వంద గ్రాముల వండ్లలో పోషకాలు
- పిండి వదార్థం - 19 గ్రా,
- వీచు వదార్థాలు - 3 గ్రాములు,
- చక్కెర - 16 గ్రాములు,
- కొవ్వు - 0.3 గ్రాములు,
- ప్రొటీన్లు - 0.8 గ్రా,
- విటమిన్ 'బి6' - 110 గ్రా,
- శక్తి - 70 కిలో.కె.
- పిండివదార్థాలు - 84 గ్రాములు,
- చక్కెర - 48గ్రాములు,
- వీచువదార్థం - 10 గ్రాములు,
- కొవ్వు -0.3 గ్రాము,
- ప్రొటీన్లు - 3 గ్రాములు.
- డా. చిరుమామిళ్ల మురళీమనోహర్
అత్తి పండు తియ్యని రుచి గల పండు. దీనిని విరిచి తిన వచ్చు. అత్తి పండు విరిచినప్పుడు లోపల సన్నని పురుగులు ఉంటాయి కనుక జాగ్రత్తగా విలించి తింటారు. ఈ పండు రక్త పుష్టి కలిగిస్తుంది. అరోగ్యానికి మేలు కలిగిస్తుంది.
అత్తి పండ్ల చెట్లు దక్షిణ భారతదేశంలో అంతగా కనిపించవు. ఉత్తర భారతదేశంలో విరివిగా కనిపిస్తాయి. అత్తిపండుకు ఆరోగ్యరీత్యా చాలా ప్రాధాన్యత ఉంది. మెత్తగా, తియ్యగా, మధురంగా ఉండే ఈ పండులో అన్నీ మంచి గుణాలే. అన్నీ ఆరోగ్యాన్ని పెంచే లక్షణాలే. అయితే మెత్తగా ఉండటంవల్ల దీనికి పండిన తరువాత త్వరగా చెడిపోయే లక్షణం ఉంటుంది. దీనితో సాధారణంగా దీనిని ఎండబెట్టి డ్రైఫ్రూట్ రూపంలో వాడుతుంటారు. దీనిలో మాంసకృత్తులు, కొవ్వు, పిండి పదార్థాల వంటివి అల్పమోతాదులో ఉంటాయి. పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎండబెట్టిన తరువాత దీనిలో ఔషధ విలువలు పెరుగుతాయి. ముఖ్యంగా చక్కెర శాతం ఎండబెట్టిన పండులో 50నుంచి 75 శాతం వరకూ ఉంటుంది. దీనిని నేరుగా గాని, లేదా ఇతర ఆహార పదార్థాలతో కలిపి గాని తీసుకోవచ్చు. పిండి పదార్థాలను తీసుకోవటంవల్ల మలబద్ధకం ఏర్పడుతుంటే, ఆ పదార్థాలతోపాటు అత్తిపండ్లను కలిపి తీసుకుంటే సరిపోతుంది. అత్తిపండ్లను పాలతో కలిపి తీసుకోవచ్చు. అత్తిపండ్లను కేకుల తయారీలోను, జాముల తయారీలోనూ వాడతారు. దీనిని దీర్ఘవ్యాధులనుంచి త్వరగా కోలుకోవడానికి వాడవచ్చు.
ఎలా వాడాలి?
అత్తి పండ్లను వాడబోయేముందు బాగా కడగాలి. ఎండు పండ్ల తోలు గట్టిగా ఉంటుంది. నానబెట్టినప్పుడు మెత్తబడుతుంది. అయితే, దీనిలోని విలువైన పదార్థాలన్నీ నీళ్లలోకి వెళతాయి. కనుక పండ్లను నానబెట్టిన నీళ్లతోసహా తీసుకోవాలి.
మాత్ర (డోస్): స్వరసం (జ్యాస్) 10-20మి.లీ. గుజ్జు: 5-10 గ్రా.
వివిధ భాగాలు, శాస్ర్తియ అధ్యయనం
పండు: మృధువిరేచకం (ల్యాగ్జేటివ్), ఎక్స్‌పెక్టోరెంట్ (కఫాన్ని పల్చన చేసి వెలుపలకు తెస్తుంది)
పండు గుజ్జు: అనాల్జెసిక్ (నొప్పిని తగ్గిస్తుంది) యాంటిఇన్‌ఫ్లమేటరి (ట్యూమర్స్, గమ్ యాబ్సిస్) (వాపును తగ్గిస్తుంది)
నిర్యాసం (లేటెక్స్): అనాల్జెసిక్ (నొప్పిని తగ్గిస్తుంది), టాక్సిక్ (పులిపిరులు, కీటకాల కాటుకు వాడవచ్చు).
ఆకు: బొల్లిమచ్చలకు వాడవచ్చు.
చెట్టుపట్ట: ఎగ్జిమా, ఇతర చర్మవ్యాధుల మీద పనిచేస్తుంది.
నిర్యాసం (గమ్): యాంజియో టెన్సిన్ 1 కన్వర్టింగ్ ఎంజైమ్‌మీద వ్యతిరేకంగా పోరాడే మూడురకాల పెప్టైడ్‌లను అత్తిపండ్ల నిర్యాసంలో కనుగొన్నారు. ఇవి రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి.
వివిధ వ్యాధుల్లో ప్రత్యేక ప్రయోగ విధానం
వ్రణశోథ: పండును చీల్చి, గుజ్జును వేడిచేసి నోటి చిగుళ్లమీద తయారయ్యే వ్రణం మీద లేపనం మాదిరిగా ప్రయోగించాలి.
