Friday, November 6, 2009

Ground nuts, వేరుశనగ పప్పు

వేరుశనగ బలమైన ఆహారము. ఇవి నూనెగింజలు. ఈ గింజలలో నూనె శాతం ఎక్కువ. వంటనూనె ప్రధానంగా వీటి నుండే తీస్తారు. భారత్ యావత్తూ పండే ఈ పంట, ఆంధ్రలో ప్రధాన మెట్ట పంట. నీరు తక్కువగా దొరికే రాయలసీమ ప్రాంతంలో ఇది ప్రధాన పంట. వేరు శెనగ చౌకగా దొరికే మాంసకత్తులు ఉన్న శాకాహారము . ఒక కిలో మాంసము లో లబించే మాంసకృత్తులు అదే మోతాదు వేరుశెనగ లో లభిస్తాయి . ఒక కోడి గుడ్డు కి సమానము వేరుశెనగ పప్పును తీసుకొని అంచనవేస్తే .. గుడ్డు లో కంటే రెండున్నర రెట్లు ఎక్కువగాగానే మాంసకృత్తులు ఉంటాయి. నేలలోపల కాస్తాయి కాబట్టి వీటిని గ్రౌండ్‌నట్స్‌ అనీ అంటారు. దక్షిణ అమెరికాలోని పెరూ వీటి స్వస్థలం. అక్కడనుంచి అన్ని ప్రాంతాలకూ విస్తరించాయి. ప్రస్తుతం వీటి ఉత్పత్తిలో చైనా భారత్‌లదే అగ్రస్థానం. అయినప్పటికీ ఈ రెండు దేశాలనుంచి ఎగుమతుల శాతం చాలా తక్కువ. ఎందుకంటే నూనె రూపంలో వీటిని తాగేస్తున్నారిక్కడ. అదేసమయంలో ప్రపంచవ్యాప్తంగా అస్సలు పల్లీల్ని పండించని యూరోపియన్‌ యూనియన్‌ వెుత్తంగా పల్లీల వాడకంలో ప్రథమస్థానంలో ఉండటం విశేషం. ఆహారంగానే కాదు... పారిశ్రామికంగానూ వేరుసెనగలు ఉపయోగమేనట. నైట్రోగ్లిజరిన్‌, సబ్బులు, రంగులు, వార్నిష్‌, కీటకసంహారిణుల తయారీలోనూ వాడుతున్నారు. వీటిల్లోని ప్రోటీన్‌ నుంచి వస్త్రాలకు సంబంధించిన దారాల్ని సైతం రూపొందిస్తున్నారు. తొక్కలతో ప్లాస్టిక్‌, బోర్డులు, కాగితం తయారీలో వాడే సెల్యులోజ్‌నీ చేస్తున్నారు. ఇంజిన్లను ఈ ఇంధనంతోనే నడిపించాడట రుడాల్ఫ్‌ డీజిల్‌. శరీరంలోని భాగాలన్నీ చక్కని సమన్వయంతో పనిచేయాలంటే శక్తి, ప్రొటీన్‌, ఫాస్ఫరస్‌, థైమీన్‌, నియాసిన్‌ అనే ఐదు పోషకాలూ ఎంతో అవసరం. ఈ ఐదు రకాలూ వేరుసెనగపప్పుల్లో పుష్కలంగా లభ్యమవుతాయి. * ఎ, బి, సి, ఇతో కలిపి వెుత్తం 13 రకాల విటమిన్లూ; ఐరన్‌, కాల్షియం, జింక్‌, బోరాన్‌... వంటి 26 రకాల కీలక ఖనిజాలూ వీటిల్లో ఉన్నాయి. * పల్లీల్లో గుండెకు మేలు చేసే వోనో అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వుల శాతమే ఎక్కువ. ఇందులోని ప్రోటీన్‌శాతం మాంసం, గుడ్లలోకన్నా ఎక్కువ. * పెరిగే పిల్లలకూ గర్భిణులకూ పాలిచ్చే తల్లులకూ ఇవి ఎంతో మంచివి. వేయించిన తాజాగింజల్ని బెల్లం, మేకపాలతో కలిపి ఇస్తే రోగనిరోధకశక్తి పెరుగుతుందట. హెపటైటిస్‌, ట్యుబర్‌క్యులోసిస్‌ వంటివి రాకుండా ఉంటాయి. * హీవోఫీలియాతో బాధపడేవాళ్లకి ఇవి ఎంతో