- వీటిలో శరీరం లో తైలం అధికముగా ఉండేవి ఒక రకము -- >సాల్ మన్ , మాక్రెల్ , ట్యూనా , హెర్రింగ్ , సార్డినెస్ మున్నగునవి .వీటిలో తైలము ఎక్కువ & విటమిను ' ఎ , డి , ఒమెగా ఫ్యాటీయాసిడ్స్ అధికము గా ఉంటాయి .
- రెండో రకము ... వైట్ ఫిష్ -> వీటిలో తైలము తక్కువ ., ప్రోటీన్లు అధికంగా ఉంటాయి ఒమెగా ఫ్యాటీయాసిడ్స్ తక్కువగా ఉంటాయి . వీటిని తినడము వల్ల ఆరోగ్యము మెరుగవుతుంది .
- మూడోరకము -- > నిజానికి చేపలు కావు , అవి రొయ్యలు , పీతలు , ఆల్చిప్పలు వంటివి . వీటిలో ' సెలీనియం ,జింక్ , అయోడిన్ , కాపర్ వంటివి చాలా ఎక్కువగా లభిస్తాయి . మానవుని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి .
- Fish -------Calories ---TotalFat ---Saturated---Protein ---Cholesterol
- Ocean-----110 --------2g -----------0g ------------21g----------50mg
- పోషకవిలువలు..
- Updates :
- అయితే చేపలను బోలెడంత నూనె పోసి వండితే ఈ ప్రయోజనాల కంటే ముప్పు ఎక్కువ. తక్కువ నూనెతో వండుకోవటం చాలా అవసరం.
- చేపలు.. పెద్దపేగుకు మేలు
- చేప రకాలు-చేప గుండె ఆరోగ్యానికి మంచిది.
చేప తినదలచుకుంటే కొరమీనే తినాలి. బొమ్మిడాల పులుసు తింటే లొట్టలేయాల్సిందే. చందువా... ఆ రుచే వేరు. పుస్తెలమ్మయినా పులస తినాల్సిందే. ...వినాలేగానీ ఇలా చేపల రుచుల్ని వర్ణిస్తూనే ఉంటారు భోజనప్రియులు. చూడ్డానికి ఒకేలా కనిపించినా చేపల్లో రకాలెన్నో... రుచులకు లెక్కే లేదు.
చేపల్లో పోషకాలెన్నో ఉంటాయనీ, ఆరోగ్యానికి మంచిదనీ ముఖ్యంగా మెదడు పనితీరుకు మరీ మంచిదనీ అంటారు. అయితే అన్ని చేపల్లోనూ ఒకేలాంటి పోషకాలూ ఉండవు. అలాగే అవన్నీ కూడా ఒకే రుచితోనూ ఉండవు. అవి పెరిగే పరిసరాలూ అవి తీసుకునే ఆహారమూ వాటి రుచినీ పోషకాలనీ కూడా ప్రభావితం చేస్తాయి.
చేపల్లో సముద్ర చేపలు వేరు... అనడం వినే ఉంటారు. మంచినీటి చేపలు ఎముక నిర్మాణం కలిగి ఉంటే, సముద్ర చేపలు మృదులాస్థితో ఉంటాయి. సముద్ర చేపల్లో మైక్రో న్యూట్రియంట్లూ, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలూ ఎక్కువ. మంచినీటి చేపల్లో అవి తక్కువ. ఆక్వా ఫిష్ కన్నా సీఫుడ్ ఆరోగ్యానికి ఎంతో మంచిది అనేది అందుకే. విటమిన్లూ ఖనిజాలూ ఏ చేపలోనయినా పుష్కలమే. ఆహారంలో భాగంగా చేపలు తినేవాళ్లకి క్యాన్సర్లూ హృద్రోగాలూ కీళ్లనొప్పులూ రావు. ఒమేగా ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపల రకాలను వారానికి రెండుసార్లయినా తినమని సూచించింది బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్. దీనివల్ల హృద్రోగాల సంఖ్యని ముందుగానే నివారించవచ్చు. ఈ ఫ్యాటీఆమ్లాలు ట్రై గ్లిజరైడ్లు అనే కొవ్వుల శాతాన్ని తగ్గిస్తాయి. దాంతో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం తగ్గుతుంది.