మలబద్ధకం: అత్తిపండ్లలో అధిక మొత్తాల్లో సెల్యులోజ్ అనే పదార్థం ఉంటుంది. అలాగే దీనిపైన గట్టి తోలు ఉంటుంది. వీటివల్ల, వీటిని మలబద్ధకంలో వాడవచ్చు. అత్తిపండ్లలో ఉండే చిన్నచిన్న గింజలు పేగుల్లోపలి గోడలను సున్నితంగా ఉత్తేజ పరుస్తాయి. ఫలితంగా పేగుల కదలికలు పెరిగి మలం సజావుగా కిందవైపుకు ప్రయాణిస్తుంది. అలాగే పేగులను శుభ్రంగా ఉంచుతుంది.
అర్శమొలలు: అత్తిపండ్లు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి కనుక వీటిని మూలవ్యాధితో బాధపడేవారు వాడుకోవచ్చు. ఒక ఎనామిల్ పాత్రను వేడి నీళ్లతో శుభ్రపరిచి చన్నీళ్లు తీసుకొని మూడునాలుగు ఎండు- అత్తిపండ్లను రాత్రంతా నానేయాలి. ఉదయం పూట నాని ఉబ్బిన పండ్లను తినాలి. ఇలాగే మళ్లీ రాత్రి పడుకోబోయే ముందు చేయాలి. ఇలా రెండుమూడు నెలలపాటు క్రమం తప్పకుండా చేస్తే మూలవ్యాధి తగ్గుతుంది. మలనిర్హరణ సమయంలో ముక్కాల్సిన అవసరం రాదు. మూలవ్యాధి తీవ్రంగా ఉన్న వారిలో కొంతమందికి పెద్ద పేగు జారే అవకాశం కూడా ఉంది. ఇలాంటి వారికీ ఇది బాగా పనిచేస్తుంది.
ఉబ్బసం: కొంతమందికి శ్వాస మార్గాల్లో కఫం పేరుకుపోయి గాలి పీల్చుకోవటం కష్టమవుతుంది. ఇలాంటివారు అత్తిపండ్లను వాడితే కఫం తెగి శ్వాస ధారాళంగా ఆడుతుంది. అలుపు, అలసటలు తగ్గి శ్వాసకు ఉపకరించే కండరాలు శక్తివంతమవుతాయి.
శృంగారానురక్తి తగ్గటం: అత్తిపండ్లు దాంపత్య కార్యంలో పాల్గొనేవారికి నూతనోత్తేజాన్ని ఇస్తాయి. బలహీనతను పోగొట్టి శృంగారానికి సన్నద్ధం చేస్తాయి. వీటిని నేరుగా గాని లేదా బాదం, ఖర్జూరం వంటి ఇతర ఎండు ఫలాలతోగాని వాడుకోవచ్చు. వెన్నతో కలిపి తీసుకుంటే వీటి శక్తి ఇనుమడిస్తుంది.
ఆనెలు: పచ్చి అత్తిపండ్ల మీద గాటు పెడితే పాల వంటి నిర్యాసం కారుతుంది. దీనిని ఆనెల మీద ప్రయోగిస్తే నెమ్మదిగా ఆనెలు మెత్తబడి పై పొరలు ఊడిపోతాయి. పచ్చి అత్తికాయల నిర్యాసానికి నొప్పిని తగ్గించే తత్వం ఉంది.
నోటిలో పుండ్లు: అత్తిపండ్లనుంచీ కారే పాల మాదిరి నిర్యాసాన్ని స్థానికంగా ప్రయోగించాలి.
శరీరంలో వేడి: బాగా పండిన తాజా అత్తిపండ్లను 2- 3 తీసుకొని మిశ్రీతో కలపాలి. వీటిని రాత్రంతా పొగమంచులో ఆరుబయట ఉంచాలి. ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. దీనిని 15రోజులపాటు చేయాలి.
బలహీనత: చాలామందికి శారీరక బలహీనతవల్ల నోటిలో పుండ్లు, పెదవుల పగుళ్లు, నాలుకు మంట వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటివారు అత్తిపండ్లను తీసుకుంటే హితకరంగా ఉంటుంది.
- =========================================
#సర్, మీ బ్లాగును తరచుగా చదువుతూంటాను. ప్రజలకు మేలైన వివరములను ఇస్తున్నారు. మీ కృషికి ప్రతి వ్యాసామూ దర్పణమే!
ReplyDeleteరాయలసీమలో అత్తి- వాడుక ఉన్నది.
"అత్తి నీరా" ను నడుము నొప్పులకు, ఒళ్ళు నెప్పులకు వాడుతారు. పల్లెలలో వాకిళ్ళలోకి వచ్చి "అత్తి నీరా" ను అమ్ముతారు.
అలాగే "నన్హారీ షర్బత్తు"ను ఆ ప్రాంతాలలో విరివిగా అమ్ముతారు.దీనికే "శారిబాది రసము"అని ఆయుర్వేదములో పేరు.
గుంటూరు, క్రిష్ణా జిల్లాలలో "సుగంధి" ఎండాకాలంలో విక్రయిస్తూంటారు.
అలాగే ఆయా వస్తువులు, మందుల రూపములో వాని పేర్లు, వీలైతే ఆయుర్వేద ఔషధాల ఉత్పత్తిదారుల అడ్రసులు, అవీ ఇస్తూంటే ఉపయోగకరంగా ఉంటుంది.