లు , కాయలు , ఆకుకూరలు , దుంపలు తినేందుకు లబిస్తూ ఉంటాయి . ఆయా సీజన్లలో దొరికే వాటిని తప్పకుండా తినడమే ఆరోగ్యానికి చాలా మంచిది . .. అదే ప్రక్రుతి వైద్యము .

  •  
  బటాణిల్లో మాంస కత్తులు మాంసాహార పోషకాల కు సరిసమానం అని చెప్పవచ్చును . వీటి లో పీచు పదార్ధము ఎక్కువ . కొంత మేరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.  
  • విటవిన్ల విలువ : 
థయామిన్ (B1), రిబోఫ్లావిన్(B2),నియాసిన్(B3), పెరిడాక్షిన్ (B6), పుస్కలము గా ఉంటాయి , ఫోలిక్ ఆసిడ్ , విటమిన్ - ఎ ,విటమిన్- సి , విటమిన్-కే , లభిస్తాయి. కాల్సియం , జింక్ , మెగ్నీషియం , రాగి , పొటాసియం , ఐరన్ , లభిస్తాయి ,  
  • ఆరోగ్య రక్షా గా : 
బటాని లోని సి-విటమిన్ శరీర వ్యాధినిరోధక శక్తిని పెంపొందితుంది ... కాన్సర్ రాకుండా ను ,కీళ్ళ జబ్బులు రాకుండా కపుడుతుంది . . . యాంటిఆక్షిడెంట్ గా కణాల క్షీణతను తగ్గిస్తుంది . రక్తకణాల ... ముఖ్యము గా ఎర్ర రక్తకణాలూ అభివృద్దికి దోహద పడి  .. రక్తహీనతను రాకుండా కాపాడును . ప్రోటీన్లు పుస్కలము గా ఉన్నందున శరీర కండరాలను అభివృద్ధి చేయును .

No comments:

Post a Comment