* పాలీ అన్‌శాచ్యురేటెడ్ ఆమ్లాలు బీపీని తగ్గిస్తాయి. మెదడు కణాలు దెబ్బతినకుండా చేస్తాయి. ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు సెరటోనిన్ స్రావాన్ని పెంచి డిప్రెషన్‌ను తగ్గిస్తాయి. బీపీనీ తగ్గిస్తుంది. వారానికోసారి చేపల్ని తినేవాళ్లలో మతిమరుపూ తగ్గుతుంది. ప్రొస్టేట్ క్యాన్సర్ రాదట.
* ప్రోటన్లతోపాటు ఇతర మైకోన్యూట్రియంట్లూ చేపల్లో ఎక్కువే. వీటిల్లో జింక్ సమృద్ధిగా దొరుకుతుంది. ముఖ్యంగా చిన్నచేపల్లో కాల్షియం, ఎ-విటమిన్, జింక్ శాతం ఎక్కువ. అందుకే బంగ్లాదేశ్‌లో చిన్నచేపల రకాలకోసం 13 లక్షల చెరువులు తవ్వించారట.
* చేపల్ని చాలా ఎక్కువగా తినడంవల్ల గ్రీన్‌ల్యాండ్ వాసుల్లో చూద్దామన్నా ఆర్థ్రెటిస్ కనిపించదు. చేపనూనెలవల్ల రుమటాయిడ్ ఆర్థ్రెటిస్ తగ్గిన దాఖలాలూ ఎక్కువే.
- బొచ్చెయితేనేం...
- బొచ్చె, కృష్ణబొచ్చె... ఇలా రకరకాల పేర్లతో పిలిచే ఈ రకమే మనదగ్గర వాడుక ఎక్కువ. ఎందుకంటే సామాన్యులకీ అందుబాటు ధరలో ఉండేది ఇదే. మంచినీటి చేప. ముళ్లు ఎక్కువగా ఉన్నా రుచికరంగా ఉండే ఈ చేపలో పోషకాలూ ఎక్కువే. ఈ చేప ప్రొటీన్ల నుంచి ఆరోగ్యానికి ఉపయోగపడే ఎంజైమ్‌లనూ రూపొందిస్తున్నారు.
- నెత్తలా మెత్తలా
- నెత్తల్నే చాలాచోట్ల మెత్తళ్లు, మెత్తలు అని పిలుస్తారు. చిన్న సైజులో ఉండే ఈ చేపల్ని ఎక్కువగా ఎండబెట్టి చింతచిగురుతో కలిపి వండుతారు. గోదావరి జిల్లాలో అయితే అన్ని కూరగాయల్లోనూ వీటిని వేస్తుంటారు. కొన్ని కుటుంబాల్లో మెత్తళ్లులేని కూరతో ముద్ద కూడా మింగనివాళ్లూ ఉంటారంటే అతిశయోక్తి కాదు. చిన్నవే అయినా వీటిల్లో పోషకాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలూ కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, బి6, బి12, నియాసిన్.. వంటి వన్నీ ఎక్కువే. అయితే వీటిని ఉప్పు వేసి ఎండబెట్టి నిల్వ చేయడం వల్ల బాగా నానబెట్టి కడిగి వాడితే మంచిది.
- వారెవ్వా... పండుకొప్ప
- పండుకొప్పగా పిలిచే ఈ చేప పేరు బర్రముండి. బెంగాలీయులు అత్యంత ఇష్టంగా తినే ఈ చేపకు మనదగ్గరా డిమాండ్ ఎక్కువే. ఖరీదైన చేపల్లో ఇదీ ఒకటి. బెంగాలీ విందుభోజనాల్లో ఇది తప్పక వండాల్సిందే. ఉప్పునీటిలోనూ మంచినీటిలోనూ పెరిగినప్పటికీ ఉప్పునీటి చేపే రుచి. అందుకే దానికే డిమాండ్ ఎక్కువ. పుట్టాక కొంతకాలం మగచేపలుగా ఉండి తరవాత ఆడచేపలుగా మారిపోవడం వీటి ప్రత్యేకత.
- భళారే... కొరమీను!
- అచ్చంగా మంచినీటిలో మాత్రమే పెరిగే ఈ చేప తల పాముని పోలి ఉంటుంది. అందుకే దీన్ని స్నేక్ హెడ్ ఫిష్ అంటారు. ఒకటే ముల్లు ఉండే ఈ చేప రుచిలోనే కాదు, పోషకాల్లోనూ మేటే. పులుసయినా వేపుడయినా ఏదయినా అదుర్సే. అందుకే ఇదంటే అంత ఇష్టం. వీటిల్లో మగ, ఆడ రెండూ కూడా సీజన్‌లో నీటి అడుగున గూడు కట్టి గుడ్లను పెట్టి పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడతాయి. శస్త్రచికిత్సానంతరం ఈ చేపను తినడంవల్ల గాయం త్వరగా మానుతుందని అంటారు.
