- ===================
Friday, May 11, 2012
పుల్లటి పండ్లు పక్షవాతం నుంచి కాపాడు, Sour(citrus)Fruits protect from paralysis
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవటం ఆరోగ్యానికి అన్నివిధాలా మంచిదన్నది తెలిసిందే. అయితే పండ్లు.. ముఖ్యంగా నారింజ వంటి పుల్లటి పండ్లు చేసే మేలు గురించి కొత్త సంగతి బయటపడింది. వీటిని ఎక్కువగా తీసుకుంటున్నవారికి పక్షవాతం ముప్పు తక్కువగా ఉంటున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. నిజానికి పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినేవారికి గుండెజబ్బులు, పక్షవాతం ముప్పు తక్కువన్నది పాత విషయమే. అయితే దీనికి కారణమవుతున్నవేంటో అనేది కచ్చితంగా బయటపడలేదు. ఇంగ్లాడులోని ఈస్ట్ యాంజ్లియా విశ్వవిద్యాలయం పరిశోధకులు దీనిపైనే దృష్టిపెట్టి అధ్యయనం చేశారు. పుల్లటి పండ్లల్లో రకరకాల ఫ్లావనాయిడ్లు ఉంటాయి. ఈ ఫ్లావనాయిడ్లలో ఒకరకమైన ఫ్లావనోన్లు.. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టటం మూలంగా వచ్చే పక్షవాతం ముప్పును తగ్గిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇవి రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. వాపును తగ్గిస్తాయి. అందువల్లే పక్షవాతం ముప్పును తగ్గించగలుగుతున్నాయని చెబుతున్నారు. అయితే వీటి ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే పండ్ల రసాన్ని తాగటం కన్నా నేరుగా పండ్లనే తినటం మంచిదని సూచిస్తున్నారు. మామూలు బరువుగల నారింజ పండులో సుమారు 50 మిల్లీగ్రాముల ఫ్లావనోన్లు ఉంటాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఏడిన్ క్యాసిడీ అంటున్నారు. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినటంతో పాటు పొగ మానెయ్యటం, వ్యాయామం చెయ్యటమూ ముఖ్యమేనని వివరించారు. మొత్తమ్మీద పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినటం ఆరోగ్యానికి ఎంతో అవసరమని ఈ అధ్యయనం మరోసారి రుజువు చేసింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment