దాల్చిన చెక్క అనగానే మషాలా వెంటనే జ్ఞాపకమొస్తుంది. బిరియాని తయారీలోనూ, మషాలా కూరలు తయారీలోనేగా దీని ప్రభావం ఉంటుందనేది అనే అభిప్రాయం అందరిలో ఉంది. కాని దానిలోనూ ఔషధ గుణాలున్నాయని కొందరికే తెలుస్తుంది. . దాల్చిన చెక్కకు సంస్కృతంలో ‘త్వక్’అనే పేరుంది. ‘దారుసితా’ (తియ్యని మాను కలిగినది అని అర్థం) అనేది కూడా దాల్చిన చెక్క పేరే.
- దాల్చినచెక్క: మసాలా పదార్థాల్లో, కేకుల్లో, కాఫీల్లో దీన్ని ఎక్కువగా వాడుతుంటాం. వాస్తవానికి ఇది రక్తంలో చక్కెరస్థాయుల్ని అదుపులో ఉంచుతుంది. వయసు పెరిగాక వచ్చే అల్జీమర్స్‌ని నివారిస్తుంది. క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి దాల్చినచెక్కకు ఉంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల కీళ్లకు సాంత్వన అందుతుంది. జీర్ణక్రియ పనితీరూ బాగుంటుంది. జలుబూ, దగ్గూ లాంటి వాటిని తగ్గించడమే కాదు... మొటిమల్ని నివారించడంలో, గుండె ఆరోగ్యం మెరుగుపరచడంలో, బరువును తగ్గించడంలో దాల్చిన చెక్క అద్బుతంగా పనిచేస్తుంది.
* తెలుగులో దాల్చిన పట్ట అనీ లవంగ పట్ట అనీ పిలుస్తారు. అయితే లవంగం చెట్టుకూ దాల్చిన చెట్టుకూ సంబంధం లేదు.
* దాల్చిన చెట్టు మానునుంచి వలిచిన పట్టని ఎండబెట్టి దాల్చిన చెక్క పేరుతో మార్కెట్లో విక్రయిస్తుంటారు.
* ‘బిర్యానీ ఆకు’ అనే పేరుతో మార్కెట్లో మనకు కనిపించేది ‘సిన్నమోమం తమాల’ (ఆకు పత్రకం) అనే చెట్టు ఆకులు. దాల్చిన ఆకులను తేజ్‌పత్ అంటారు.
* దాల్చిన చెక్కను ఔషధంగా వాడుకోదలిస్తే పట్ట చూర్ణాన్ని 1-3 గ్రాముల మోతాదులోనూ, పట్టనుంచి తీసిన సుగంధ తైలాన్ని 2-5 బిందువుల మోతాదులోనూ ఉపయోగించాలి.
* దాల్చిన చెక్కతో సితోపలాది చూర్ణం. త్వగాది లేహ్యం, త్వగాది చూర్ణం వంటి ఆయుర్వేద ఔషధాలు తయారవుతాయి.
దాల్చిన చెక్కను సాధారణంగా కూరల్లో వాడడమేకాకుండా పొడి చేసుకుని నీళ్ళలో కలుపుకుని తాగితే మంచి ఫలితానిస్తుంది. వాత వ్యాధులలో దాల్చిన చెక్క చాలా బాగా పని చేస్తుంది. దీనిని వాడడం వలన కడుపులో వాతం బాగా తగ్గుతుంది. ఒక్కొక్కమారు పిల్లలు కల్తీ తినుబండారాలు లాగించాస్తారు. అవి విషతుల్యమైనవి. ఇందులోని విషప్రభావాన్ని తగ్గించేందుకు దాల్చిన చెక్క రసాన్ని తీసుకోవడం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఒక్కొక్కమారు శరీరంలో నీరు అధికమవుతుంటుంది ఇలాంటి సమయంలో దానిని తొలగించడానికి దాల్చిన చెక్కను క్రమం తప్పకుండా తీసుకుంటే క్రమంగా ఉపశమనం లభిస్తుంది. పార్శ్వ నొప్పి అధికంగా ఉన్నవారు కాస్త దాల్చిన చెక్కను తీసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వరపేటిక వాపు, బొంగురు పోవడం వంటి వ్యాధులతోపాటు, గురగుర ఉన్నవారు చెక్కను దవడన పెట్టుకుని ఊటను మింగుతూ వస్తే అవన్నీ నయమయ్యే అవకాశం ఉంది. మహిళల్లోని రుతుదోషాల నివారణకు ఇది దివ్య ఔషదంలా పని చేస్తుంది. దీనిని తీసుకోవడం వలన రుతుస్రావం సరియైన సమయంలో జరిగేలా చేస్తుంది. గర్భదోషాలను కూడా మాయం చేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. జిగట విరేచనాలను నియంత్రంచడానికి దాల్చిన చెక్కను ఉడకబెట్టి పేస్టు చేసి దానిలో దానిలో కాస్తనెయ్యి, పటికబెల్లం కలిపి తీసుకుంటే చాలు. విరేచనాలు తగ్గుతాయి.
దాల్చిన చెక్కతో గుండెకు మేలు
మసాలా దినుసుల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది దాల్చిన చెక్క గురించి. ఇది వంటకాలకు రుచినీ, సువాసననూ అందిస్తుంది. గుండెకు ముప్పు వాటిల్లకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అరోమా గుణాలున్న దాల్చిన చెక్కలో పీచూ, క్యాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. హాని చేసే కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. దీనిలో యాంటీఫంగల్ గుణాలు అధికం. ఇది శరీరంలో హాని చేసే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. రక్తహీనతతో బాధపడే వారు ప్రతిరోజూ ఆహారంలో దాల్చిన చెక్క ఉండేలా చూసుకోవాలి ఇది చర్మానికి మేలు చేస్తుంది. ప్రతిరోజూ గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లలో చెంచా దాల్చిన చెక్కపొడీ, కొద్దిగా తేనె కలిపి తాగితే ఎంతో మంచిది.
కొన్ని ఔషధ గుణాలు :
- చర్మం ముడతలు, రంగు తగ్గటం దాల్చిన చెక్క పొడిని, గంధం పొడినీ రోజ్‌వాటర్‌తో కలిపి ఫేస్ ప్యాక్ చేసుకోవాలి. అలాగే చిటికెడు దాల్చిన చెక్క పొడిని ఒక స్పూన్ తేనెతో కలిపి ప్రతిరోజూ రాత్రిపూట తీసుకోవాలి.
- మొటిమలు, బ్లాక్‌హెడ్స్ --దాల్చిన చెక్క పొడిని, నిమ్మ రసాన్ని ముద్దగా కలిపి మొటిమల మీద ప్రయోగిస్తే జిడ్డు తగ్గి త్వరగా మాడిపోతాయి.
- అజీర్ణంవల్ల విరేచనాలు-- దాల్చిన చెక్క పొడి, శొంఠి పొడి, జీలకర్ర పొడిని సమభాగాలు కలిపి అర టీస్పూన్ మోతాదులో తేనెతో రెండుపూటలా తీసుకుంటే జీర్ణశక్తి పెరిగి, విరేచనాలు తగ్గుతాయి.
- జలుబు-- దాల్చిన చెక్క, మిరియాలు సమంగా తీసుకొని నూరి, కషాయం తయారుచేసుకొని తాగితే జలుబులో హితకరంగా ఉంటుంది.
- పంటి నొప్పి దాల్చిన నూనెలో దూదిని ముంచి దంతాల మీద ఉంచుకుంటే పంటి నొప్పి నుంచి ఉప శమనం లభిస్తుంది. దంతాలమీద మరకలు-- దాల్చిన ఆకులను మెత్తగా నూరి, పండ్లపొడి తయారుచేసుకొని వాడితే దంతాలు మిలమిల మెరుస్తాయి.
- నేత్రాల నొప్పి-- దాల్చిన నూనెను దూదితో తడిపి మూసిన కనురెప్పల మీద ప్రయోగిస్తే నేత్రాల నొప్పి తగ్గి ప్రకాశవంతంగా తయారవుతాయి. కళ్లు అసంకల్పితంగా కొట్టుకోవటం వంటి సమస్యలు తగ్గుతాయి.
దగ్గు-- దాల్చిన ఆకుల (తేజ్‌వత్) చూర్ణాన్ని ఒక టీస్పూన్ మోతాదుగా రెండు చెంచాలు తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.
- తల నొప్పి-- దాల్చిన నూనె గాని లేదా దాల్చిన చెట్టు ఆకుల పొడిని గాని లలాట భాగం మీద ప్రయోగిస్తే జలుబువల్ల గాని లేదా వేడివల్ల గాని వచ్చిన తల నొప్పి తగ్గుతుంది.
- రాజయక్ష్మ (ట్యుబర్కులోసిస్)--- దాల్చిన చెక్క తైలాన్ని అల్ప మాత్రలో అనునిత్యం తీసుకుంటుంటే క్షయ వ్యాధిలో సహాయక చికిత్సగా పనిచేస్తుంది.
- కీళ్ల నొప్పి (సంధివాతం) -- 30గ్రాముల దాల్చిన చెక్క పొడికి 30 గ్రాముల తేనె కలిపి పేస్టు మాదిరిగా తయారుచేసి సున్నితంగా కీళ్లమీద మర్ధించాలి. అలాగే 2 గ్రాముల దాల్చిన చెక్క పొడిని, ఒక చెంచాడు తేనెకు కలిపి మూడుపూటలా కడుపులోపలకూ తీసుకుంటూ ఉంటే కీళ్లనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
- కొలెస్ట్రాల్ ఆధిక్యత -- 3 టీస్పూన్ల దాల్చిన చెక్క పొడిని, 2 టీస్పూన్ల తేనెనూ ఒక టీ కప్పు నీళ్లకు కలిపి రోజుకు 3సార్లు విభజించి తీసుకుంటే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.
- పేగుల శబ్దాలు (ఆంత్రకూజనాలు) --- దాల్చిన చెక్కనుంచి తీసిన తైలాన్ని ఉదర భాగం మీద ప్రయోగించి మర్ధనా చేసుకుంటే పేగుల శబ్దాలు తగ్గుతాయి.
- వాంతులు-- దాల్చిన చెక్క (10గ్రాములు), లవంగాలు (5గ్రాములు) పరిమాణంగా తీసుకొని నీళ్లకు కలిపి కషాయం తయారుచేసుకొని తాగితే వాంతులు తగ్గుతాయి.
- చర్మవ్యాధులు, దురద, పొక్కులు ---దాల్చిన చెక్క పొడికి తేనె కలిపి బాహ్యంగా ప్రయోగిస్తే చర్మవ్యాధుల్లో ఉపశమనం లభిస్తుంది.
- =======================================
No comments:
Post a Comment