అన్నం మనం సాధారణంగా రోజూ భుజించే ఆహారము. వరి ధాన్యం నుండి వేరుచేసిన బియ్యం నీటిలో ఉడికించి అన్నాన్ని తయారుచేస్తారు. పుట్టిన పిల్లలకు మొట్టమొదటి సారిగా అన్నం తినిపించడం తెలుగు వారు అన్నప్రాసన పండుగలాగా జరుపుకుంటారు.
అన్నంలో పిండిపదార్థాలు అధికం కాబట్టి ఎక్కువగా తింటే లావయిపోతామని చాలా మంది అనుకుంటారు. కానీ బరువు పెరిగేది కార్బోహైడ్రేట్ల వల్ల కాదు. శరీరంలో అదనంగా పేరుకుపోయే క్యాలరీల వల్ల. శరీరానికి శక్తినిచ్చేది పిండిపదార్థాలే. మెదడు, కండరాలు, కణాల ఆరోగ్యం బాగుండాలంటే అది పిండిపదార్థాల వల్లే సాధ్యం. ఇంకా చెప్పాలంటే... చైనా, జపాన్, ఫిలిప్పీన్స్ దేశాల ప్రజల ప్రధాన ఆహారం అన్నమే. కానీ ప్రపంచ ఆరోగ్యసూచి ప్రకారం వాళ్లల్లో వూబకాయం శాతం చాలా తక్కువ. అన్నంలో గంజి శాతం ఎక్కువగా ఉండటం వల్ల అది ఒక పొరలాగా పనిచేసి పెద్దప్రేగు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. పాలిష్ పట్టని బియ్యంలో పీచుపదార్థం అధికంగా ఉండి మలబద్ధకాన్ని నివారిస్తుంది. 100గ్రాముల అన్నంలో ఏమేం ఉంటాయంటే...
Nutrition Facts
Serving Size 1 cup (174.0 g)
Calories-169 -----------Calories from Fat-3
Total Fat-0.3g 1%
Saturated Fat-0.1g 0%
Polyunsaturated Fat-0.1g
Monounsaturated Fat-0.1g
Cholesterol-0mg -0%
Sodium-9mg-0%
Total Carbohydrates-36.7g-12%
Dietary Fiber-1.7g-7%
Sugars-0.1g
Protein-3.5g
Vitamin A 0% • Vitamin C 0%
Calcium 0% • Iron 1%
- =================================================
Visit my Website -
Dr.Seshagirirao
No comments:
Post a Comment