పుచ్చకాయ (Watermelon) నే కర్బూజా అని కూడా అంటారు.
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....
పుచ్చకాయ ఎక్కడ పుట్టిందో ఖచ్చితంగా చెప్పలేకున్నా, ఈజిప్టులో 5 వేల సంవత్సరాల క్రితమే పుచ్చను పండించిన ఆధారాలున్నాయని చెబుతారు.అప్పటి ఫారో చక్రవర్తులకు పుచ్చ కాయ రుచి ఎంతగానో నచ్చడం వలనే ఇవి వాళ్ళ గోడలమీద ఉన్న చిత్రాలలో చోటు చేసుకోగలిగింది. సమాధుల్లోనూ పచ్చకాయల్ని ఉంచేవారట. పుచ్చ 13వ శతాబ్దానికల్లా యూరప్ కు విస్తరించింది. మనదేశానికి క్రీ.శ. 4వ శతాబ్దాంలో వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నప్పటికీ ఇది ఇక్కడే పుట్టిందన్న వాళ్ళు లేకపోలేదు. శుశ్రూతుడు తన 'శుశ్రూత సంహిత'లో సింధూ నదీతీరంలో దీన్ని విరివిగా పండించినట్లు పేర్కొన్నాడు. అందులో దీన్ని 'కళింద' లేదా 'కళింగ'గా వ్రాసాడాయన. పొడిగా ఉండే ఉష్ణ వాతావరణంలో పండే పుచ్చ ఎలాంటి నేలతోనయినా ఇట్టే జోడీ కట్టేస్తుంది. అందుకే ఇది ప్రపంచమంతా అల్లుకుపోయింది. అమెరికన్లకు ఇది 17వ శతాబ్దంలో పరిచయం అయ్యింది.
ప్రపంచ వ్యాప్తంగా 1200
పుచ్చరకాల్ని పండిస్తున్నారు. వాటిల్లో కొన్ని
- * నూర్జహాన్
- * షర్బత్-ఎ-అనార్
- * అనార్కలీ
- * షుగర్బేబీ (మహారాష్ట్రలోని అమెరికా రకం)
- * అసాహీ యమటో (పశ్చిమ బెంగాల్లోని జపాన్ రకం)
- * నందారి (ఆంధ్రప్రదేశ్ లో పండించే రకం)
- * రెడ్ టైగర్
- * ఆల్ స్వీట్
- * వాల్ పెయింట్
రాశులుగా పోసిన పుచ్చకాయలు... వరుసల్లో పేర్చిన కర్బూజాలు,చలువ కీరదోస, చెరకు రసాలు... వేసవిలో చల్లననిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ దాహార్తిని తీర్చి, మేనికి సాంత్వననిస్తాయి. ఇంతవరకే వీటి ఉపయోగాలు కాదండోయ్! వీటిల్లో పోషకాలూ అపారం. రాబోయే రోజుల్లో వీటిని తరచూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికెంతో మేలు. ఆ వివరాలనే అందిస్తున్నారు పోషకాహార నిపుణురాలు డాక్టర్ జానకీశ్రీనాథ్..
ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చకాయలకే. అన్ని సీజన్లలోనూ ఇవి దొరుకుతున్నా ఈ కాలంలో లభ్యమయ్యే వాటికి నాణ్యత, రుచీ ఎక్కువ. బి విటమిన్లు , పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే.. పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది. వేడికి కమిలిన చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జును రాస్తే తిరిగి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
ఉన్నవారు పుచ్చకాయ తింటే ఎంతో మేలు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియంలే ఇందుకు కారణం. పుచ్చకాయలో 92 శాతం ఆల్కలైన్ వాటర్ ఉంటుంది. ఈ నీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మూత్రపిండాలు, మూత్రనాళాల్లో ఇబ్బందులు ఉన్నవారికి పుచ్చకాయ వరం లాంటిది.
లోపలంతా గింజలతో నిండి ఉండి ఈ కర్బూజ లో అనేక లాభాలు ఉన్నాయి . టొమాతో ల మాదిరిగా దీనిలో లైకోఫిన్ అనే యాంటి ఆక్షిడెంట్ ఉంటుంది . ఒక గ్రాము టమాటో లో 40 మైక్రో గాములుంటే కర్బూజా లో 72 మైక్రోగ్రాములు ఉన్నది .
పోషకాల వివరాలు, వంద గ్రా. :
- శక్తి: 16కి.కెలొరీలు;
- మాంసకృత్తులు: 2గ్రా ;
- కార్బోహైడ్రేట్లు: 3.3గ్రా;
- కొవ్వు: 0.2 గ్రా;
- పీచు: 0.6 గ్రా;
- సోడియంమి: 27.3గ్రా;
- పొటాషియం: 160మి.గ్రా
మనసును ఆహ్లాదపరిచే సువాసన... అంతకు మించి ఎక్కువ రుచి, తక్కువ కెలొ రీలు, కొవ్వు దీని ప్రత్యేకత. కాయలో యాంటీ ఆక్సిడెంట్‌గుణాలు అధికం. అందుకే హానికారక ఫ్రీరాడికల్స్‌ను అద్భుతంగా ఎదుర్కొంటుంది. ఎండల్లో చర్మం వడదెబ్బ బారినపడి కమిలిపోకుండా రక్షిస్తుంది. బీ-కాంప్లెక్స్ విటమిన్లు సమృద్ధిగా ఉండటంతో వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు దాడి చేయకుండా అడ్డుకుంటుంది. నియాసిన్, పాంటోథోనిక్ ఆమ్లం, విటమిన్ సి, మాంగనీస్‌లు దీనిలో అధికంగా ఉంటాయి. బి.పి.ని తగ్గిస్తుంది.
ఈ పండులో అమినో యాసిడ్ " సిట్రులిన్" ఎక్కువగా ఉంటుంది . ఇది మరో ఎమినో యాసిడ్ " ఆర్జినిన్ " గా రూపంతరము చెందుతుంది . ఈ ఆర్జినిన్ ''ఇన్సులిన్ సెన్సిటివిటీ''ని పెంచుతుంది . . తత్ఫలితము కొవ్వునిల్వలు భారీగా తగ్గుతాయి.
- ================================
Visit my website ->
Dr.seshagirirao-MBBS
No comments:
Post a Comment