- మందారాలు రకరకాలు
1. చైనా మందారం - సాధారణంగా మనం చూసే ఎర్రని మందారం ఇది. దీనికి సారవంతమైన భూమి కూడా అవసరం లేదు. సాధారణ నేలలో పెరుగుతుంది. ఆకులు చిన్నవిగా వుండి దట్టంగా ఎదుగుతుంది. రోజూ నీరు పెట్టాలి. వర్షాకాలంలో రోజు మార్చి రోజు పెడితే చాలు. పురుగు పట్టకుండా వేపనీరు చల్లండి.
2. హిబిస్కస్ రోసా- తక్కువ ఎరుపు పూలు, గాఢమైన ఆకుపచ్చ ఆకులు. నీరు అధికంగా అవసరంలేదు. ఏ నేల అయినా పరవాలేదు. దానికదే పోషణ చేసుకుంటుంది.
3. పసుపు మందారం - పూవు రేకలు పెద్దవి. పువ్వు తేలికగా సున్నితంగా వుంటుంది. అన్ని వెరైటీలలో కంటే ఈ వెరైటీ మందారం ఎక్కువకాలం జీవిస్తుంది. పూలు పెద్దవి అయినప్పటికి మొక్క చిన్నదిగా వుంటుంది. పూలకుండీలలో పెంచవచ్చు. కాండం గోడల సపోర్టు తీసుకుంటుంది.
.
4. మలేషియా మందారం - ఇది మలేషియాలోపుట్టటం చేత ఈ పేరు వచ్చింది. మొక్క సున్నితం. ఇంటి గార్డెన్ లో పెరగటం కష్టం. నర్సరీలు అనుకూలం. పూలు పెద్దవిగా కిచెన్ ప్లేట్ వలే వుంటాయి.
5.హవాయి మందారం - ఇది ఎంతో ప్రత్యేకత కలిగినది. కొద్దిపాటి జాగ్రత్త వుంటే చాలు బాగా పెరుగుతుంది. దీనికి మంచి సారవంతమైన నేల వుండాలి. మొక్కకు ఆహారం సరి లేకపోతే పూలు వచ్చే ముందే మొగ్గలు ఎండిపోతాయి
- ఆరోగ్య ఉపయోగలు
ముఖ్యంగా యూనాని మందులలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీంతో శరీరంలోని కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధి, గొంతుకు సంబంధించిన వ్యాధులు తదితర జబ్బులకు మంచి ఔషధంలా పనిచేస్తుందంటున్నారు ఆయుర్వేదవైద్యులు.
ఇందులో విటమిన్ సి, క్యాల్షియం, పీచుపదార్థం (ఫైబర్), ఐరన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, టెటరిక్, ఆక్సీలిక్ యాసిడ్, ఫ్లేవోనైడ్ గ్లైకోసైడ్స్ తగు మోతాదులో లభిస్తాయి. వీటివలన శరీరం ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
మందారపువ్వును హెర్బల్ టీ, కాక్టేల్ రూపాలలోను సేవించవచ్చు. పూలను ఎండబెట్టి హెర్బల్ టీగా తీసుకోవచ్చు. దీనిని ఎలా తయారు చేయాలంటే...
నీటిని ఉడకబెట్టిన తర్వాత ఎండిన మందార పువ్వులను అందులో వేయండి. అందులో చక్కెర, కాస్త టీపొడి కలుపుకుని టీలాగా తయారు చేసుకోండి. దీంతో హైబిస్కస్ హెర్బల్ టీ తయారవుతుంది. ప్రతి రోజు దీనిని సేవిస్తుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు వైద్యులు.
అలాగే కాక్టేల్ టీ కొరకు దీనిని చల్లగా చేసి అందులో కొన్ని ఐసు ముక్కలు వేసుకుని తాగితే అదే కాక్టేల్ టీ. ఇలా ప్రతి రోజు తీసుకుటుంటే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు.
- ==========================
No comments:
Post a Comment