- =================================
Wednesday, March 30, 2011
పండ్లు కూరగాయల చెక్కు(తొక్క)ఉపయోగము,Use of outerpeel of Fruits - Vegetable
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....
యాపిల్, సపోటా వంటి చాలా పండ్లను మనం చెక్కు, తొక్క తీసేసి తింటుంటాం కదా. వంట చేసేటప్పుడు గోబీలాంటి కూరగాయల కాడలనూ ఎంతోమంది పారేస్తుంటారు. నిజానికివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవటమే కాదు మంచి పోషకాలనూ అందిస్తాయి. కూరగాయలు, పండ్లలోని పోషకాల విలువ వాటిల్లోని అన్ని భాగాలతో మిళితమై ఉంటుంది. అందుకే పండ్లను చెక్కు తీయకుండా తినటం మంచిదనే దానికి ప్రాచుర్యం పెరుగుతోంది. కొన్ని పండ్ల చెక్కులో యాంటీఆక్సిడెంట్లు దండిగా ఉంటాయి. ఇవి క్యాన్సర్లను అడ్డుకుంటాయి. అలర్జీలు, వాపు నివారిణిలుగానూ పనిచేస్తాయి. ఇక బ్రకోలీ, గోబీలాంటి వాటి పువ్వుల్లో కన్నా కాడల్లోనే క్యాల్షియం, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పండ్లు, కూరగాయలను మొత్తంగా తినటం అలవాటు చేసుకుంటే.. అటు పోషకాహారంగానూ ఇటు వ్యాధి నిరోధకాలుగానూ పనిచేస్తాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment