Wednesday, December 23, 2009

ఉసిరి ,Amla

కాలం కదిలే కడలితరంగము . కాలము ఒక నిరంతర ప్రవాహము ... నిరంతర ప్రస్తానము . పరుగులు తీసే కాలం తో మారే ఋతువులు మనోహరము . కాలానికి అనుగుణం గా ప్రక్రుతి లో అనేక రకాల పండ్లు , కాయలు , ఆకుకూరలు , దుంపలు తినేందుకు లబిస్తూ ఉంటాయి . ఆయా సీజన్లలో దొరికే వాటిని తప్పకుండా తినడమే ఆరోగ్యానికి చాలా మంచిది . .. అదే ప్రక్రుతి వైద్యము . పండ్లు , కాయలు , ఆకుకూరలు , దుంపలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో సహా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం .

  • ఉసిసి
దీని శాస్త్రీయనామం ఫిలాంథస్‌ ఎంబ్లికా(Phyllanthus emblica). ఇది ఫిలాంథిసియా కుటుంబానికి చెందిన వృక్షం. ఇది మరీ పెద్దగా, మరీ చిన్నగా కాకుండా మీడియంగా ఎదిగే చెట్టు. సుమా రుగా 8 నుంచి 18 అడుగుల ఎత్తువరకు పెరుగుతుంది. ఈ చెట్టు ఆకులు చిన్నవిగా, ఆకుపచ్చ రంగులో ఉండి, కొమ్మలు విస్తరిం చి ఉంటాయి. దీని పువ్వులు పసుపు, ఆకు పచ్చ రంగుల సంమ్మేళనంతో కూడి ఉంటా యి. దీని కాయలు కూడా అదే రంగులో ఉండి, 6 నిలువుగీతలు కలిగివుంటాయి. ప్రతి కొమ్మకి అధికసంఖ్యలో ఉసిరి కాయలు కాస్తాయి. వైద్య పరంగా ఉసిరిక ఎన్నో ఔషధగుణా లున్న వృక్షం. ఆయుర్వేదంలోను, యునానీ ఔషధాల్లో విరివిగా వాడతారు. అలాగే ఈ చెట్టు కాయలు, పువ్వులు, బెరడు, వేరు అన్నీ సంపూర్ణ ఔషధగుణాలు కల భాగాలే. విటమిన్‌ 'సి' పుష్కలంగా ఉన్న ఉసిరి, జుట్టుకి మంచి ఔషధంగా ఉపయోగపడు తుంది.

