- =====================================
Wednesday, March 23, 2011
చేపనూనే , Fish Oils
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....
కొవ్వులు అనగానే చేటుచేస్తాయని భయపడతారు . అయితే అన్నిరకాల కొవ్వులు ఇబ్బంది పెట్టవు . చేపలలో లభించే కొవ్వులు ఆరోగ్యాన్ని యిస్తాయి. చేపనూనె లో దొరికె ఒమేగా -3 కొ్వ్వు ఆమ్లాలు మానవ రక్తప్రసరణ వ్యవస్థను బాగా మెరుగు పరుస్తాయి . ఇలా మేలు చేసే కొవ్వు ఆమ్లాలను " ఎసెన్సియల్ ఫ్యాటి యాసిడ్స్ " అంటారు . వీటిని తీసుకోవడం వల్ల శరీరం లోపలి అంగాలు సమర్ధవంతం గా పనిచేస్తాయి. కీళ్లు బలం గా తయారవుతాయి . హార్మొనుల వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది . వీటిని తీసుకోవడం వలన శరీరము లావెక్కదు .
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేపల వంటివి తీసుకోండి. ఎందుకంటే ఇవి తరచుగా తీసుకుంటున్నవారిలో చిగుళ్లవ్యాధి వచ్చే అవకాశం 23-30 శాతం తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.ఈ యాసిడ్లలో ముఖ్యంగా డీహెచ్‌ఏ, ఈపీఏ చిగుళ్లవ్యాధిని సమర్థంగా అడ్డుకుంటున్నాయని తేలింది. చేపల్లో సార్త్డెన్స్, మాకెరెల్, స్వార్డ్‌ఫిష్‌లతో పాటు అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్), వాల్‌నట్స్‌ల్లోనూ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి.
'కాడ్' అనే చేప లివర్ నుండి తీసిన కాడ్ లివర్ ఆయిలే చేపనూనెగా ప్రసిద్ధి పొందింది. ఈ తైలంలో విటమిన్-ఎ, డిలతో పాటు ఎస్సెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
ఉపయోగాలు-- ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మం పొడిబారే వ్యా«ధులకు ఈ తైలం క్యాప్సూల్స్ బాగా ఉపయోగపడతాయి. వీటితో పాటే క్రీముగా చర్మంపై పూతగా వాడితే దురదలు తగ్గుతాయి. * ఇందులోని విటమిన్లు యాంటిఆక్సిడెంట్స్‌గా పనిచేస్తూ చర్మాన్ని కాపాడ తాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment