-
పుదీనా నుండి మెంథాల్ తయారు చేస్తారు. పుదీనానుంచి మెంథాల్‌ను లేదా మెంథా-ఆయిల్‌ను డిస్టిలేషన్ విధానం ద్వారా తీస్తారు. ఇది ఆవిరయ్యే తత్వం కలిగినది. నీళ్ల మాదిరిగా కనిపిస్తుంది.
ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన వాసనతో ఉంటుంది. ప్రయోగానంతరం చల్లదనాన్ని ప్రసాదిస్తుంది.
మన పరిసరాలలో దొరికే ఎంతో విలువైన మొక్కల్లో పుదీనా ఒకటి. దీని శాస్త్రీయనామం మిన్‌థా లామియేసి. ఇది మెంథా స్పైకాటా జాతికి చెందిన మొక్క. సంస్కృతంలో పూతిహ అంటారు. పూతి అంటే
వాసన చూసేది అని అర్ధం. తెలుగులో పుదీనా అనీ, ఇంగ్లీష్‌లో మింట్ అని, లాటిన్‌లో మెంతా పైపరేటా అనీ పిలుస్తారు.
ఇది చూడడానికి ఎంతో విలక్షణంగా ఉండి, దీని ఆకులు మందంగా, కొసలు రంపం ఆకారంలో ఉండి, చాలా మృధువుగా ఉంటుంది. మంచి వన్నె గల ఆకుపచ్చని రంగులో ఉండి, సంవత్సరమంతా
ఆకుపచ్చ గానే ఉంటుంది. దీనికి పువ్వులు, ఫలాలు ఎండాకాలం తరువాత నుంచే ఏర్పడతాయి. వీటి ఫలాలు చాలా చిన్నవిగా ఉంటాయి.
అనేక ప్రయోజనాలు కలిగిన పుదీనా నుండి చమురు తీసి దానిని వైద్య పరంగా వినియోగిస్తున్నారు. చాలా రకాల వ్యాధులకి తయారు చేసే ఔషధాల్లో పుదీనా (మింట్) ఎక్కువ శాతం వాడకంలో ఉండటం
వల్ల ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎంతో డిమాండ్ ఉంది. అందువల్లనే దీనిని వ్యవసాయ పద్ద తుల్లో తగిన విధంగా తోటలు వేసి వ్యవసా యదారులు తగిన రాబడిని, లాభాలని అందుకుంటున్నారు. పుదీనా
మొక్కలో ప్రతి భాగం ఉపయోగపడేదే. ఔషధతత్వాలు కలిగివున్నదే. ఒక కంపెనీ ఉత్పత్తి చేస్తున్న 'పుదీన్ హర' అనే ఔషధం దీనికి నిదర్శనం.
పుదీనా పూర్తి ఔషధ గుణాలు కలిగివున్న మొక్క. చికిత్సా విధానాల్లో దీనిని జీర్ణ సంబం ధవ్యాధులకి ఉపయోగిస్తారు. పుదీనా ఆకుల రసంలో అల్లంరసం, కలబంద గుజ్జు, ఏలకు లు, దాల్చిన చెక్క కలిపి
నూరి, ప్రతి రోజూ, 2-3 చెంచాలు సేవిస్తూవుంటే అరుగుదల పెరుగుతుంది. జీర్ణకోశ వ్యాధులకి, కడుపు నొప్పికి, పుదీనా గింజలు కొన్ని నమిలి తిన్న తరువాత గ్లాసుడు వేడినీళ్ళు తాగితే ఎంతో ఉపశమనం
కలుగుతుంది.
కొన్ని పుదీనా ఆకుల్ని గ్లాసుడు నీళ్లతో మరిగించి, ఆ కషా యాన్ని సేవిస్తే, జ్వరం తగ్గిపోవడమే కాక కామెర్లు, ఛాతిమంట, కడుపులో మంట, మూత్ర సంబంధవ్యాధులు సమసిపోతాయి.
నెల తప్పిన స్త్రీలు ఒక చెంచాడు పుదీనా రసంలో చెంచాడు నిమ్మరసం, చెంచాడు తెనే కలిపి, ఆరారగా చేతిలో వేసుకుని సేవిస్తూ వుంటే, వాంతులు, ఎసిడిటీ, వంటి వికారా లు తగ్గుతాయి.
అలాగే నిద్రలేమికి, మానసిక వత్తిడికి, నోటి వ్యాధులకి కొన్ని పుదీనా ఆకులు గ్లాసుడు వేడి నీటిలో వేసి, మూతపెట్టి అర్ధగంట తరువాత తాగితే చాలా ఉపశమనం కలగజేస్తుంది. మంచి నిద్ర పడు తుంది.
