పండ్లు , కాయగూరలు ,గింజలు పప్పులు , కందమూలాలు , మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము
.ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో అవసరం లేకుండా
ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే
శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.
చెరకు రసం
పిల్లాపెద్దల నోరూరించే చెరకు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఇందులో పొటాషియం అధికం. ఇది లాక్సేటివ్‌గా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి తో పాటు బి2 (రైబోఫ్లావిన్) పుష్కలంగా అందుతుంది. అదనంగా మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, పాస్ఫరస్‌లు సమృద్ధిగా ఉంటాయి. కెలొరీలు తక్కువ.. పోషకాలెక్కువ.
రుచితో పాటు అందుబాటులో కూడా ఉండే ఈ చెరకు రసంలో కార్బోహైడ్రేట్లు అపారం. తక్షణ శక్తినందించడం దీని ప్రత్యేకత. కొద్దిగా నిమ్మరసం, ఉప్పు మేళవించి చేసే చెరకు రసంలో పోషకాలు కూడా అధికంగానే ఉన్నాయి. శీతల పానీయాలు, కోలాలతో పోలిస్తే ఇది నెమ్మదిగా రక్తంలోకి చేరుతుంది. శరీరంలో నీటిస్థాయి పడిపోకుండా జాగ్రత్తపడుతుంది. మూత్ర సంబంధిత ఇబ్బందులతో బాధపడే వారికి చెరకు రసం చక్కని పరిష్కారం.
- శక్తి: 398కి.కెలొరీలు;
- మాంసకృత్తులు: 0.1గ్రా;
- కార్బోహైడ్రేట్లు: 99.4గ్రా.
- ===========================================================
Visit my Website -
Dr.Seshagirirao
No comments:
Post a Comment