జుట్టు రాలడం, తెల్లబడడం, చుండ్రు లాంటివి రాకుండా కాపాడుతుంది. అందుకే తలనూనెల కంపెనీలు ఆమ్లా హేరాయిల్స్‌ తయారీలో నిమగ్నమై ప్రపంచ వ్యాప్తంగా సరఫరాచేస్తున్నారు.
అంతేకాక హెమరైజ్‌కి, మెన్‌రేజియా, లుకోమియా వ్యాధులకి, గర్భసంచిలో రక్త స్రావాన్ని అరి కట్టడానికి ఔషధంగా వాడతారు.
దీని నుండి తయారుచేయబడిన నూనెని చాలా మంది నిత్యంవాడుతూ వుంటారు. తల భారాన్ని, తలపోటుని నిరోధించి, మెదడుకి చల్ల దనాన్ని ఇస్తుంది. సౌందర్యసాధనాల తయారీ లో, వంటకాలలో, మందుల్లో, ఇతరత్రా ఎన్నో విధాలుగా వినియోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. నిజానికి ఈ సంపద అధిక భాగం మన భారతదేశానిదే అని చెప్పవచ్చు. ఇతర దేశాల్లో అక్కడక్కడా కొద్దిపాటిగా ఈ వృక్ష సంతతి వృద్ది చెందింది. భారతీయులు సాంప్రదాయరీతిలో దీనిని పూజిస్తారు.
దీనితో ఊరగాయలు పెట్టి ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నారు. ఇంకుల తయారీలో, షాంపూల తయారీల్లో సాస్‌లు, తలకి వేసు కునే రంగుల్లో, కూడా దీనిని విరివిగా వాడు తున్నారు.
దీనితో తయారుచేసిన ఆమ్లా మురబా తింటే వాంతులు, విరేచనాలు తగ్గి ఎంతో ఉపశమనం చేకూరుతుంది. ఉదర సంబంధవ్యాధులకి ఎక్కువగా వాడతారు. దీనితో తయారైన మాత్రలు వాడటం వలన వాత, పిత్త, కఫ రోగాలకి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. అత్యధిగంగా ఎగుమతి అవుతు న్న ఆమ్లా ఉత్పత్తులు ప్రపంచమార్కెట్లో అధిక లాభాల్ని అర్జింస్తున్నాయి. ఈ ఉసిరిని నిత్యం అన్ని రకాలుగా వినియోగించుకుంటే, మనిషికి సంపూర్ణ శక్తిని ప్రసాదిస్తుందన డంలో ఎంత మాత్రం అతిశయోక్తికాదు. ఉప్పు లో ఎండ బెట్టిన ఉసిరిని నిల్వచేసుకుని ప్రతిరోజు ఒక ముక్క బుగ్గన పెట్టుకుని చప్ప రిస్తూవుంటే, జీర్ణశక్తి పెరుగుతుంది. అజీర్తి రోగాన్ని నిర్మూలిస్తుంది, ఎసిడిటీ, అల్సర్‌ వంటి వ్యాధులు సంక్రమించకుండా కాపాడు తుంది. అసలు ప్రతి ఇంటిలో ఒక ఉసిరిని పెంచమని శాస్త్రజ్ఞులు అంటున్నారు. భార తీయ వాస్తుశాస్త్రంలో కూడా దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇంటి పెరటిలో గనుక ఉసిరి చెట్టు ఉంటే, ఆ ఇంటి వాస్తుదోషాలు ఏవి ఉన్నా హరిస్తుందని జ్యోతిషశాస్త్రం, వాస్తుశాస్త్రం వక్కాణిస్తున్నాయి. . ఉసిరి కాయను ఆంగ్లంలో The Indian gooseberry (Phyllanthus emblica, syn. Emblica officinalis), అనీ, హిందీలో "ఆమ్ల' అనీ, సంస్కృతంలో "ఆమలక" అనీ అంటారు. ఉప్పు రుచి తప్పించి మిగిలిన ఇదు రుచులను కలిగి ఉంది . అత్యధికం గా "సి " విటమిన్ ఉంటుంది . రోగనిరోధక శక్తి పెంచుతుంది . రాసాయనికము గా రారింజలో కన్నా ఉసిరి లో ౨౦ రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది . యాన్తి ఆక్షిదేంట్లు , ఫ్లవనాయిడ్లు , కెరోటినాయిడ్స్ , టానిక్ ఆమ్లం , గ్లూకోజ్ ,కాల్సియం , ప్రోటీన్లు దీనిలో లభ్యమవుతాయి.
  • ఉపిరి తిత్తులు ,కాలేయం , జీర్ణమండలం , గుండె -దీని పరిదిలోనికి వస్తాయి .
జీర్ణమండలం :
  • దాహం ,మంట,వాంతులు ,ఆకలిలేకపోవుట ,చిక్కిపోవుట ,ఎనీమియా ,హైపర్ -ఎసిడిటి , మున్నకు జీర్ణ మంటాడ వ్యాదులను తగ్గిస్తుంది .
ఉపిరితిత్తులు :
  • ఆస్తమా ,బ్రాంకైటిస్ ,క్షయ ,శ్వాసనాలముల వాపు , ఉపిరితిట్టులనుండి రక్తము పడుట మున్నగు వ్యాదులను నయం చేస్తుంది .
గుండె :
  • ఎన్నో రకాల గుండె జబ్బులను నయం చేస్తుంది .
  • ఉసిరి వళ్ళ ఆహారములోని ఇనుము ఎక్కువగా గ్రహించాబడుతకు తోడ్పడుతుంది .
  • శరీరము లో ఎక్కువగా ఉండే కొవ్వులను తగ్గిస్తుంది .
కాలేయము :
  • కామెర్లు ఉసిరి లోని 'లినోయిక్ ఆసిడ్ 'వాళ్ళ తగ్గుతాయి .
  • కాలేయం లో చేరిన మలినాలు , విశపదార్ధాలు ను తొలగిస్తుంది , 'యాంటి ఆక్షిడెంట్' గా పనిచేస్తుంది .
  • అందాలకు... సిరి

    ఉసిరి.. విటమిన్‌ 'సి' నిండుగా అందించే పోషకంగా మనందరికీ తెలుసు. ఆహారంగానే కాదు చర్మం, జుట్టు అందానికీ ఇదెంతో ఉపయోగపడుతుంది. ఇలా ప్రయత్నించండి..

* ముఖంపై ముడతలతో చాలామంది తమ వయసుకంటే పెద్దవారిగా కనిపిస్తారు. ఇలాంటివాళ్లు టేబుల్‌ స్పూన్‌ ఉసిరి పొడిలో చెంచా పెరుగు, కోడిగుడ్డు తెల్లసొన కలిపి ఆ మిశ్రమంతో ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. కనీసం రెండు మూడురోజులకోసారి చేస్తుంటే ముఖంపై ముడతలు తగ్గిపోతాయి.

* రోజంతా ఎండ, దుమ్ము ధూళి కారణంగా చర్మంపై నలుపుదనం పెరుగుతుంది. గరుకుగా తయారవుతుంది. ఉసిరి రసం ముఖానికి రాసి పదినిమిషాలాగి గోరువెచ్చని నీళ్లతో శుభ్రంచేసుకోవాలి. మీది మరీ సున్నిత చర్మతత్వం అయితే కొంచెం తేనె కలిపి రాసుకున్నా సరిపోతుంది. ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ గ్రంథుల్ని శుభ్రపరుస్తాయి.

* మొటిమల సమస్యతో బాధపడుతున్నవారు ఉసిరిపొడిలో చెంచా పెసరపిండి, చెంచా నిమ్మరసం, కాసిని పాలు కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని పావుగంటాగి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకోసారి చేస్తుంటే మొటిమల సమస్య దూరమవుతుంది.
* కాలుష్యం, కఠిన రసాయనాల వాడకం వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి. ఉసిరిలో ఉండే విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు కుదుళ్ల వృద్ధికి తోడ్పడతాయి.

* మాడు పొడిబారడం, చుండ్రు సమస్యలున్నాయా? ఉసిరిపొడి మజ్జిగలో నానబెట్టి దానికి కోడి గుడ్డు తెల్లసొన, చెంచా బాదం నూనె జత చేసి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. అరగంటాగి మృదువైన షాంపూతో తలస్నానం చేస్తే సరి.
  • ===========================
visit my website : dr.seshagirirao.com

No comments:

Post a Comment