పుదీనా ఆకులు అరచేతిలో బాగా నలిపి ఆరసాన్ని కణతలకి, నుదుటికి రాసుకుంటే, తలనొప్పి తగ్గిపోయి, చల్లదనా న్నిస్తుంది.
చెవి, ముక్కుల్లో ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌కి తాజా పుదీనా ఆకులు కొన్ని రసం తీసి దూది ని ఆరసంలో ముంచి, ముక్కులోను, చెవి లోను డ్రాప్స్‌గా వేసుకుంటే వీటి సమస్య తక్ష ణం పరిష్కారమవుతుంది.
పుదీనా ఆకులు ఎండబెట్టి చూర్ణం చేసి, అందులో తగినంత ఉప్పు చేర్చి ప్రతినిత్యం దంతధావనం చేస్తే చిగుళ్ళు గట్టిపడి, దంత వ్యాధులు కుండా అరికడుతుంది. అంతేకాక నోటి దుర్వాసనని కూడా
అరికడుతుంది.
ఇక శరీరం మీద ఏర్పడే దురద, దద్దుర్లకి కొన్ని పుదీనా ఆకు ల్ని గ్లాసుడు నీటిలో మరగబెట్టి, తగినంత పటిక బెల్లం పొడిని కలిపి తీసుకుంటే ఈ సమస్యనుంచి త్వరగా బయటపడవచ్చు.
చిన్న పిల్లలు కడుపునొప్పి ఉప్పరంతో బాధపడుతుంటే గోరువేచ్చని నీటిలో ఐదు ఆరుచుక్కలు పుదీనా రసం కాచి తాగించడం వలన కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి తగ్గుతుంది.
చిన్న పిల్లలకు జలుబు చేస్తే పుదీనా నుండి తయారయ్యే మెంథాల్ ముద్ద కర్పూరాన్ని కొబ్బరినూనెను కొంచెం తీసుకొని మిశ్రమం చేసి ఛాతికీ వీపునకు రాస్తే జలుబు తగ్గుతుందని ఆయుర్వేద వేద్యం సూచిస్తోంది.
పుదీనా ఆకులను టీతో కలిపి తాగితే రుచుగా ఉండడామే కాక కంఠస్వరం బాగుంటుంది. గాయకులు, డబ్బింగ్ చెప్పేవారు పుదీనా రసం తాగితే కంఠస్వరం మృధువుగా మధురంగా తయారవుతుంది.
ఇవే కాక, ఆహార పదార్ధాల తయారీలో, కాస్మోటిక్స కంపెనీల్లో, బబుల్ గమ్స్ తయారీలో, మందుల్లో, మరి కొన్ని ఉత్పత్తులో ఈ పుదీనా వాడకం ఎంతో ఉంది.
క్రిమి సంహారక గుణాలు కూడా ఇందులో పుష్కళంగా ఉన్నాయి. కనుకనే, దీనిని అఫ్గ్‌నిస్ధాన్ ప్రజలు అత్యధికంగా వాడుతున్నారు. అంతేకాక అక్కడ ఇళ్ళలో కూడా దీనిని విస్తారంగా పెంచుతారు. అంతేకాక
గ్రీకు , సౌత్ అమెరికా, ఆస్త్రేలియా, మొదలైన దేశాలలో కూడా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది.
సిగరెట్ తయారీ కంపెనీలలో కూడా దీనిని వినియోగించి మెంథాల్ సిగరెట్లు తయారు చేస్తున్నారు. సిగరెట్ అలవాటు ఉన్నవారికి కొంత వరకూ గొంతు సమస్యలు అరికడుతుంది కనుక దీనికి మరింత
ప్రాముఖ్యత ఏర్పడింది.
సబ్బుల తయారీలో కూడా వాడుతున్నారు. పుదీనా ఫ్లేవర్‌తో తయారైన ఏ ప్రొడక్టకైనా ప్రపంచవ్యాప్తంగా వినియోగం అధిక సంఖ్యలో ఉందనడం అతిశయోక్తికాదు.
దీనిలో కేలరీలు ఏమీ లేకపోడంతో అందరూ పుదీనాని ఎంతైనా వినియోగించుకోవచ్చు. ఇంతటి విలువలు ఉన్న పుదీనాని ప్రతి వారు ఇంట్లో పెంచి తాజాగా వాడుకుంటూ వుండడం ఎంతైనా శ్రేయస్కరం.
ఇది చిన్న కుండీలలో కూడా పెరగగల మొక్క. కనుక స్థలాభావం దీనికి ఉండదు. పెంపకానికి ఎంతో అనువుగా ఉంటుంది.
No comments:
Post a Comment