- బొమ్మ చేప చాలు!
- బొమ్మిడాలనే బొమ్మచేప అనీ పిలుస్తారు. చింతకాయతో చేసే దీని పులుసు అదుర్స్. పొడవాటి వేలు సైజులో చిన్నసైజు పాముల్ని తలపిస్తుంటాయివి. ముందుకు పొడుచుకు వచ్చినట్లున్న మూతితో సన్నగా ఉండే ఈ చేపల్లో ఒకటే ముల్లు(సన్నని వెన్నెముక) ఉంటుంది. మగచేపలు మరీ సన్నగా ఉంటాయి. పోషకభరితమైన ఈ చేప మాంసానికి గాయాల్ని తగ్గించే గుణం ఎక్కువ.
- చందువా... ఆ రుచే వేరు
- తెల్ల చందువా: దీన్నే వైట్ పాంఫ్రెట్ అనీ బటర్ ఫిష్ అనీ పిలుస్తారు. పోషకాలతోపాటు రుచిపాళ్లూ ఎక్కువే. ధర కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. చైనా సంప్రదాయ వైద్యంలో ఎక్కువగా వాడే ఈ చేప జీర్ణకోశానికి ఎంతో మంచిది. విటమిన్ ఎ, బి3, డి, ఇ విటమిన్లు ఇందులో ఎక్కువ. చర్మం ముడుతలు పడినా కళ్లకింద నల్లగా ఉన్నా దీన్ని తినడంవల్ల ఫలితం కనిపిస్తుంది. అయితే మనదగ్గర హిందూ, పసిఫిక్ మహాసముద్రాల్లో దొరికే నల్ల చందువానే ఎక్కువ. రెండింటిలో పోషకవిలువల్లో తేడా ఉండదు.
- ఇది నూనె చేప--
- సార్త్డెన్(నూనెకవ్వలు)గా పిలిచే ఈ చేపలో ఔషధగుణాలు చాలా ఎక్కువ. బీపీ తగ్గుతుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాల శాతం చాలా ఎక్కువ. ఈ చేప ప్రొటీన్లు జీవక్రియ వేగాన్ని పెంచి క్యాలరీలను కరిగిస్తాయనీ అందుకే బరువు తగ్గాలనుకునేవాళ్లకి మంచిదని చెబుతారు. డయాబెటిస్‌వాళ్లకూ ఇది మంచిదే. జ్ఞాపకశక్తికీ మెదడు పనితీరుకీ ఎంతో మేలు. ఓ చిన్న చేపనుంచి నాలుగైదు గ్లాసుల పాలల్లో లభించే కాల్షియం లభిస్తుంది. జీర్ణక్రియకు అవసరమైన ఎంజైములూ ఎక్కువే. చర్మసౌందర్యమూ పెరుగుతుంది. ఎండబెట్టి తినడంవల్ల వీటిల్లోని పోషకాలు నాలుగురెట్లు పెరగడంతోబాటు రుచీ అద్భుతం అంటారు పోషక నిపుణులు. పిల్లల పెరుగుదలకి ఎంతో మంచివన్న కారణంతో ఎండబెట్టిన చేపల పొడిని ఇతర ఆహారపదార్థాలమీదా చల్లుకుని తింటుంటారు పాశ్చాత్యులు.
- పులస... ఒక్కసారైనా తినాల్సిందే
- పులస... ఈ పేరు చెబితే చాలు, గోదావరి జిల్లాల వాసులు లొట్టలేసేస్తారు. దీనికన్నా రుచికరమైన చేప లేనేలేదంటూ పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే అని తెగేసి చెప్పేస్తారు. వర్షాకాలంలో వరదనీటిలోనే ఆగస్టు, సెప్టెంబరు నెలల్లోనే ఇది ఎక్కువగా దొరుకుతుంది. గోదావరికి వరద పోటెత్తే సమయంలో వరదనీరు సముద్రంలో కలిసే చోట ప్రవాహానికి ఎదురీదుతూ గోదావరీ జలాల్లోకి వస్తుంది పులస. సుదూర తీరాల నుంచి ఖండాలు దాటి మహా సముద్రాలు దాటి బంగాళాఖాతం ద్వారా గోదావరిలోకి వచ్చి గుడ్లు పెడుతుందీ చేప. దీని శాస్త్రీయ నామం టెన్యులోసా ఇలిషా. అందుకే దీన్ని ఇలిష్, ఇలస అని కూడా పిలుస్తారు. అయితే ఇలసగా ఉన్నప్పుడు సన్నగా బలహీనంగా ఉండే ఈ చేప, గోదావరి జలాల్లోకి రాగానే, ఆ నీటిలో ఉండే రకరకాల ఖనిజాలనూ నాచుల్నీ తిని బలంగా తయారై గుడ్లు పెట్టి, మళ్లీ అక్టోబర్ నాటికి సముద్రాన్ని చేరుకుంటుంది. అంటే సముద్రంలో ఉన్నప్పుడు ఇలసగా ఉండే ఈ చేప, గోదావరిలోకి రాగానే పులసగా మారుతుందన్నమాట. ఆ సమయంలో దీని శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. శరీరం వెండిలా మెరుస్తుంది. అందుకే పులస అంత రుచి. అప్పుడే మన జాలర్లు వలేసి దీన్ని పట్టేస్తారు. చేప పరిమాణాన్ని బట్టి రెండు వేల నుంచి ఆరు వేల రూపాయల ధర పలుకుతుంది. అయితే ఇలస, పులస... ఏ రూపంలో ఉన్నా ఈ చేపలోని ఫ్యాటీఆమ్లాలకు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉంది. ఇందులో ఇతర పోషకాలూ ఎక్కువే.
- సాల్మనా మజాకానా
- ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యంత ఆరోగ్యకరమైన ఆహారంలో ఒకటిగా గుర్తించిన ఈ చేపలో పసిఫిక్, అట్లాంటిక్ అని ప్రధానంగా రెండు రకాలు. దారిలో ఎదురయ్యే ఎన్నికష్టనష్టాలనయినా ఓర్చుకుంటూ గుడ్లు పెట్టేందుకు తాము పుట్టినచోటుకే అంటే సముద్రంలోంచి నదుల్లోకి వస్తాయి. అప్పుడే అవి రంగు మారతాయి. ముందుగా ఆడచేపలు గుడ్లు పెడతాయి. మగచేపలు వాటిని పిల్లలయ్యేలా చేస్తాయి. తరవాత రెండూ చనిపోతాయి. చేపపిల్లలు మెల్లగా ఈదుకుంటూ సముద్రంలోకి చేరతాయి. మళ్లీ గుడ్లుపెట్టే సమయానికి అవి తిరిగి నదుల్లోకి అదీ పుట్టినచోటుకే వచ్చి గుడ్లు పెట్టి చనిపోతాయి. సాల్మన్‌లో ప్రొటీన్లూ, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలూ, విటమిన్ డి చాలా ఎక్కువ. వీటిల్లో కెరోటినాయిడ్ల కారణంగా లోపల నారింజ నుంచి ఎరుపురంగులో ఉంటాయి. అందుకే వీటిని తింటే చర్మం మెరుపును సంతరించుకుంటుంది. తెల్లమగగా పిలిచే చేపనే ఇండియన్ సాల్మన్ అంటారు. దీనికీ సాల్మన్ జాతికీ సంబంధమే లేదు. రవ్వ అని కూడా పిలుస్తారు. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఇందులోనూ పుష్కలమే.
ఇవి మాత్రమేనా... చెరువులు, కాలవలు, వాగులు, నదుల్లో బొచ్చెతోపాటు రోహ(శీలావతి), ఎర్రమట్ట, కోయంగ, మోసు, వాలుగ, పాలబొంత, వంజరం... వంటి చేపలు చాలానే దొరుకుతాయి. సామాన్యులకు ఎక్కువ అందుబాటులో ఉండేవి ఇవే మరి. ఇంకా మట్టగడిశ, వానమట్ట, సవ్వలు, టేకుచేప, కట్టిపరిగ, పిత్తపరిగ... ఇలా ఎన్నో రకాలు...మరెన్నో పోషకాలు..!
- courtesy with Eenadu news paper sunday magazine 07/09/2014
- ========================================
పులస చేప ప్రియులకు శుభవార్త!
ReplyDeleteమీకోసం ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డరు చేసుకొనే విధంగా ఇంటికే తీసుకువచ్చే ఒక వెబ్ సైట్ వచ్చింది
ఒకసారి చూసి మీరూ ఆర్డర్ చేయండి pulasafish.com