మంచివి. ముక్కునుంచి రక్తం కారుతుంటే కాసిని వేరుసెనగపప్పు తింటే తగ్గుతుందట. అలాగే నెలసరి సమయాల్లో అధిక రక్తస్రావంతో బాధపడే మహిళలు కొంచెం పల్లీలు నానబెట్టి బెల్లంతో కలిపితింటే ఐరన్‌తోపాటు అన్ని రకాల పోషకాలూ అందుతాయి. యాంటీఆక్సిడెంట్లకు ఇవి మంచి నిల్వలు. వేయించిన పల్లీల్లో అయితే వీటి శాతం బ్లాక్‌బెర్రీ, స్ట్రాబెర్రీల్లోకన్నా ఎక్కువ. క్యారెట్లు, బీట్‌రూట్‌లతో పోలిస్తే ఇంకా ఎక్కువని ఇటీవల పరిశోధనల్లో తేలింది.. ఎందుకంటే ఇందులోని పి-కౌమారిక్‌ ఆమ్లం వేయించినప్పుడు 22 శాతం పెరుగుతుందట. * వీటిల్లోని రిజవెరాట్రాల్‌ అనే రసాయనం హృద్రోగాలనుంచీ, క్యాన్సర్ల బారినుంచీ రక్షిస్తుంది. వృద్ధాప్యం దరిచేరకుండా నిత్యయవ్వనంతో ఉండేలా చేస్తుంది. * నియాసిన్‌ లోపం కారణంగా వచ్చే దీర్ఘకాలిక డయేరియా బాధితులకీ వేరుసెనగ మంచిదేనట. మేకపాలలో కాస్త నిమ్మరసం పిండి తాగి ఓ గుప్పెడు వేయించిన పల్లీలు తింటే ఈ వ్యాధి తగ్గుతుందట. * తాజా పచ్చి పల్లీలకు చిటికెడు ఉప్పురాసి తింటే చిగుళ్లు గట్టిబడి దంతాల్ని సంరక్షిస్తాయి. మాంసకృత్తుల తో పాటు ->
  • కాల్సియం ,
  • ఫాస్పరస్ ,
  • ఇనుము ,
  • జింక్ ,
  • బోరాన్ ,
  • విటమిన్ ఇ ,
  • రేస్వేరప్రాల్ (resweraprol)-anti oxydent
  • పోలి ఫెనాల్స్ , ..
ఉంటాయి . ఇవన్నీ శరీరానికి మేలు చేస్తాయి .
కీడు చేసేవి :-> కొవ్వు పదార్ధము ఎక్కువగా ఉంటాయి . 70% సాచ్యురేటెడ్ , 15% పోలి అన్సాచ్యురేటెడ్ , 15% మోనో ఆన్సాచ్యురేటెడ్ ... ఉన్నాయి మోనో ఆన్ సాచ్యురేటెడ్ కొవ్వులే శరీరానికి మేలు చేస్తాయి . మిగతావి పెద్దవారిలో కీడు చేస్తాయి . చిన్నపిల్లల విషయంలో పెరుగుదలకు దోహదపడతాయి . వేరు శేనగలో ఎలర్జీ ని కలుగజేసే గుణము ఉన్నందున తినే ముందు ఆలోచించి తినాలి . తిన్న వెంటనే ఎలర్జీ లక్షణాలు కనిపిస్తాయి . వీరికి వేరుశెనగ నూనె కుడా పడదు . జాగ్రత్తలు : పల్లీలు అందరికీ పడతాయని కూడా చెప్పలేం. వేయించిన పల్లీలు కొందరిలో అలర్జీకి కారణం కావచ్చు. అలాంటివాళ్లు వీటికి కాస్త దూరంగా ఉండటమే మంచిది. నిజానికి వీటి వాడకం భారత్‌, చైనాల్లోనే ఎక్కువ. కానీ ఈ దేశాల్లో వీటివల్ల అలర్జీలు రావడం చాలా అరుదు. కానీ ఉత్తర అమెరికా దేశాల్లో మాత్రం కాస్త ఎక్కువే. వేయించి తినడమే ఇందుకు కారణమని ఓ అధ్యయనంలో తేలింది. రిఫైన్‌ చేసిన వేరుసెనగ నూనెతో పోలిస్తే ముడి నూనె ఎక్కువగా అలర్జీలకు కారణమవుతుంది. అతి సర్వత్ర వర్జయేత్‌ అన్నది తెలిసిందే. వీటిని మరీ ఎక్కువగా వాడితే శరీరంలో ఆమ్లగుణం పెరుగుతుంది. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవాళ్లు తక్కువగా తినాలి. వీళ్లు కాస్త ఉప్పునీళ్లలో ఉడికించి తింటే అంతగా సమస్య ఉండదు. అలాగే గ్యాస్త్ట్రెటిస్‌, కామెర్లు ఉన్నవాళ్లు కూడా వీటిని ఎక్కువ వాడకూడదు. అజీర్తికీ హైపర్‌ఎసిడిటీకీ కారణమవుతాయి. పెరిగేదశలో లేదా నిల్వచేసే సమయంలో గింజలకి యాస్పర్‌జిలస్‌ ఫ్లేవస్‌ అనే ఫంగస్‌ సోకే అవకాశం ఉంది. ఇది ఎఫ్లోటాక్సిన్‌ అనే విషరసాయనాన్ని ఉత్పత్తిచేస్తుంది. ఇది రకరకాల క్యాన్సర్లకు దారితీస్తుంది. అందుకే వీటిని కొనేటప్పుడూ నిల్వచేసేటప్పుడూ చాలా జాగ్రత్త వహించాలి. ఏమాత్రం ఫంగస్‌ సోకినట్లున్నా వాడకూడదు. అయితే అమెజాన్‌ అడవుల్లో అబౌర్‌ ఇండియన్లు సంప్రదాయ పద్ధతుల్లో పండించే అడవి వేరుసెనగలకు ఎలాంటి ఫంగస్‌ బెడదా ఉండదు. అందుకే వీటిని ఆర్గానిక్‌ పీనట్స్‌ అంటున్నారు. ఉపయోగాలు * వేరుశనగ విత్తనాల నుంచి లభించే నూనె వంటకాలలో ఉపయోగిస్తారు. దీనినుంచి డాల్డా లేదా వనస్పతిని తయారుచేస్తారు. * ఈ నూనెలను సబ్బులు, సౌందర్యపోషకాలు, కందెనలుగా వాడతారు. * వేరుశనగ విత్తనాలు బలమైన ఆహారం. వీటిల్లో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. * నూనె తీయగా మిగిలిని పిండిని ఎరువుగా, పశువులకు, కోళ్ళకు దాణాగా వాడతారు. Nutritional Value of Peanuts
  • Value per 100 grams (Groundnuts)
  • Water-----------6.50gm
  • Energy----------567kcal
  • Energy----------2374Kj
  • Protein----------25.80g
  • Fat---------------49.24g
  • Carbohydrate--16.13
  • Fibre------------8.5 gm
  • Sugar, total----3.97gm
  • Calcium--------93 mg
  • Iron-------------4.58mg
  • Magnesium----168mg
  • Phosphorus----376mg
  • Potassium------705mg
  • Sodium---------18mg
  • Zinc-------------3.27mg
  • Copper---------11.44mg
  • Manganese-----1.934mg
  • Selenium-------7.2 mcg
శాస్త్రీయ వర్గీకరణ(వికీ పెడియ నుండి )
  • సామ్రాజ్యము:-----ప్లాంటే
  • విభాగము:-------Magnoliophyta
  • తరగతి:---------Magnoliopsida
  • వర్గము:---------Fabales
  • కుటుంబము:-----ఫాబేసి
  • ఉపకుటుంబము:--Faboideae
  • Tribe:--------Aeschynomeneae
  • ప్రజాతి:---------అరాఖిస్
  • జాతి:----------అ. హైపోజియా
- డా.శేషగిరిరావు .యం.బి.బి.యస్. .. శ్రీకాకుళం .

No comments:

Post a Comment